Monday, March 15, 2010

SteganographX 1.0 - Bitmap ఇమేజ్ లో సీక్రెట్ టెక్ట్స్ దాచటానికి...

ప్రముఖ Leelu Soft వారిచే రూపొందించబడిన SteganographX 1.0 అనే అప్లికేషన్ ని ఉపయోగించి 16, 24 లేదా 32 bit bitmap ఇమేజెస్ లో సీక్రెట్ టెక్స్ట్ ని దాచవచ్చు (Encrypt) చెయ్యవచ్చు మరలా సీక్రెట్ కోడ్ ని Decrypt ఆప్షన్ ద్వారా తిరిగి చూడవచ్చు.

SteganographX 1.0 ని Leelu Soft సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇనస్టలేషన్ అవసరం లేకుండా SteganographX అప్లికేషన్ పై క్లిక్ చేసి ’Enter your Text here' దగ్గర కావలసిన టెక్స్ట్ టైప్ చేసి ’Click to load a bitmap image' పై క్లిక్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని, ఎడమచేతి ప్రక్కనున్న 'Encrypt' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ కొని దాచుకోవచ్చు లేదా ఎవరికైనా పంపవచ్చు. సీక్రెట్ టెక్స్ట్ ని తిరిగి పొందటానికి Steganograph అప్లికేషన్ లో ఇమేజ్ ని ఓపెన్ చేసి ’Decrypt' బటన్ పై క్లిక్ చేస్తే హైడ్ చేసిన టెక్స్ట్ ని చూడవచ్చు.


Steganography పై మరింత సమాచారం కోసం వికీపీడియా చూడండి.

డౌన్లోడ్: SteganographX 1.0

ధన్యవాదాలు

Saturday, March 13, 2010

Universal Viewer - ఏదైనా ఫైల్ ని Open మరియు View చెయ్యటానికి...

Universal Viewer అనే అడ్వాన్స్ డు ఉచిత ఫైల్ వ్యూయర్ ని ఉపయోగించి దాదాపు అన్ని ఫార్మేట్ల లోని ఫైళ్ళను ఓపెన్ చెయ్యవచ్చు మరియు చూడవచ్చు. యూనివర్సల్ వ్యూయర్ లో ఓపెన్ చేసి చూడగలిగే ఫైల్ ఫార్మేట్లు:
  • Text, Binary, Hex, Unicode: any files, of unlimited size (even 4Gb+ sizes are allowed)
  • RTF, UTF-8: RTF and UTF-8 encoded texts
  • Image: all general graphics formats: BMP JPG GIF PNG TGA TIFF... plus all formats supported by IrfanView/XnView external viewers
  • Multimedia: all formats supported by MS Windows Media Player: AVI MPG WMV MP3...
  • Internet: all formats supported by MS Internet Explorer: HTML PDF XML MHT...
  • Plugins: all formats supported by Total Commander Lister plugins
  • MS Office: all file types of MS Office (if installed): DOC DOCX XLS PPT...
  • Converters: some types can be viewed as plain text: DOC DOCX PDF PPT ODT...




Universal Viewer హైలైట్స్:
  • Built-in functions of several plugins: images, multimedia, webpages view
  • Support for multiple codepages: ANSI, OEM, EBCDIC, ISO etc.
  • Support for text converters for DOC, DOCX, ODT, PDF etc.
  • Support for user tools
  • Toolbar, status bar, other interface improvements
  • Auto-reloading of file on changing, "Follow tail" option
  • Displaying of line numbers
  • Displaying of non-printable characters
  • Combined Unicode/Hex mode (call Unicode mode twice)
  • Modern RegEx search library
  • Print preview
  • EXIF viewer


డౌన్లోడ్: Universal Viewer
ధన్యవాదాలు

Tuesday, March 9, 2010

BSNL మొబైల్ కాల్ చార్జెస్ తగ్గించటానికి స్పెషల్ టారీఫ్ వోచర్లు...

