Tuesday, May 31, 2011

TrashMail.Net - డిస్పోసబుల్ ఈ-మెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకోవటానికి! [ ఫైర్‍ఫాక్స్ యాడ్-ఆన్]

అంతర్జాలంలో వివిధ సైట్లలో విహరించేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో ఈ-మెయిల్ అడ్రస్ ఇవ్వవలసివస్తుంది, తర్వాత ఆ సైట్ నుండి మెయిల్స్ వస్తూ ఒక్కొక్క సారి మనకు చిరాకు తెప్పిస్తూ ఉంటాయి, ఒరిజినల్ మెయిల్ ఐడీ ఇవ్వకుండా టెంపరరీ మెయిల్ ఐడీ సృష్టించు కోవటానికి TrashMail.Net అనే ఫైర్‍ఫాక్స్ యాడ్-ఆన్ సహాయపడుతుంది. కొంత కాల పరిమితి వరకు టెంపరరీ మెయిల్ పనిచేసేలా సెట్ చేసుకోవచ్చు, ఆ ఐడీకి వచ్చే మెయిల్స్ మన ఒరిజినల్ ఐడీకే వస్తాయి. ఒక విధంగా స్పామ్ ని కూడా నిరోధించవచ్చు.

TrashMail.net Tutorial ఇక్కడ చూడండి:




డౌన్లోడ్: TrashMail.Net

ధన్యవాదాలు

Monday, May 30, 2011

iPrint - ప్రింటింగ్ వ్యయాన్ని తగ్గించటానికి వర్చువల్ ప్రింటర్ !!!

iPrint అనే ఉచిత వర్చువల్ ప్రింటర్ డ్రైవర్ ఆటోమాటిక్ గా అనవసరమైన పేజీలను తొలగించి, మల్టిపుల్ పేజీలను ఒకే పేజీలో వచ్చేలా చేసి మన ప్రింటింగ్ వ్యయాన్ని మరియు సమయాన్ని తగ్గిస్తుంది. ప్రింట్ లో అవసరం లేని వాటిని సెలెక్ట్ చేసుకొని మనం తొలగించే సదుపాయం కూడా ఉంది. దీంతో ప్రింటర్ ఇంక్ మరియు పేపర్ ని సేవ్ చెయ్యవచ్చు.

iPrint ఫీచర్లు:



మరింత సమాచారం కోసం iPrint సైట్ చూడండి.

డౌన్లోడ్: iPrint

Sunday, May 29, 2011

Livescribe Pen - స్మార్ట్ పెన్ - దీనితో వ్రాసిన నోట్స్ ని డైరెక్ట్ గా క్లౌడ్ కి అప్‍లోడ్ చెయ్యవచ్చు!!!

Livescribe Pen సాధారణ పెన్ వలే ఇంక్ ని కలిగి పేపర్ పై వ్రాసే విధంగా ఉంటుంది, దీనితో ప్రత్యేకమైన పేపర్ పై వ్రాసిన నోట్స్ ని ఇది రికార్డ్ చేస్తుంది, అవసరమైతే మీటింగ్ జరుగుతున్నప్పుడు నోట్స్ తో పాటు ఆడియో కూడా రికార్డ్ చెయ్యవచ్చు. ఇలా చేతితో వ్రాసిన నోట్స్ ని USB కేబుల్ సహాయంతో పీసీ లోకి లేదంటే డైరెక్ట్ గా గూగుల్ డాక్స్, ఎవర్ నోట్, ఈ-మెయిల్ , ఫేస్ బుక్ మొదలగు వాటికి పంపవచ్చు. Livescribe Pen ప్రారంభ ధర $99 , 2 GB స్టోరేజ్ ని కలిగి ఉంటుంది.

What is a Livescribe Smartpen?



Demo: Send your Notes to the Cloud


మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.


ధన్యవాదాలు

Tuesday, May 10, 2011

Syncdocs - గూగుక్ డాక్స్ తో మన పీసీ సింక్రోనైజ్ చెయ్యటానికి!!

