Monday, May 12, 2008

పీడీఎఫ్ క్రియేటర్

prdownloads.sourceforge.net/pdfcreator/PDFCreator-0_9_1_AFPLGhostscript.exe?download నుండి పీడీఎఫ్ క్రియేటర్ (PDF Creator)ను డౌన్ లోడ్ చేయండి. దీనిని ఇనస్టలేషన్ చేస్తే "PDFCreator" ప్రింటర్ గా "Printers and Faxes" గా add అవుతుంది. దీనిని వుపయోగించి Word, Excel, Powerpoint లనే కాక వివిధ అప్లికేషన్ సాప్ట్ వేర్ ల నుండి జెనెరేట్ అయ్యే రిపోర్ట్ లను కూడా PDF లోకి మార్చుకోవచ్చు. ఉదాహరణ కి Oracle, Access, Foxpro etc. ల నుండి జెనెరేట్ అయ్యే రిపోర్ట్ లను PDF లోకి మార్చుకోవచ్చు.

ఉదా: Word file ని PDF లోకి మార్చటానికి, ముందుగా PDF లోకి మార్చవలసిన ఫైల్ ని ఓపెన్ చేసి మెయిన్ మెనూ లో
File ---> Print మీద మౌస్ క్లిక్ చెయ్యాలి. ప్రింటర్ విండో ఓపెన్ అవుతుంది, దానిలో ప్రింటర్ నేమ్ దగ్గర "PDFCreator" అనే ప్రింటర్ ని సెలెక్ట్ చెయ్యాలి, "OK" మీద మౌస్ క్లిక్ చెయ్యాలి. ఫైల్ కి పేరు ఇచ్చి సేవ్ చెయ్యండి.

ధన్యవాదాలు