Monday, May 5, 2008

ఇంటర్నెట్ షేరింగ్


మీ ఆఫీసులో లోకల్ ఏరియా నెట్ వర్క్ (LAN) వుందా? ఒకే కంప్యూటర్ లో ఇంటర్నెట్ కనెక్షన్ వుందా ? నెట్ వర్క్ లోని మిగతా కంప్యూటర్ల లో కూడా ఇంటర్నెట్ యాక్సెస్ కావాలా? అయితే ccproxy ని http://www.youngzsoft.net/ccproxy/client.htm నుండి డౌన్ లోడ్ చేయండి. ఇదే సైట్ లో లాన్ (LAN)సెట్టింగ్స్ గురించి కూడా వివరించారు. ఇది మేనేజబుల్ proxy చాలా చక్కగా పని చేస్తుంది.

లాన్ సెట్టింగ్స్ క్లుప్తంగా:

౧. ముందుగా ccproxy ని ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ లో ఇనస్టాల్ చెయ్యాలి.
౨. లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ లో అయితే ఇంటర్నెట్ యాక్సెస్ కావాలో ఆ కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ తెరచి మెయిన్ మెనూ లోని Tools -> Internet Options -> Connections -> Lan Settings లో ముందుగా Automatically detect settings దగ్గర టిక్ (Select) చెయ్యాలి. తరువాత Use a proxy server for your LAN ను టిక్ చేసి Address దగ్గర ఐపి అడ్రస్ (ఇంటర్నెట్ కనెక్షన్ వున్న కంప్యూటర్ IP Address)ఎంటర్ చెయ్యాలి, Port దగ్గర 808 ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు ’ఒకే’...’ఒకే’ ...చెయ్యాలి.

ఇంటర్నెట్ యాక్సెస్ చెయ్యటానికి లాన్ నెట్ వర్క్ లోని ఏ కంప్యూటర్ రెడీ...

ధన్యవాదాలు...