గూగుల్ క్రోమ్ యొక్క క్రొత్త ఫీచర్ Chrome Cloud Print ని గూగుల్ లాంచ్ చేసింది, మన పీసీ కి కనెక్ట్ అయిన ప్రింటర్లు Chrome Cloud Print లో లభ్యమవటానికి క్రోమ్ బ్రౌజర్ లో Cloud Print Connector ని ఎనేబుల్ చెయ్యాలి, అదెలాగో ఇక్కడ చూద్దాం:
౧. ముందుగా గూగుల్ క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ ను డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసి పైన కుడి చేతి ప్రక్క నున్న Tools బటన్ పై క్లిక్ చెయ్యాలి.
౨. ఇప్పుడు ’Options' పై క్లిక్ చెయ్యాలి.
౩. గూగుల్ క్రోమ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది, అక్కడ ఉన్న "Under the Hood" టాబ్ కి వెళ్ళి క్రిందకు స్క్రాల్ చేసి Google Cloud Print దగ్గర ఉన్న "Sign in to Google Cloud Print" పై క్లిక్ చెయ్యాలి.
౪. ఇప్పుడు ఓపెన్ అయిన డైలాగ్ లో గూగుల్ అకౌంట్ తో సైన్-ఇన్ చెయ్యాలి.
సైన్-ఇన్ పూర్తి అయిన తర్వాత కన్ఫర్మేషన్ పేజీ వస్తుంది.
మరింత సమాచారం కోసం మరియు హెల్ప్ కోసం ఇక్కడ చూడండి.
ధన్యవాదాలు