Thursday, December 9, 2010

chrome web store - గూగుల్ వెబ్ అప్లికేషన్ల సమాహారం!!!

chrome web store - బ్రౌజర్ లో రన్ అయ్యే వెబ్ అప్లికేషన్ల సమాహారం!, ఇక్కడ ఉచిత మరియు పెయిడ్ వెబ్ అప్లికేషన్లు ఉంటాయి. chrome web store సైట్ లో వెబ్ అప్లికేషన్లను వివిధ క్యాటగిరీల్లో ఉంచారు, అవసరమైన అప్లికేషన్ పై మౌస్ ఉంచితే అది ఉచితమా లేక పెయిడ్ అయితే దాని ధర చూపుతుంది. కావలసిన అప్లికేషన్ పై క్లిక్ చేస్తే దానికి సంబంధిన వివరాలు వస్తాయి, ఇనస్టలేషన్ చేసుకోవటానికి, గూగుల్ అకౌంట్ తో సైన్-ఇన్ చెయ్యాలి మరియు అక్కడే ఉండే ’Install' బటన్ పై క్లిక్ చెయ్యాలి. అంతే ఆ అప్లికేషన్ ఇనస్టల్ అవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ వెబ్ అప్స్ షార్ట్ కట్ లేదా బుక్ మార్క్స్ లాంటివే.




వెబ్ సైట్: chrome web store

ధన్యవాదాలు

Wednesday, December 8, 2010

గూగుల్ క్రోమ్ క్రొత్త ఫీచర్ Cloud Print ఎనేబుల్ చెయ్యటం ఎలా?

గూగుల్ క్రోమ్ యొక్క క్రొత్త ఫీచర్ Chrome Cloud Print ని గూగుల్ లాంచ్ చేసింది, మన పీసీ కి కనెక్ట్ అయిన ప్రింటర్లు Chrome Cloud Print లో లభ్యమవటానికి క్రోమ్ బ్రౌజర్ లో Cloud Print Connector ని ఎనేబుల్ చెయ్యాలి, అదెలాగో ఇక్కడ చూద్దాం:

౧. ముందుగా గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి పైన కుడి చేతి ప్రక్క నున్న Tools బటన్ పై క్లిక్ చెయ్యాలి.



౨. ఇప్పుడు ’Options' పై క్లిక్ చెయ్యాలి.


౩. గూగుల్ క్రోమ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఉన్న "Under the Hood" టాబ్ కి వెళ్ళి క్రిందకు స్క్రాల్ చేసి Google Cloud Print దగ్గర ఉన్న "Sign in to Google Cloud Print" పై క్లిక్ చెయ్యాలి.


౪. ఇప్పుడు ఓపెన్ అయిన డైలాగ్ లో గూగుల్ అకౌంట్ తో సైన్-ఇన్ చెయ్యాలి.



సైన్-ఇన్ పూర్తి అయిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీ వస్తుంది.



‘Under the Hood’ టాబ్ లో Google Cloud Print దగ్గర ‘Disable Google Cloud Print’ మరియు ‘Manage Print Settings’ బటన్స్ చూడవచ్చు.



ఇప్పుడు ‘Manage Print Settings’ పై క్లిక్ చేస్తే మన పీసీ కి కనెక్ట్ అయిన ప్రింటర్స్ లిస్ట్ వస్తుంది. Print a test page పై క్లిక్ చేస్తే ప్రింటర్ లిస్ట్ వస్తుంది. కావలసిన ప్రింటర్ ని సెలెక్ట్ చేసుకొని ’Print' బటన్ పై క్లిక్ చేసి టెస్ట్ ప్రింట్ ఇవ్వవచ్చు.




మరింత సమాచారం కోసం మరియు హెల్ప్ కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

Chrome OS ఎలా ఉంటుంది!!!!

గూగుల్ తమ Chrome ఆపరేటింగ్ సిస్టం ని నిన్న విడుదల చేస్తుందని అందరూ ఎంతో ఆసక్తి గా చూశారు. అయితే గూగుల్ Cloud Print, Chrome WebStore ని ప్రకటించింది, Chrome, Chrome OS, WebStore పై అప్ డేట్ ఇక్కడ చూడండి.

