Monday, November 23, 2009

GreenPrint తో ప్రింటింగ్ వ్యయాన్ని తగ్గించుకోండి...

సర్వత్రా గ్లోబల్ వార్మింగ్ పై చర్చలు జరుపుతున్న ఈ సందర్భంలో.... పేజీల ప్రింటింగ్ తగ్గించండి...చెట్లను కాపాడండి నినాదంతో GreenPrint ముందుకు వచ్చింది. సాధారణంగా వెబ్ పేజీలను ప్రింట్ చేసేటప్పుడు కావలసిన టెక్స్ట్ తో పాటు అనవసర ఇమేజ్లతో వ్రుధాగా ఒకటి లేదా రెండు పేజీలు ప్రింట్ అవటం జరుగుతుంది. దీనిని అరికట్టడానికి GreenPrint వుపయోగపడుతుంది. GreenPrint తో అనవసర చిత్రాలను తొలగించి కావలసిన పుటల్ని మాత్రమే ముద్రించే అవకాశం వుంది. దీనితో కాగితాలను తక్కువగా వాడి చెట్లను కాపాడి పర్యావరణ పరిరక్షణలో మనవంతు క్రుషి కి ప్రయత్నిద్దాం. GreenPrint ఉచిత వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేస్తే అది మన కంప్యూటర్ లో ఒక ప్రింటర్ గా జతచెయ్యబడుతుంది . ఇనస్టలేషన్ సమయంలో Do you know? అంటూ పర్యావరణం మరియు కాగితాల వ్రుధా కి సంబంధించిన విషయాలను మనం చూడవచ్చు. వెబ్ పేజెస్ ప్రింట్ చేసే సమయంలో GreenPrint ఓపెన్ అవుతుంది, అక్కడ అనసర చిత్రాలు మరియు పేజీలను తొలగించి ఇప్పుడు డీఫాల్ట్ గా వున్న నార్మల్ ప్రింటర్ లో ప్రింట్ చేసుకోవచ్చు లేదంటే పీడీఎఫ్ లోకి కూడా మార్చుకోవచ్చు.




గ్రీన్ ప్రింట్ ఉపయోగించే విధానానికి సంబంధించిన వీడియో ట్యుటోరియల్:



డౌన్లోడ్: GreenPrint (సైజ్: 9 MB)

ధన్యవాదాలు