Friday, November 20, 2009

PHOTOSnack - ఉచితంగా ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి...

PHOTOSnack - ఆన్ లైన్ లో ప్రొఫెషనల్ ఫోటో స్లైడ్ షోస్ తయారుచేసుకోవటానికి ఒక సులభమైన మార్గం ... ముందుగా photosnack అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.



స్టెప్ ౧. UPLOAD: PHOTOSnack సైట్ కి వెళ్ళి లాగిన్ అయిన తర్వాత 'Make a Slideshow' పై క్లిక్ చెయ్యాలి, టెంఫ్లేట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ’Upload Photos' పై క్లిక్ చేసి గరిష్టంగా 250 MB వరకు ఒక్కొక్క ఫైల్ సైజ్ 10 MB వరకు jpg, jpeg, png and gif ఫార్మేట్ లో వున్న ఫైళ్ళను అప్ లోడ్ చేసుకోవాలి.

స్టెప్ ౨. CUSTOMIZE: Customize Album లో ఆల్బమ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోవచ్చు, ఇమేజ్ జతచెయ్యవచ్చు, వ్యక్తిగత లోగో జత చెయ్యవచ్చు. అలాగే Navigation లో స్లైడ్ షో స్పీడు, యూజర్ ఇంటరాక్షన్ మరియు ఆటో హైడ్ కంట్రోల్స్ సెట్ చేసుకోవచ్చు.

స్టెప్ ౩. SHARE: తయారుచేసుకొన్న ఆల్బమ్ ని ఇతరులతో పంచుకోవటానికి లింక్ మరియు ఎంబెడ్ కోడ్ వస్తాయి.

ధన్యవాదాలు