Thursday, July 14, 2011

డ్రాప్ బాక్స్ లో ఫైళ్ళను శాశ్వతంగా తొలగించటానికి!!!

ఉచిత 2GB స్టోరేజ్ ని అందిస్తున్న Dropbox లో ఉన్నఒక మంచి అడ్వాంటేజ్ ఏమిటంటే పొరపాటున లేదా కావలసి తొలగించిన ఫైళ్ళను రీస్టోర్ చేసుకోవచ్చు. తర్వాత డిలీట్ చేసిన ఫైళ్ళను మరల రీస్టోర్ చేసుకోకుండా శాశ్వతంగా తొలగించటానికి ఈ క్రింది విధంగా చెయ్యాలి:

౧. ముందుగా Dropbox సైట్ కి వెళ్ళి లాగిన్ చెయ్యాలి . తర్వాత Show deleted files పై క్లిక్ చెయ్యాలి, అక్కడ మనం ఇంతకుముందు డిలీట్ చేసిన ఫైళ్ళు మరియు ఫోల్డర్లు చూపిస్తుంది.



౨. ఇప్పుడు డిలీట్ అయిన ఫైళ్ళను శాశ్వతంగా తొలగించటానికి వాటిని సెలెక్ట్ చేసుకుని  More పై క్లిక్ చేసి Permanently Delete పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇక ఫైళ్ళు శాశ్వతంగా తొలగించబడతాయి.



ధన్యవాదాలు

Wednesday, July 13, 2011

Docspal - ఆన్ లైన్ లో డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో మరియు ఇమేజ్ లను ఒక ఫార్మేట్ నుండి వేరొక ఫార్మేట్ లోకి మార్చటానికి!!!

Docspal అనే సైట్ కి వెళ్ళి ఆన్ లైన్ లోనే డాక్యుమెంట్లు, ఆడియో, వీడియో, ఇమేజ్, ఈ-బుక్స్ మొదలగు వాటిని ఒక ఫైల్ ఫార్మేట్ నుండి కావలసిన మరొక ఫైల్ ఫార్మేట్ లోకి మార్చవచ్చు, అదీ కేవలం మూడే మూడు స్టెప్పుల్లో.

 
Docspal సైట్ కి వెళ్ళి ఫార్మేట్ మార్చవలసిన ఫైల్ ని బ్రౌజ్ చేసి అప్ లోడ్ చేసుకోవాలి. తర్వాత Convert to దగ్గర మనకు కావలసిన ఫైల్ ఫార్మేట్ ని ఎంచుకోవాలి. చివరగా Convert బటన్ పై నొక్కాలి. అంతే కన్వర్ట్ చేసి ఫైల్ ని చూపిస్తుంది, దాని పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

సైట్: Docspal

ధన్యవాదాలు

Saturday, July 9, 2011

Foto2Avi - ఫోటోలను ఆకర్షణీయమైన వీడియో స్లైడ్ షో గా మార్చటానికి!!!

డిజిటల్ కెమేరా లేదా సెల్ ఫోన్ లో తీసిన ఫోటోలను పీసీ లేదా టీవీ లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరియు సబ్‌టైటిల్స్ లో చూడాలంటే కనుక వాటిని వీడియో స్లైడ్‌షో లుగా మార్చాలి. అలా మార్చటానికి ఉయోగపడే ఉచిత సాప్ట్‌వేర్ మైక్రోసాప్ట్ ఫోటోస్టోరీ గురించి గతం లో తెలుసుకున్నాం. అటువంటిదే మరొక ఉచిత టూల్ Foto2Avi. దీనిని  ఉపయోగించి కూడా స్పెషల్ ఎఫెక్ట్స్ , యానిమేషన్, ట్రాన్సిషన్స్, సబ్‌టైటిల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలగు వాటితో మన డిజిటల్ ఫోటోలను ఆకర్షణీయమైన HD వీడియో స్లైడ్ షో లు గా మార్చెయ్యవచ్చు. పేరులో ఉన్నట్ట్లు కేవలం avi ఫార్మేట్టే కాకుండా వీడియోని  ఇతర ఫార్మేట్లలో కూడా క్రియేట్ చేసుకోవచ్చు.  



Download: Foto2Avi

ధన్యవాదాలు

Friday, July 8, 2011

Driver Magician Lite - హార్డ్ వేర్ డ్రైవర్స్ ని బ్యాక్ అప్ తీసుకోవటానికి!!!

Driver Magician Lite అనే ఫ్రీవేర్ ని ఉపయోగించి పీసీ లోని హార్డ్ వేర్ డ్రైవర్లను కావలసిన లొకేషన్ లో బ్యాక్ అప్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా పీసీ ఫార్మేట్ చేసి ఆపరేటింగ్ సిస్టం తిరిగి ఇనస్టలేషన్ చేసినప్పుడు డ్రైవర్స్ రీస్టోర్ చేసుకోవచ్చు.


