Wednesday, December 8, 2010

Chrome OS ఎలా ఉంటుంది!!!!

గూగుల్ తమ Chrome ఆపరేటింగ్ సిస్టం ని నిన్న విడుదల చేస్తుందని అందరూ ఎంతో ఆసక్తి గా చూశారు. అయితే గూగుల్ Cloud Print, Chrome WebStore ని ప్రకటించింది, Chrome, Chrome OS, WebStore పై అప్ డేట్ ఇక్కడ చూడండి.

గూగుల్ ఇంతకుముందు చెప్పినట్లు Chrome OS ఒక ఓపెన్ సోర్స్, లైట్ వెయిట్ ఆపరేటింగ్ సిస్టం మరియు దీనిని ప్రత్యేకంగా నెట్ బుక్స్ కోసం రూపొందిస్తున్నారు.



- Chrome OS ఒక వెబ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం. బేసిక్ గా ఇది ఒక బ్రౌజరే, దీనిలో మరల జీ-మెయిల్,గూగుల్ డాక్స్, మొదలగు వెబ్ అప్లికేషన్లు ఉంటాయి.

- Chrome OS లో కేవలం వెబ్ అప్లికేషన్లు మాత్రమే రన్ అవుతాయి. అప్లికేషన్లన్నీ బ్రౌజర్ లోనే రన్ అవుతాయి.

- Chrome OS క్రోమ్ బ్రౌజర్ కి అడ్వాన్స్ వెర్షన్ అని చెప్పవచ్చు, దీనిని ఉపయోగిస్తున్నప్పుడు క్రోమ్ బ్రౌజర్ వాడుతున్న అనుభూతే యూజర్ కి కలుగుతుంది.

- లైనక్స్ అధారంగా Chrome OS ని రూపొందిస్తున్నారు.లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ల లా లైనక్స్ బైనరీస్ ఇనస్టలేషన్ చెయ్యవలసిన అవసరం లేదు.

- మిగతా ఆపరేటింగ్ సిస్టమ్స్ తో పోలిస్తే స్టార్ట్ అప్ టైమ్ చాలా చాలా తక్కువ, డైరెక్ట్ గా బ్రౌజర్ లోకే బూట్ అవుతుంది.

- Chrome OS డెస్క్ టాప్ ల కోసం కాదు కేవలం నెట్ బుక్స్ కోసమే అదీ గూగుల్ అప్రూవ్ చేసిన హార్డ్ వేర్ లోనే పని చేస్తుంది.

Chrome OS మనం మరొకొంత సమయం వేచి ఉండాల్సిందే, వచ్చే సంవత్సరం దీనిని విడుదల చెయ్యొచ్చని గూగుల్ చెపుతుంది.

మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు