Monday, June 9, 2008

రిజిస్ట్రీ క్లీనర్లు (Registry Cleaners )


క్రొత్త ప్రోగ్రాములు ఇనస్టలేషన్ చేసి, తర్వాత వాటిని సరైన పధ్దతి లో అన్ ఇనస్టలేషన్ చేయనప్పుడు వాటికి సంబంధించిన ఎంట్రీలు రిజిస్ట్రీ లో మిగిలి పోతాయి. ఇలా మిగిలిపోయిన ఎంట్రీలను తొలగించకపోతే అవి సిస్టం యొక్క పనితనం మీద ప్రభావాన్ని చూపుతాయి. రిజిస్ట్రీ లో మిగిలి పోయిన పనికిరాని ఎంట్రీలను తొలగించటానికి రిజిస్ట్రీ క్లీనర్లు వుపయోగపడతాయి. రిజిస్ట్రీ క్లీనర్లు రిజిస్ట్రీ ని పూర్తిగా స్కాన్ చేసి ఎర్రర్లను ఫిక్స్ లేదా కరక్ట్ చేయటానికి ప్రయత్నిస్తాయి. ఒక్కొకసారి ఈ రిజిస్ట్రీ క్లీనర్లు మేలు కు బదులు కీడు కూడా చేస్తాయి, ఇవి స్కాన్ చేసి చూపించిన లిస్ట్ లోని ఎంట్రీ లను తొలగించే ముందు ఒకటి రెండు సార్లు సరి చూసుకోవాలి, డౌట్ వస్తే మాత్రం ఎంట్రీ లను తొలగించవద్దు. ముందుగా రిజిస్ట్రీ ని బాక్ అప్ తీసుకోవటం మరువవద్దు. క్లీన్ చేయబడిన రిజిస్ట్రీ వలన సిస్టం పనితనం మెరుగుపడుదుంది అనటం లో ఏమాత్రం సందేహం లేదు.

ఉచిత రిజిస్ట్రీ క్లీనర్లు దొరికే వెబ్ సైట్లు http://www.ccleaner.com/, http://personal.inet.fi/business/toniarts/ecleane.htm

Registry Cleaners are used to clean unwanted entries in the registry. For fee regitry cleaners visit http://www.ccleaner.com/, http://personal.inet.fi/business/toniarts/ecleane.htm

ధన్యవాదాలు

Friday, June 6, 2008

ఫ్రీ ఆన్ లైన్ ట్రైనింగ్ కోర్సెస్ (Free Online Training Courses)


ఫ్రీ ఆన్ లైన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పుస్తకాలు, ట్యుటోరియల్స్, లెక్చర్ నోట్స్ కోసం ఈ క్రింది వెబ్ సైట్ల ను సందర్శించండి...
http://www.e-learningcenter.com/free.htm, http://h30240.www3.hp.com/index.jsp, http://freecomputerbooks.com/, http://cslibrary.stanford.edu/ , http://www.freetechbooks.com/

For free online computer training cousres visit above said websites.

ధన్యవాదాలు

Thursday, June 5, 2008

COMODO Personal Firewall


ఫైర్ వాల్ - సాప్ట్ వేర్ లేదా హార్డ్ వేర్ కావచ్చు- సిస్టం లో ప్రవేశించే అన్ ఆధరైజ్ద్ ఎంట్రీల నుండి కాపాడుతుంది. పర్సనల్ ఫైర్ వాల్ సాప్ట్ వేర్ల లో COMODO Personal Firewall బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిని http://www.personalfirewall.comodo.com/ నుండి వుచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Firewall prevents from unauthorised entries into a system. COMODO Personal Firewall is better than most other personal firewalls. This can be downloaded from http://www.personalfirewall.comodo.com/

ధన్యవాదాలు

Wednesday, June 4, 2008

ఈనాడు స్పోకెన్ ఇంగ్లీష్


ఈనాడు దిన పత్రిక లో ప్రచురించే స్పోకెన్ ఇంగ్లీష్ వ్యాసాల కోసం http://www.eenadu.net/spoken/spoken.htm కి వెళ్ళండి.

ధన్యవాదాలు

’సాప్ట్’ గా దగా !!

Monday, June 2, 2008

యాంటీ స్పైవేర్ - స్పైబాట్ ( Anti-spyware)


సాధరణంగా స్పైవేర్ లు వుచిత స్క్రీన్ సేవర్లు, వాతావరణ వివరాలు తెలిపే ప్రోగ్రాము ల ద్వారా మన కంప్యూటర్ లోకి చేరతాయి. సైవేర్ ను తొలగించటానికి వుపయోగించే యాంటీ స్పైవేర్ టూల్స్ లో Spybot - Search & Destroy బెస్ట్ అని చెప్పవచ్చు. దీనిని http://www.safer-networking.org/en/spybotsd/index.html నుండి వుచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టూల్ ని ఇనస్టలేషన్ చేసి అప్లికేషన్ ని ఓపెన్ చేసి Serch & Destroy బటన్ పై క్లిక్ చేసి... Chek for Problems మీద క్లిక్ చేయండి. సిస్టం స్కాన్ చేయబడుతుంది...ఇది చాలా టైమ్ పడుతుంది... స్కానింగ్ పూర్తి అయిన తర్వాత ప్రాబ్లమ్ వున్న ఎంట్రీస్ ను చూపిస్తుంది, ఎంట్రీస్ ను సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు.

Recovery బటన్ ప్రాబ్లమ్ ఫిక్స్ చేసిన తర్వాత రిజిస్ట్రీ లో జరిగిన మార్ప్లను ’UNDO' చేయటానికి వుపయోగపడుతుంది. ప్రాబ్లమ్ ఫిక్స్ చేసిన తర్వాత ఏ అప్లికేషన్ అయినా పని చేయక పోతే ఈ విధంగా చెయ్యాలి.

Immunisation బటన్ సిస్టం స్పైవేర్ అటాక్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియచేస్తుంది.

Spybot -Search & Destroy is the best tool for countering Spyware, this can be downloded from http://www.safer-networking.org/en/spybotsd/index.html

ధన్యవాదాలు