గూగుల్ ఇంతకుముందు చెప్పినట్లు Chrome OS ఒక ఓపెన్ సోర్స్, లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం మరియు దీనిని ప్రత్యేకంగా నెట్ బుక్స్ కోసం రూపొందిస్తున్నారు.



- Chrome OS ఒక వెబ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం. బేసిక్ గా ఇది ఒక బ్రౌజరే, దీనిలో మరల జీ-మెయిల్,గూగుల్ డాక్స్, మొదలగు వెబ్ అప్లికేషన్లు ఉంటాయి.

- Chrome OS లో కేవలం వెబ్ అప్లికేషన్లు మాత్రమే రన్ అవుతాయి. అప్లికేషన్లన్నీ బ్రౌజర్ లోనే రన్ అవుతాయి.

- Chrome OS క్రోమ్ బ్రౌజర్ కి అడ్వాన్స్ వెర్షన్ అని చెప్పవచ్చు, దీనిని ఉపయోగిస్తున్నప్పుడు క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న అనుభూతే యూజర్ కి కలుగుతుంది.

- లైనక్స్ అధారంగా Chrome OS ని రూపొందిస్తున్నారు.లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ల లా లైనక్స్ బైనరీస్ ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు.

- మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పోలిస్తే స్టార్ట్ అప్ టైమ్ చాలా చాలా తక్కువ, డైరెక్ట్ గా బ్రౌజర్ లోకే బూట్ అవుతుంది.

- Chrome OS డెస్క్ టాప్ ల కోసం కాదు కేవలం నెట్ బుక్స్ కోసమే అదీ గూగుల్ అప్రూవ్ చేసిన హార్డ్ వేర్ లోనే పని చేస్తుంది.

Chrome OS మనం మరొకొంత సమయం వేచి ఉండాల్సిందే, వచ్చే సంవత్సరం దీనిని విడుదల చెయ్యొచ్చని గూగుల్ చెపుతుంది.

మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు

Tuesday, December 7, 2010

మేధ్స్, సైన్స్ లేదా ఇతర సబ్జెక్టులు నేర్చుకోవటానికి వెబ్ సైట్లు!!!

స్టూడెంట్స్ తమ నాలెడ్జ్ ని మెరుగు పరచుకోవటం లో ఇంటర్నెట్ ఎంతో సహాయపడుతుంది, స్కూల్ లో టీచర్లు ఇచ్చే ప్ర్రాజెక్ట్స్ చెయ్యాలంటే కనుక మనం తప్పకుండా ఇంటర్నెట్ పైనే ఆధారపడుతూ ఉంటాం, ఇంటర్నెట్ - ఒక సమాచార భాండాగారం. మేధ్స్ , సైన్స్, ప్రపంచ భాషలు లేదా ఇతర సబ్జెక్టులు నేర్చుకోవటానికి ఉపయోగపడే వెబ్ సైట్లు ఇప్పుడు చూద్దాం:

1. Wolfram Alpha:

క్లిష్టమైన సమస్యలను సాధించటం లో Wolfram Alpha సహాయపడుతుంది. Wolfram Alpha సైట్ కి వెళ్ళి సెర్చ్ బాక్స్ లెక్కను లేదా సమీకరణాన్ని టైప్ చేసి ప్రక్కనున్న బటన్ పై క్లిక్ చేసి సమాధానాన్ని పొందవచ్చు. అలాగే వివిధ సబ్జెక్టులకు సంబందించిన ఉదాహరణలు కూడా చూడవచ్చు.



వెబ్ సైట్: Wolfram Alpha

ఇటువంటివే మరికొన్ని సైట్లు:

2. Mathway :



వెబ్ సైట్: Mathway

3. Babbel :

ప్రపంచ భాష లు నేర్చుకోవటానికి మరియు pronunciation skills ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. స్పీచ్ రికగ్నైజేషన్ టూల్ కూడా ఇంటిగ్రేట్ చెయ్యబడి ఉంది, ఇది pronunciation మెరుగుపర్చుకోవటానికి సహాయపడుతుంది.



