Wednesday, March 3, 2010

BSNL 3G మొబైల్ సర్వీసెస్ నేడే ప్రారంభం...

BSNL ఆంధ్రప్రదేశ్ లో తమ 3G మొబైల్ సర్వీసెస్ ఈ రోజు ప్రారంభిస్తుంది. 3G లో BSNL అందిస్తున్న సర్వీసులు:
1. Video Calling
2. Broadband Connectivity
3. Mobile TV
4. Video Downloads
5. Music Downloads
6. Video Conferencing
7. Online Gaming

SIM మరియు యాక్టివేషన్ కొరకు Rs.59/- చెల్లించాలి. 2G వాడుతున్న వినియోగదారులు 3G కి మారే సదుపాయం కలదు, ఎటువంటి చార్జీలు లేకుండా 2G SIM నే వాడుకోవచ్చు లేదంటే ఎక్కువ మెమొరీ కోసం 3G SIM కావాలంటే కనుక Rs.59/- చెల్లించాలి. 2G ఎకౌంట్ లో కనుక బ్యాలన్స్ వుంటే అది 3G కి క్యారీ ఫార్వార్డ్ చెయ్యబడుతుంది.

టారిఫ్ ప్లాన్లు:

౧. ఫ్రీపెయిడ్ కోసం ఇక్కడ చూడండి.
౨. పోస్ట్ పెయిడ్ కోసం ఇక్కడ చూడండి.
౩. డాటా కోసం ఇక్కడ చూడండి.
౪. మొబైల్ టీవీ కోసం ఇక్కడ చూడండి.

కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి, మన దగ్గర వున్న పోన్ 3G ఎనేబుల్డ్ అయి వుండాలి.

అంతా బాగానే వుంది అసలు 3G అంటే ఎమిటి అని సందేహం ఇప్పుడు రావచ్చు, కొన్ని నెలల క్రితం 3G పై నేను చేసిన పోస్ట్ ని ఇక్కడ యిస్తున్నాను:

ఏంటీ 3జీ?

3జీ అంటే సంక్షిప్తనామంతో అందరికీ పరిచయమైన దీని పూర్తి పేరు ’థర్డ్ జెనెరేషన్ మొబైల్ టెలిఫోనీ’. వేగంగా సమాచార మార్పిడి చేసుకొనేలా ఈ మొబైల్ నెట్ వర్క్ ని రూపొందించారు. ప్రస్తుతం వాడుతున్న 2G, 2.5G ల్లో 64-144 Kbps వేగంతో మాత్రమే డాటాని మార్పిడి చేసుకోగలుగుతున్నాం. ఒక్కమాటలో చెప్పాలంటే పూర్తిస్థాయిలో ఇంటర్నెట్ సేవల్ని మొబైల్ లో వినియోగించుకునేలా రూపొందించిందే ఈ 3జీ.

అరచేతిలో టీవీ!
సినిమాలు, పాటలు, వార్తలు ...ఇలా వీడియో ఫైల్స్ ఏవైనప్పటికీ చిటికలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఎక్కువ రిజల్యూషన్ తో కూడిన మొబైల్ టీవీ ఫ్రోగ్రంలను వీడియో స్ట్రీమింగ్ ఛానల్స్ ద్వారా వీక్షించవచ్చు. నచ్చిన ప్రోగ్రాంలను రికార్డ్ చేసుకొని ఫోన్ లో భద్రపరచుకోవచ్చు కూడా. ఫ్రస్తుతం మనం వినియోగిస్తున్న 2జీ ద్వారా వాయిస్ కమ్యూనికేషన్ ను పూర్తిస్థాయిలో ఏ విధంగా వినియోగించగలిగామో వీడియో ఫైల్స్ ని ౩జీ లో అంతే సులువుగా యాక్సెస్ చేసుకొనేలా ఈ నెట్ వర్క్ ని రూపొందించారు. డిజిటల్ వీడియో బ్రాడ్ క్యాస్టింగ్ - హ్యండ్ హోల్డ్ (DVB-H) ద్వారా ఆన్ లైన్ లో వీక్షించే ప్రోగ్రాంలను అతి తక్కువ సమయంలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కనిపిస్తూ మట్లాడవచ్చు:
వెబ్ కెమేరా ద్వారా కంప్యూటర్ లో ఆన్ లైన్ వీడియో ఛాటింగ్ ఎలా చేస్తున్నారో అదే విధంగా ఫోన్ లో కూడా మీరు కనిపిస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. దీన్నే ’వీడియో కాలింగ్’ పిలుస్తున్నారు. ఇలా కనిపిస్తూ మాట్లాడాలంటే ఇరువురి ఫోన్లలో కెమేరా కచ్చితంగా వుండాలి. దీనికోసం ఫోన్ కు ముందు భాగంలో కెమేరాను ఏర్పాటు చేసిన 3జీ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నారు.

