Tuesday, May 10, 2011

Syncdocs - గూగుక్ డాక్స్ తో మన పీసీ సింక్రోనైజ్ చెయ్యటానికి!!

గూగుల్ డాక్స్ లో ఉన్న ఫైళ్ళను మరియు మన పీసీ లో ఉన్న ఫైళ్ళను సింక్రొనైజ్ (అనుసంధానించటానికి) Syncdocs అనే సింపుల్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. దీంతో గూగుక్ డాక్స్ కి ఫైళ్ళను ప్రత్యేకంగా అప్‌లోడ్ చెయ్యవలసిన అవసరం లేకుండా Syndocs ఆటోమాటిక్ ఫైళ్ళను క్లౌడ్ కి అప్‌లోడ్ చేస్తుంది, మనం చెయ్యవలసిందల్లా ఫైళ్ళను My Google Docs ఫోల్డర్ లో వెయ్యటమే. అంతే కాకుండా గూగుల్ డాక్స్ లోని ఫైళ్ళు అదే ఫోల్డర్ లోకి డౌన్లోడ్ చెయ్యబడతాయి. దీంతో మన పీసీ లోని ఫైళ్ళను ఎప్పుడైనా ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు. మనం ఏదైనా ఫైల్ ఒకచోట తొలగిస్తే అది రెండవచోట కూడా తొలగించబడుతుంది.

Sync Docs డెమో ఇక్కడ చూడండి:




 Syncdocs డౌన్లోడ్ మరియు మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి. 

డౌన్లోడ్: http://www.syncdocs.com/

ధన్యవాదాలు