గూగుల్ డాక్స్ లో ఉన్న ఫైళ్ళను మరియు మన పీసీ లో ఉన్న ఫైళ్ళను సింక్రొనైజ్ (అనుసంధానించటానికి) Syncdocs అనే సింపుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీంతో గూగుక్ డాక్స్ కి ఫైళ్ళను ప్రత్యేకంగా అప్‌లోడ్ చెయ్యవలసిన అవసరం లేకుండా Syndocs ఆటోమాటిక్ ఫైళ్ళను క్లౌడ్ కి అప్‌లోడ్ చేస్తుంది, మనం చెయ్యవలసిందల్లా ఫైళ్ళను My Google Docs ఫోల్డర్ లో వెయ్యటమే. అంతే కాకుండా గూగుల్ డాక్స్ లోని ఫైళ్ళు అదే ఫోల్డర్ లోకి డౌన్లోడ్ చెయ్యబడతాయి. దీంతో మన పీసీ లోని ఫైళ్ళను ఎప్పుడైనా ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు. మనం ఏదైనా ఫైల్ ఒకచోట తొలగిస్తే అది రెండవచోట కూడా తొలగించబడుతుంది.

Sync Docs డెమో ఇక్కడ చూడండి:




 Syncdocs డౌన్లోడ్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. 

డౌన్లోడ్: http://www.syncdocs.com/

ధన్యవాదాలు

Monday, May 9, 2011

లాప్ టాప్ ఉపయోగించేటప్పుడు ఏ విధంగా కూర్చోవాలి! [వీడియో]

మనం పీసీ/లాప్ టాప్ మీద పనిచేసేటప్పుడు సరైన విధంగా (posture) కూర్చోవాలి, లేకపోతే నడుం, మెడ , కాళ్ళు మొ. నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ఆఫీస్ లేదా ఇంట్లో లేదా ప్రయాణాలలో లాప్ టాప్ ఉపయోగించే వారు  ఏ విధంగా కూర్చోవాలనే దానిపై వోడాఫోన్ విడుదల చేసిన చక్కని యానిమేటెడ్ వీడియోలను ఇక్కడ చూడండి.

Video A: Using a laptop at home or office



Video B: Using your laptop while travelling or in a hotel



ధన్యవాదాలు

Saturday, May 7, 2011

కడప ఉప ఎన్నికల ప్రక్రియను ఆన్‌లైన్ లో చూడండి!

కడప లోజరగనున్న ఉప ఎన్నికల ప్రక్రియను ఆన్‌లైన్ లో లైవ్ చూడవచ్చు. దీనికోసం పోలింగ్ కేంద్రాలలో కెమేరాలను అమర్చారు. ఓటర్లు కెమేరాల ముందుకు వచ్చి తమ వివరాలు చెప్పాలి. ఎన్నికలలో రిగ్గింగ్ ని అరికట్టడానికి మరియు పారదర్శకత కోసం ఈ నిబంధనను పెట్టారు. ఈ ప్రక్రియను ఎవరైనా ఎక్కడనుండైనా వీక్షించటానికి వీలుగా ఆన్‌లైన్ లో లైవ్ ఇస్తున్నారు. దీనికోసం ఎలక్షన్ కమిషన్ సైట్    http://ceoandhra.nic.in/ లో సందర్శించండి.


వెబ్‌సైట్: http://ceoandhra.nic.in/

ధన్యవాదాలు

Friday, May 6, 2011

మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ సిగ్నేచర్ డాటాబేస్ ఇప్పుడు ప్రాక్సీ ద్వారా కూడా అప్ డేట్ చేసుకోవచ్చు!!

మైక్రోసాప్ట్ వారి వైరస్, స్పైవేర్ మరియు మాల్వేర్ ప్రొటెక్షన్ సాప్ట్ వేర్ అయిన సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ సిగ్నేచర్ డాటాబేస్  డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే అప్ డేట్ అయ్యేది, లేదంటే కనుక డాటాబేస్ సెపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాల్సి వచ్చేది. నెట్ వర్క్ (LAN)  సిస్టం లో ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకొని ప్రాక్సీ ద్వారా పీసీ లలో ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తున్నా సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ సిగ్నేచర్ డాటాబేస్ ప్రాక్సీ ద్వారా అప్ డేట్ అయ్యేది కాదు.అయితే ఇప్పుడు  సెక్యూరిటీ ఎస్సెన్షియల్స్ ని  http://www.microsoft.com/en-in/security_essentials/default.aspx నుండి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకుంటే సిగ్నేచర్ డాటాబేస్ ప్రాక్సీ ద్వారా కూడా అప్ డేట్ అవుతుంది.


ఇంటర్నెట్ కనెక్షన్ లేని వాళ్ళు సిగ్నేచర్ డాటాబేస్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో ఇనస్టలేషన్ చేసుకోవటానికి, ఈ క్రింది లింకులను క్లిక్ చెయ్యండి:


ధన్యవాదాలు