Thursday, May 29, 2008

గూగుల్ డాక్స్ - Online Office Suit


గూగుల్ డాక్స్ - డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్ లు మరియు ప్రెజెంటేషన్ ల్ తో కూడిన ఆన్ లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తుంది. గూగుల్ డాక్స్ ని వుపయోంగించటానికి గూగుల్ ఎకౌంట్ తప్పనిసరి. http://docs.google.com కి వెళ్ళి యూజర్ ఐడి మరియు పాస్ వార్డ్ ఎంటర్ చెయ్యాలి. "New" డ్రాప్ డౌన్ మెనూ లో డాక్యుమెంట్, స్ప్రెడ్ షీట్ మరియు ప్రెజెంటేషన్ ఆప్షన్స్ వుంటాయి. డాక్యుమెంట్ ని క్లిక్ చేస్తే ఎడిటర్ వస్తుంది. ఇది MS Word లానే వుంటుంది...MS Word లోని కీబోర్డు షార్ట్ కట్ లూ ఇక్కడ అదేవిధంగా పని చేస్తాయి. టెక్స్ట్ ను టైప్ చేసిన తర్వాత "SAVE" చేసుకోవచ్చు, PDF, Word, HTML, RTF, Text లోకి మార్చుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో షేర్ చేసుకోవచ్చు మరియి వివిధ సైట్ల లోకి డైరెక్ట్ గా అప్ లోడ్ చేసుకోవచ్చు.
అదే విధంగా స్ప్రెడ్ షీట్ లు (Excel)మరియు ప్రెజెంటేషన్ (Powerpoint)ల లో పని చేసుకోవచ్చు.
ఆన్ లైన్ ఆఫీస్ సూట్ ని అందిస్తున్న యితర సైట్లు http://zoho.com, http://www.thinkfree.com

Google Docs offering three services - Document, Spreadsheet and Presentation. Google account is required to these services. Go to http://docs.google.com and enter userID and password. Google Docs are similar to MS Word, Excel and Powerpoint. Other sites which are offering office suits online are http://zoho.com, http://www.thinkfree.com.

ధన్యవాదాలు