మొన్న ఈ మధ్య మా మిత్రులు/కొలీగ్స్ తో కలసి బెంగళూరు అఫీషియల్ టూర్ వెళ్ళాము. మాలో కొంతమంది BSNL సెల్ వన్ ప్రీపెయిడ్ వినియోగదారులు వున్నారు. వారిలో కొంతమందికి రోమింగ్ ఇన్ కమింగ్ చార్జీ ఎక్కువ అవటం, నాకు మాత్రం 49 పైసలే అయ్యేది. దానికి కారణం నేను కాల్ చార్జెస్ తగ్గించటానికి స్పెషల్ టారీఫ్ వోచర్ వేశాను. Special Tariff Voucher (STV) గురించి వారికి తెలియక పోవటం తో వారికి ఎక్కువ చార్జెస్ పడ్డాయి. ఇలా వాళ్ళలా ఎవరైనా వుంటే వారికి ఉపయోగపడుతుందని ఈ పోస్ట్ చేస్తున్నాను. BSNL ప్రీ-పెయిడ్ జెనెరల్, సరళ్ అనంత్, పవర్ ప్యాక్, వెన్నెల మరియు వెన్నెల ప్లస్ వినియోగదార్లు క్రింద యివ్వబడిన STV లతో కాల్ చార్జెస్ తగ్గించుకోవచ్చు, మిగతా సదుపాయాలు ఆయా ప్లాను అనుసరించి వుంటాయి.



మరింత సమాచారం కోసం కస్టమర్ కేర్ ని సంప్రదించండి.

ధన్యవాదాలు

Monday, March 8, 2010

ఫోటోలను స్కెచ్ లు గా మార్చటానికి ఉచిత ఆన్ లైన్ టూల్స్..

డిజిటల్ ఫోటోలను ఆర్టిస్టిక్ స్కెచ్ లు గా మార్చటానికి ఆన్ లైన్ లో చాలా ఉచిత టూల్స్ లభిస్తాయి, వాటిలో కొన్నింటిని యిక్కడ తెలియచేస్తున్నాను:

౧. DUMPR - Photo Pencil Sketch:

DUMPR సైట్ కి వెళ్ళి ముందుగా కావలసిన ఫోటోను అప్ లోడ్ చేసి ఒకేఒక క్లిక్ తో ఫోటోను పెన్సిల్ స్కెచ్ గా మార్చవచ్చు, అలా మారిన ఇమేజ్ ని సేవ్ చేసుకోవచ్చు లేదా ఇతరులకు ఈ-మెయిల్ పంపవచ్చు.




౨. tjshome - ఆన్ లైన్ ఇమేజ్ కన్వర్టర్:
ఈ సైట్ కి వెళ్ళగానే స్టెప్ ౧ లో వివిధ అప్శన్లు వుంటాయి అవి ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ లేదా రెడ్ షేడ్ లేదా స్కెచ్ మొదలగునవి. వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకొని స్టెప్ ౨ లో ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని ’Submit' పై క్లిక్ చెయ్యాలి. అంతే ఇమేజ్ కావలసిన విధంగా మార్చబడుతుంది. అలా మార్చబడిన ఇమేజ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.




౩. befunky :
Befunky సైట్ కి వెళ్ళి ’Get started' పై క్లిక్ చేస్తే Photo Effects ని సెలెక్ట్ చెయ్యమంటుంది. అక్కడ కావలసిన ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ’Browse Files' పై క్లిక్ చేసి ఇమేజ్ ని అప్ లోడ్ చెయ్యాలి. కావలసిన విధంగా మారిన ఇమేజ్ ని ’Save' బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోవచ్చు.





ఆన్ లైన్ లో కాకుండా మనసిస్టం లోనే ఇమేజ్ లను అందమైన పెయింటింగ్స్ గా , స్కెచెస్ గా లేదా డ్రాయింగ్స్ గా మార్చుకోవటానికి fotosketcher అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడూతుంది.

ధన్యవాదాలు

Friday, March 5, 2010

Wikibooks - ఉచిత ఎడ్యుకేషనల్ టెక్స్ట్ బుక్స్ ....