మరికొన్ని:
౧.మూడు నిమిషాలున్న ఎంపీ3 పాటను 2జీ తో డౌన్ లోడ్ చేస్తే సుమారు 31 నుండి 40 నిమిషాలు తీసుకుంటుంది. అదే వీడియో ను 3జీ తో 11 సెకన్ల నుంచి 1.5 సెకన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కార్లో వెళుతున్నప్పుడు కూడా 384 కేబీపీఎస్ వేగంతో డాటా ను డౌన్ లోడ్ చేసుకునేలా 3జీ పనిచేస్తుంది. 2జీ నెట్ వర్క్ 10kb/sec వేగంతో సమాచార మార్పిడి చేస్తే, 3జీ 2mb/sec స్పీడ్ తో చేస్తుంది.
౨.కంప్యూటర్ లోమాదిరిగా ఇంటర్నెట్ బ్రౌసింగ్ పూర్తిస్థాయిలో చేసుకోవచ్చు. వివిధ రకాల మల్టీమీడియా గ్రాఫిక్స్ తో కూడిన ఎటాచ్ మెంట్లతో ఈ-మెయిల్స్ ని ఎలాంటి ఆలస్యం లేకుండా పంపేయచ్చు.
౩.వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఇరువురి మొబైల్ 3జీ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం.
౪.ఇక వీడియో గేమ్ ల విషయానికొస్తే సైట్ ఏదైనప్పటికీ ఆన్ లైన్ గేమ్ లను అవలీలగా ఆడేయవచ్చు. మల్టీప్లేయర్ గేమ్ లు కూడా మొబైల్ లో అందుబాటులోకి రానున్నాయి. తక్కువ సమయంలోనే గేమ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కూడా.
౫.పోలీసు, రక్షణ వ్యవస్థలు ఈ నెట్ వర్క్ ద్వారా సీసీటీవీ లను యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నారు.
౬.మొబైల్ టూరిజం, మొబైల్ వాణిజ్యం, ఈ-లెర్నింగ్, స్టాక్ ఎక్స్చేంజ్, టెలీ మెడిసిన్, మొబైల్ వాణిజ్య ప్రకటనలు విస్త్రుతంగా అందుబాటులోకి రానున్నాయి. ఈ సేవల్ని పొందాలంటే ప్రస్తుతం మనం వినియోగిస్తున్న GPRS సేవలకంటే ఎక్కువ ఛార్జ్ అవకాశముందని అంచనా.
౭.దేశంలో ౩జీ సదుపాయమున్న ఫోన్ లు రూ.12000 నుంచి రూ.50000 ధరల మధ్య అందుబాటులో వున్నాయి.


౩జీ నెట్ వర్క్ సర్వీస్ మొదటి సారిగా వ్యాపారాత్మకంగా అందుబాటులో కి తెచ్చిన ఘనత జప్పన్ కే దక్కుతుంది. నేటికి ప్రపంచ వ్యాప్తంగా 25 దేసాల్లో ఈ నెట్ వర్క్ విస్తరించింది.అయితే ఈ ౩జీ కంటే ముందు 1G, 2G, 2.5G, 2.75G అంటూ నాలుగు జెనెరేషన్లు వున్నాయి. మొదటి జెనెరేషన్ ఫోన్ గురించి చెప్పాలంటే అదో ఎనలాగ్ మొబైల్ ఫోన్ . 1980 ల్లో ఈ రకం ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకరు మాట్లాడిన తర్వాత మరొకరు మాట్లాడుతూ వీటితో సంభాషించేవారు. ఉదాహరణగా వాకీటాకీ లను చెప్పుకోవచ్చు. తర్వాత వీటి స్థానాన్నే 2Gలు ఆక్రమించాయి. టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ లో డిజిటల్ యుగం దీనితో మొదలైంది. ఇదే టెక్నాలజీ 2.5G, 2.75Gలుగా మార్పు చెందుతూ నేటికి 3G కి చేరింది.

ధన్యవాదాలు