Monday, July 20, 2009

Windows XP లో Pen Drive ని అదనపు RAM గా ఉపయోగించుకోండి...

ఇంతవరకు రెడీ బూస్ట్ టెక్నాలజీని ఉపయోగించి Windows Vista లో పెన్ డ్రైవ్ ని అదనపు RAM గా ఉపయోగిస్తున్నాం... అదే ఫీచర్ Windows XP లో ఉంటే ఎంత బాగుండు అని అనిపించేది... ఇప్పుడు eBoostr అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి Windows XP లో కూడా పెన్ డ్రైవ్ ని అదనపు RAM గా ఉపయోగించుకోవచ్చు... eBoostr ట్రయల్ వెర్షన్ అయినప్పటికి దీనిని మనం అవసరమైనంత కాలం ఉపయోగించుకోవచ్చు ...expire కాదు. కాకపోతే మన సిస్టం ని ప్రతి నాల్గు గంటల కొకసారి రీబూట్ చెయ్యాలి. ఇది Windows Vista, Windows XP, Windows 2000*, Windows 2003 Server, Windows 2008 Server, Windows 7RC (all 32 and 64 bit systems) లలో పని చేస్తుంది.



మరిన్ని వివరాలకు eBoostr సైట్ ని చూడండి.

డౌన్లోడ్: eBoostr (సైజ్ 2.3 MB)

ధన్యవాదాలు

Saturday, July 18, 2009

MyAlgebra - the place to solve your algebra problems!!!

చిన్నప్పుడు ఆల్ జీబ్రా ... గుండె గాభరా అనే వాళ్ళు... ఇప్పుడు గాభరా పడవలసిన అవరసరం లేకుండా Algebra ప్ర్రాబ్లమ్స్ ని సాల్వ్ చెయ్యటానికి MyAlgebra సైట్ కి వెళ్ళి సమస్య ను ఎంటర్ చేసి ’Answer' బటన్ పై క్లిక్ చేస్తే మీ సమస్యకు సమాధానం వస్తుంది.



టాపిక్ వారిగా ఉదాహరణ లు కూడా వున్నాయి.

ధన్యవాదాలు

Friday, July 17, 2009

Photocopier - స్కానర్ మరియు ప్రింటర్ ని ఫోటోకాపియర్ (జిరాక్స్ మెషీన్) గా ఉపయోగించుకోవటానికి ఊచిత సాప్ట్ వేర్

మీ దగ్గర Scanner మరియు Printer వున్నాయా ...Photocopier (జిరాక్స్ మెషీన్) లేదా? అయితే Photocopier అనే ఉచిత సాప్ట్ వేర్ ని ఉపయోగించి మీ దగ్గర వున్న Scanner మరియు Printer లను ఫోటోకాపియర్ ఉపయోగించుకోవచ్చు. ముందుగా Photocopier ని డౌన్ లోడ్ చేసి ఇనస్టలేషన్ చేసుకోవాలి. స్కానర్ మరియు ప్రింటర్ ఆన్ లో వుంచి స్కానర్ పేపర్ పెట్టి Photocopier అప్లికేషన్ ఓపెన్ చేసి ’Copy' బటన్ పై క్లిక్ చేస్తే స్కానర్ లో పెట్టిన పేపర్ ప్రింట్ అవుతుంది ...అదీ తక్కువ సమయంలో ... కావలసినన్ని కాపీలు ప్రింట్ చేసుకోవచ్చు. బ్రైట్ నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, సైజ్ తగ్గించుకోవచ్చు.




డౌన్లోడ్ : Photocopier (సైజ్ 1.10 MB మాత్రమే)

ధన్యవాదాలు

Wednesday, July 15, 2009

FavBackup - బ్రౌజర్ సెట్టింగ్స్ బ్యాక్ అప్ లేదా రీస్టోర్ చెయ్యటానికి...