ప్రముఖ వికీపీడియా వారి వికీబుక్స్ లో కేజీ నుండి పీజీ వరకు వివిధ సబ్జెక్టులలో వివిధ బుక్స్ ఉన్నాయి. వాటిలో పీడీఎఫ్ లేదా వార్డ్ లో వున్న కొన్ని బుక్స్ ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. పిల్లల కోసం Wikijunior మరియు రకరకాల వంటల కోసం Cookbook అని ప్రత్యేక లింకులున్నాయి. వికీబుక్స్ లో 36000 పైగా పేజీలున్నాయి. వికీపీడియా లో లాగా ఎడిట్ మరియు సొంత బుక్స్ కూడా ప్రారంభించవచ్చు.




వెబ్ సైట్ : వికీబుక్స్

ధన్యవాదాలు

Wednesday, March 3, 2010

BSNL 3G మొబైల్ సర్వీసెస్ నేడే ప్రారంభం...

BSNL ఆంధ్రప్రదేశ్ లో తమ 3G మొబైల్ సర్వీసెస్ ఈ రోజు ప్రారంభిస్తుంది. 3G లో BSNL అందిస్తున్న సర్వీసులు:
1. Video Calling
2. Broadband Connectivity
3. Mobile TV
4. Video Downloads
5. Music Downloads
6. Video Conferencing
7. Online Gaming

SIM మరియు యాక్టివేషన్ కొరకు Rs.59/- చెల్లించాలి. 2G వాడుతున్న వినియోగదారులు 3G కి మారే సదుపాయం కలదు, ఎటువంటి చార్జీలు లేకుండా 2G SIM నే వాడుకోవచ్చు లేదంటే ఎక్కువ మెమొరీ కోసం 3G SIM కావాలంటే కనుక Rs.59/- చెల్లించాలి. 2G ఎకౌంట్ లో కనుక బ్యాలన్స్ వుంటే అది 3G కి క్యారీ ఫార్వార్డ్ చెయ్యబడుతుంది.

టారిఫ్ ప్లాన్లు:

౧. ఫ్రీపెయిడ్ కోసం ఇక్కడ చూడండి.
౨. పోస్ట్ పెయిడ్ కోసం ఇక్కడ చూడండి.
౩. డాటా కోసం ఇక్కడ చూడండి.
౪. మొబైల్ టీవీ కోసం ఇక్కడ చూడండి.

కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, మన దగ్గర వున్న పోన్ 3G ఎనేబుల్డ్ అయి వుండాలి.

అంతా బాగానే వుంది అసలు 3G అంటే ఎమిటి అని సందేహం ఇప్పుడు రావచ్చు, కొన్ని నెలల క్రితం 3G పై నేను చేసిన పోస్ట్ ని ఇక్కడ యిస్తున్నాను:

ఏంటీ 3జీ?

3జీ అంటే సంక్షిప్తనామంతో అందరికీ పరిచయమైన దీని పూర్తి పేరు ’థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ’. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా ఈ మొబైల్ నెట్ వర్క్ ని రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న 2G, 2.5G ల్లో 64-144 Kbps వేగంతో మాత్రమే డాటాని మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే ఈ 3జీ.

అరచేతిలో టీవీ!
సినిమాలు, పాటలు, వార్తలు ...ఇలా వీడియో ఫైల్స్ ఏవైనప్పటికీ చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన మొబైల్ టీవీ ఫ్రోగ్రంలను వీడియో స్ట్రీమింగ్ ఛానల్స్ ద్వారా వీక్షించవచ్చు. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ఏ విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా ఈ నెట్ వర్క్ ని రూపొందించారు. డిజిటల్ వీడియో బ్రాడ్ క్యాస్టింగ్ - హ్యండ్ హోల్డ్ (DVB-H) ద్వారా ఆన్ లైన్ లో వీక్షించే ప్రోగ్రాంలను అతి తక్కువ సమయంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కనిపిస్తూ మట్లాడవచ్చు:
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్ లో ఆన్ లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్ లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే ’వీడియో కాలింగ్’ పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.