డౌన్లోడ్: Driver Magician Lite

Thursday, July 7, 2011

YouSendIt - 2GB వరకు ఫైల్స్ లేదా ఫోల్డర్లు కావలసిన వారి మెయిల్ కి పంపటానికి!!

YouSendIt అనే సైట్ కి వెళ్ళి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా  2GB వరకు ఫైల్స్ లేదా ఫోల్డర్లు కావలసిన వారి మెయిల్ కి పంపవచ్చు, అదీ ఉచితంగా . YouSendIt  సైట్ కి వెళ్ళి మన మెయిల్ ఐడీ మరియు మనం ఫైల్ లేదా ఫోల్డర్ పంపవలసిన వారి మెయిల్ ఐడీ కూడా ఎంటర్ చెయ్యాలి. Select File పై క్లిక్ చేసి పంపవలసిన ఫైళ్ళను ఎంచుకోవాలి. తర్వాత SEND IT పై క్లిక్ చెయ్యాలి అంతే ఫైళ్ళు అవతలి వారి మెయిల్ కి పంపబడతాయి.


వెబ్ సైట్: YouSendIt

ధన్యవాదాలు

Wednesday, July 6, 2011

స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవటానికి యూట్యూబ్ ఛానెల్స్!!



ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడాలనుకొనే వారు ఈ క్రింది యూట్యూబ్ చానెళ్ళలోని ఉచిత ట్యుటోరియల్స్ ని చూడండి.

౧. EF podEnglish

Time, Families, Directions, Grocery shopping, Weather, Pets, School friends, Relationships, Films and Technology మొదలగు టాపిక్స్ కి సంబంధించిన ఇంగ్లీష్ చిన్న చిన్న వీడియో ట్యుటోరియల్స్ ని podEnglish లో చూడవచ్చు. ఇది ముఖ్యంగా బిగినర్స్ కి ఉపయోగపడే ఛానెల్.



౨. English with Jennifer

జెన్నిఫర్ అనే ఇనస్ట్రక్టర్ నేర్పించే వీడియో ట్యుటోరియల్స్ ఇక్కడ ఉన్నాయి. Basic English Grammar Lessons, English Vocabulary, English Pronunciation, and American Slang మొదలగు వాటికి సంబంధించిన ప్లేలిస్ట్స్ ఉన్నాయి.



౩. engVid.com

ఇక్కడ 150 కి పైగా వీడియో పాఠాలు ఉన్నాయి:



౪. Hugosite.com



౫. Mister Duncan In England



ధన్యవాదాలు

Tuesday, July 5, 2011

File Repair - కరప్ట్ అయిన ఫైల్స్ ని రిపేర్ చెయ్యటానికి!!!

వైరస్ వలన కానీ, సిస్టం క్రాష్ వలన కానీ మరి ఏ యితర కారణాల వలన కరఫ్ట్ అయిన ఫైళ్ళను రిపేర్ చెయ్యటానికి File Repair అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. File Repair కరప్ట్ అయిన ఫైల్ ని పూర్తిగా స్కాన్ చేసి సాధ్యమైనంతవరకు డాటాని ఎక్స్ ట్రాక్ట్ చెయ్యటానికి ప్రయత్నిస్తుంది.


ఈ క్రింది సందర్భాలలో కరప్ట్ అయిన ఫైళ్ళను File Repair రిపేర్ చేస్తుంది:


  • unexpected power failure

  • network interruption

  • virus infection

  • network sharing

  • application errors




  • కరప్ట్ అయిన ఈ క్రింది ఫైల్ ఫార్మేట్లను రిపేర్ చెయ్యవచ్చు:


    • corrupted Word documents (.doc, .docx, .docm, .rtf)
    • corrupted Excel spreadsheets (.xls, .xla, .xlsx)
    • corrupted Zip or RAR archives (.zip, .rar)
    • corrupted videos (.avi, .mp4, .mov, .flv, .wmv, .asf, .mpg)
    • corrupted JPEG, GIF, TIFF, BMP, PNG or RAW images (.jpg, .jpeg, .gif, .tiff, .bmp, .png)
    • corrupted PDF documents (.pdf)
    • corrupted Access databases (.mdb, .mde, .accdb, .accde)
    • corrupted PowerPoint presentations (.ppt, .pps, .pptx)
    • corrupted music (.mp3, .wav)
    ఈ క్రింది ఎర్రర్స్ ని ఫిక్స్ చేస్తుంది:

    List of the errors to be fixed:

    • file is not in a recognizable format
    • unable to read file
    • file cannot be accessed
    • application cannot open the type of file represented by filename
    • out of memory errors, or low system resources errors

    డౌన్లోడ్: File Repair

    ధన్యవాదాలు