వెబ్ బ్రౌజర్ సెట్టింగ్స్, బుక్ మార్క్స్, పాస్ వార్డ్స్, హిస్టరీ మొదలగునవి బ్యాక్ అప్ లేదా రీస్టోర్ చెయ్యటానికి FavBackup అనే చిన్న బ్యాక్ అప్ యుటిలిటీ ఉపయోగపడుతుంది. FavBackup ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, exe ఫైల్ ని రన్ చేస్తే వచ్చే FavBackup Wizard లో Backup లేదా Restore ని సెలెక్ట్ చేసుకొని తర్వాత బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.



ఇప్పుడు ’Next' బటన్ క్లిక్ చేస్తే వచ్చే Backup Wizard లో Bookmarks, History, Plugin data ఇలా కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకొని, బ్యాక్ అప్ లొకేషన్ ని కూడా సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ ని క్లిక్ చెయ్యాలి.



సెలెక్ట్ చేసుకొన్న ఫోల్డర్ లో బ్యాక్ అప్ పూర్తి అయిన తర్వాత బ్యాక్ అప్ తియ్యబడిన ఐటెమ్స్ ఎదురుగా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ’Finish' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

అదే విధంగా రీస్టోర్ కూడా చెయ్యవచ్చు.


ధన్యవాదాలు

Gmail లో మీ Task లను పొందుపర్చుకోండి!!!

Gmail లో Task అనే క్రొత్త ఫీచర్ జత చెయ్యబడింది....దీనిలో మీ Task లను ఎంటర్ చేసి పొందుపర్చుకోవచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం Gmail Blog ని చూడండి



Google Calender కి సంబంధించిన సమాచారం కోసం Googls Apps Blog ని సందర్శించండి.

ధన్యవాదాలు

Tuesday, July 14, 2009

Spam మరియు Phishing నుండి మీ Gmail ని కాపాడుకోండి !!!

Spam మరియు Phishing నుండి మీ Gmail ని కాపాడుకోవటానికి Gmail లాగిన్ అయ్యి Settings---> Labs కి వెళ్ళి "Authentication icon for verified senders" ని Enable చేసి సేవ్ చేసుకోవాలి. Inbox లో sender కి ముందు key ఐకాన్ వుంటే కనుక అది super-trustworthy మెసేజ్ అన్నమాట. ప్రస్తుతానికి ఈ సర్వీస్ PayPal మరియు eBay ల నుండి వచ్చే మెయిల్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ముందు ముందు మిగతా senders ని కూడా యాడ్ చేసే అవకాశం వుందని Gmail చెపుతుంది. ఏది ఏమైనా ఇదొక మంచి పరిణామంగా చెప్పవచ్చు.




దీనిని గురించి మరింత సమాచారం కోసం Gmail Blog ని చూడండి.

ధన్యవాదాలు

Powerutils - మైక్రోసాప్ట్ Excel కోసం 99 శక్తివంతమైన యుటిలిటీలు

Prasanta Das Gupta గారి చే రూపొందించబడిన Powerutils అనే ప్రోగ్రామ్ లో మైక్రోసాప్ట్ Excel లో సులభంగా మరియు వేగంగా పనిచెయ్యటం కోసం 99 శక్తివంతమైన యుటిలిటీలు వున్నాయి. ముందుగా మనం చెయ్యవలసినదల్లా Powerutils ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, అంతే Excel లో మెయిన్ మెనూ లో Powerutils జతచెయ్యబడుతుంది. మన రోజువారీ అవసరాలకు ఉపయోగపడే ఎన్నో ఫంక్షన్లు Powerutils వున్నాయి. ప్రముఖ సాంకేతిక పత్రికలచే బెస్ట్ సాప్ట్ వేర్ గా Powerutils గుర్తింపబడినది.



Powerutils ని ఇనస్టలేషన్ లో కాని ఉపయోగించటం లో కాని ఇబ్బందులు ఎదురయితే దాని రూపకర్త Prasanta Das Gupta గారిని prasantad@tatamotors.com మెయిల్ ఐడి లో సంప్రదించవచ్చు.

Excel ఎక్కువగా ఉపయోగించే వారి దగ్గర తప్పకుండా వుండవలసిన సాప్ట్ వేర్ ఇది.

ధన్యవాదాలు