Wednesday, July 15, 2009

FavBackup - బ్రౌజర్ సెట్టింగ్స్ బ్యాక్ అప్ లేదా రీస్టోర్ చెయ్యటానికి...

వెబ్ బ్రౌజర్ సెట్టింగ్స్, బుక్ మార్క్స్, పాస్ వార్డ్స్, హిస్టరీ మొదలగునవి బ్యాక్ అప్ లేదా రీస్టోర్ చెయ్యటానికి FavBackup అనే చిన్న బ్యాక్ అప్ యుటిలిటీ ఉపయోగపడుతుంది. FavBackup ని ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు, exe ఫైల్ ని రన్ చేస్తే వచ్చే FavBackup Wizard లో Backup లేదా Restore ని సెలెక్ట్ చేసుకొని తర్వాత బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకోవాలి.



ఇప్పుడు ’Next' బటన్ క్లిక్ చేస్తే వచ్చే Backup Wizard లో Bookmarks, History, Plugin data ఇలా కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకొని, బ్యాక్ అప్ లొకేషన్ ని కూడా సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ ని క్లిక్ చెయ్యాలి.



సెలెక్ట్ చేసుకొన్న ఫోల్డర్ లో బ్యాక్ అప్ పూర్తి అయిన తర్వాత బ్యాక్ అప్ తియ్యబడిన ఐటెమ్స్ ఎదురుగా గ్రీన్ కలర్ టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ’Finish' బటన్ పై క్లిక్ చెయ్యాలి.

అదే విధంగా రీస్టోర్ కూడా చెయ్యవచ్చు.


ధన్యవాదాలు