Monday, March 15, 2010

SteganographX 1.0 - Bitmap ఇమేజ్ లో సీక్రెట్ టెక్ట్స్ దాచటానికి...

ప్రముఖ Leelu Soft వారిచే రూపొందించబడిన SteganographX 1.0 అనే అప్లికేషన్ ని ఉపయోగించి 16, 24 లేదా 32 bit bitmap ఇమేజెస్ లో సీక్రెట్ టెక్స్ట్ ని దాచవచ్చు (Encrypt) చెయ్యవచ్చు మరలా సీక్రెట్ కోడ్ ని Decrypt ఆప్షన్ ద్వారా తిరిగి చూడవచ్చు.

SteganographX 1.0 ని Leelu Soft సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇనస్టలేషన్ అవసరం లేకుండా SteganographX అప్లికేషన్ పై క్లిక్ చేసి ’Enter your Text here' దగ్గర కావలసిన టెక్స్ట్ టైప్ చేసి ’Click to load a bitmap image' పై క్లిక్ చేసి ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకొని, ఎడమచేతి ప్రక్కనున్న 'Encrypt' బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇప్పుడు ఇమేజ్ ని సేవ్ కొని దాచుకోవచ్చు లేదా ఎవరికైనా పంపవచ్చు. సీక్రెట్ టెక్స్ట్ ని తిరిగి పొందటానికి Steganograph అప్లికేషన్ లో ఇమేజ్ ని ఓపెన్ చేసి ’Decrypt' బటన్ పై క్లిక్ చేస్తే హైడ్ చేసిన టెక్స్ట్ ని చూడవచ్చు.


Steganography పై మరింత సమాచారం కోసం వికీపీడియా చూడండి.

డౌన్లోడ్: SteganographX 1.0

ధన్యవాదాలు