వెబ్ సైట్: Babbel

4. Dynamic Periodic Table:


వెబ్ సైట్: Dynamic Periodic Table

5. Math.com


వెబ్ సైట్: Math.com

6. Tutor2u :

వెబ్ సైట్: Tutor2u

7. LiveMocha :


వెబ్ సైట్: LiveMocha

8. Verbalearn :


వెబ్ సైట్:Verbalearn

9. MyHappyPlanet :

వెబ్ సైట్: MyHappyPlanet

10. wePapers:

వెబ్ సైట్: wePapers

ధన్యవాదాలు

Monday, December 6, 2010

Google eBooks లో 30 లక్షలకు పైగా ఈ-బుక్స్ మరియు రీడర్ అప్లికేషన్లు!!!


Google eBooks 30 లక్షలకు పైగా టైటిల్స్ లో ఓపెన్ అయింది, అంతేకాకుండా Android, iOS, iPhone మొదలగు డివైజెస్ లో ఈ-బుక్స్ ని చదవటం కోసం రీడర్ అప్లికేషన్లను కూడా అందిస్తుంది. ఇక్కడ ఉచిత ఈ-బుక్స్ తో పాటు నచ్చిన వాటిని సరసమైన ధరకు కొనుక్కోవచ్చు. కొన్ని బుక్స్ లో స్కాన్డ్ పేజెస్ కలిగిన ఈ-బుక్స్ కూడా ఉన్నాయి.




మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్ చూడండి.



వెబ్ సైట్: Google eBooks Store

ధన్యవాదాలు

Saturday, December 4, 2010

Google Translate లో ఇప్పుడు టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్ ఫీచర్!!!

Google Translate టెక్స్ట్ ని ఒక భాష లోనుండి మరొక భాష లోకి అనువదించటానికి సహాయపడుతుంది, ఇప్పుడు అలా అనువదింపబడిన టెక్స్ట్ ని ఎంచక్కా వినవచ్చు కూడా. దీనికోసం Google Translate కి వెళ్ళి మనకు తెలిసిన భాషలో కావలసిన టెక్స్ట్ ని టైప్ చేసి అనువదించవలసిన భాష ను సెలెక్ట్ చేసుకొని 'Translate' పై క్లిక్ చెయ్యాలి, సెలెక్ట్ చేసుకున్న భాష లోకి టెక్స్ట్ మారిపోతుంది, అక్కడే క్రిందవున్న ’Listen' పై క్లిక్ చేసి ఆ టెక్స్ట్ ని వినవచ్చు.




దీనికి సంబంధించిన సరదా డెమో వీడియో:



వెబ్ సైట్: Google Translate

ధన్యవాదాలు

Thursday, December 2, 2010

FindBigMail: మీ జీమెయిల్ అకౌంట్ లో పెద్ద మెయిల్స్ ని తెలుసుకోవటానికి వెబ్ సర్వీస్ !!!

మీ జీమెయిల్ ఇన్-బాక్స్ లో అనవసరమైన పెద్ద మెయిల్స్ ని తెలుసుకొని వాటిని తొలగించటానికి FindBigMail ఉపయోగపడుతుంది. దీనికోసం మనం చెయ్యవలసిందల్లా FindBigMail సైట్ కి వెళ్ళి మన జీమెయిల్ ఐడి ఎంటర్ చేసి ’Click Here' బటన్ పై క్లిక్ చెయ్యాలి తర్వాత FindBigMail మన జీమెయిల్ అకౌంట్ యాక్సెస్ చెయ్యటానికి అనుమతి కోరుతుంది, అనుమతి ఇవ్వటం కోసం ’Grant access' పై క్లిక్ చెయ్యాలి. FindBigMail మన ఈ-మెయిల్ సైజ్ ని మాత్రమే స్కాన్ చేస్తుంది, కంటెంట్ ని స్కాన్ చెయ్యదు.





స్కానింగ్ పూర్తి అయిన తర్వాత మైయిల్స్ సైజ్ ప్రకారం లేబుళ్ళు క్రియేట్ చెయ్యబడతాయి. దీనితో పెద్ద మెయిళ్ళ ను సులభంగా తెలుసుకోవచ్చు మరియు అనవసరమైన వాటిని తొలగించవచ్చు.



వెబ్ సైట్: FindBigMail

ధన్యవాదాలు