మరికొన్ని:
౧.మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది.
౨.కంప్యూటర్ లోమాదిరిగా ఇంటర్నెట్ బ్రౌసింగ్ పూర్తిస్థాయిలో చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్ తో కూడిన ఎటాచ్ మెంట్లతో ఈ-మెయిల్స్ ని ఎలాంటి ఆలస్యం లేకుండా పంపేయచ్చు.
౩.వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇరువురి మొబైల్ 3జీ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం.
౪.ఇక వీడియో గేమ్ ల విషయానికొస్తే సైట్ ఏదైనప్పటికీ ఆన్ లైన్ గేమ్ లను అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్ లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.
౫.పోలీసు, రక్షణ వ్యవస్థలు ఈ నెట్ వర్క్ ద్వారా సీసీటీవీ లను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు.
౬.మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, ఈ-లెర్నింగ్, స్టాక్ ఎక్స్చేంజ్, టెలీ మెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు విస్త్రుతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల్ని పొందాలంటే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న GPRS సేవలకంటే ఎక్కువ ఛార్జ్ అవకాశముందని అంచనా.
౭.దేశంలో ౩జీ సదుపాయమున్న ఫోన్ లు రూ.12000 నుంచి రూ.50000 ధరల మధ్య అందుబాటులో వున్నాయి.


౩జీ నెట్ వర్క్ సర్వీస్ మొదటి సారిగా వ్యాపారాత్మకంగా అందుబాటులో కి తెచ్చిన ఘనత జప్పన్ కే దక్కుతుంది. నేటికి ప్రపంచ వ్యాప్తంగా 25 దేసాల్లో ఈ నెట్ వర్క్ విస్తరించింది.అయితే ఈ ౩జీ కంటే ముందు 1G, 2G, 2.5G, 2.75G అంటూ నాలుగు జెనెరేషన్లు వున్నాయి. మొదటి జెనెరేషన్ ఫోన్ గురించి చెప్పాలంటే అదో ఎనలాగ్ మొబైల్ ఫోన్ . 1980 ల్లో ఈ రకం ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతూ వీటితో సంభాషించేవారు. ఉదాహరణగా వాకీటాకీ లను చెప్పుకోవచ్చు. తర్వాత వీటి స్థానాన్నే 2Gలు ఆక్రమించాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ లో డిజిటల్ యుగం దీనితో మొదలైంది. ఇదే టెక్నాలజీ 2.5G, 2.75Gలుగా మార్పు చెందుతూ నేటికి 3G కి చేరింది.

ధన్యవాదాలు

Tuesday, March 2, 2010

Income Tax డిపార్ట్ మెంట్ పేరుతో వచ్చే నకిలీ ఈ-మెయిళ్ళను నమ్మవద్దు...

Income Tax డిపార్ట్ మెంట్ ఇటీవల ఇక హెచ్చరికను జారీ చేసింది... అదేమిటంటే టాక్స్ రిఫండ్ చేస్తాం మీ క్రెడిట్ కార్డ్ వివరాలు తెలపండీ అంటూ వచ్చే ఈ-మెయిళ్ళను నమ్మవద్దని. ఐటీ డిపార్ట్ మెంట్ టాక్స్ రిఫండ్ల విషయంలో ఎటువంటి మెయిల్స్ పంపదని మరియు టాక్స్ పేయర్స్ నుండి క్రెడిట్ కార్డ్ వివరాలు కోరదనీ స్పష్టం చేసింది. టాక్స్ రిఫండ్ల పేరుతో ఐటీ డిపార్ట్ మెంట్ పంపినట్లుగా మచ్చే ఈ-మెయిల్స్ కి రిప్లై యివ్వకుండా జాగ్రత్తగా వుండాలని సూచించింది. ఈ విషయంలో టాక్స్ పేయర్స్ తో పూర్తి భాద్యత అని తెలిపింది.



పూర్తి సమాచారం కోసం Income Tax డిపార్ట్ మెంట్ సైట్ ని చూడండి.

ధన్యవాదాలు