Wednesday, January 11, 2012

System Restore Explorer - విండోస్ 7 సిస్టం రీస్టోర్ పాయింట్లను చూడటానికి లేదా తొలగించటానికి!!!

System Restore Explorer  అనే ఉచిత టూల్ ని ఉపయోగించి విండోస్ లోని సిస్టం రీస్టోర్ పాయింట్లను చూడవచ్చు మరియు అనవసరమైన వాటిని తొలగించవచ్చు, దీంతో పీసీ లోని కొంత డిస్క్ స్పేస్ ని ఆదా కూడా చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసి రన్ చేసిన తర్వాత సిస్టం లోని రీస్టోర్ పాయింట్లను చూపిస్తుంది. ఎంచుకున్న రీస్టోర్ పాయింట్ పై రైట్ క్లిక్ చేసి వచ్చే ఆప్షన్లలో ’Mount'  పై క్లిక్ చేస్తే రీస్టోర్ పాయింట్ ఫైళ్ళు విండోస్ ఎక్స్ ఫ్లోరర్ లో ఓపెన్ అవుతాయి. ఇక సులభంగా బ్రౌజ్ మరియు రిమూవ్ చెయ్యవచ్చు.




మరింత సమాచారం కోసం System Restore Explorer సైట్ చూడండి.

డౌన్లోడ్: System Restore Explorer.

ధన్యవాదాలు

Tuesday, January 10, 2012

Good to Know - గూగుల్ నుండి ఆన్ లైన్ సేఫ్టీ టిప్స్!!!

గూగుల్ Good to Know అనే సైట్ ని ప్ర్రారంభించింది, దీనిలో ఆన్ లైన్ లో సరక్షితంగా ఎలా ఉండాలో తెలియచేసే సూచనలను పొందుపర్చారు. సూచనలు కొన్ని మనకు తెలిసినవే అయినా వాటిని పాటించటం లో కొంత అలసత్వం మరియు అజాగ్రత్త చేస్తూ ఉంటాం. ప్రతి ఇంటర్నెట్ యూజర్ సందర్శించవలసిన సైట్ ఇది. టిప్స్ తో పాటు టెక్నికల్ పదాలైన cookie, IP address, Phishing, Malware మొదలగు వాటి గురించి కామన్ యూజర్ కి అర్ధమయ్యే రీతిలో  వీడియోల ద్వారా తెలియచేశారు.  


వెబ్ సైట్: Good to Know 

ధన్యవాదాలు

Monday, January 9, 2012

Mathematics in Movies - సినిమాల్లో లెక్కల సీన్లు...

100% లవ్ సినిమా స్టార్టింగ్ లో బార్ లో ఇద్దరు స్నేహితులు తమకు రావలసిన డబ్బుల లెక్కల గురించి తంటాలు పడుతుంటే మన హీరో కాగితం పెన్నూ లేకుండా నోటితో వడ్డీ లెక్కలు చెప్పేస్తాడు. ఇలా ఆంగ్ల సినిమాల్లో వచ్చే లెక్కలకు సంబంధించిన సీన్లను ఒకే చోట చేర్చి ఒక వెబ్ సైట్ రూపొందించాడొక Oliver Knill అనే హార్వార్డ్ యూనివర్సిటీ లెక్కల ప్రొఫెసర్...


వెబ్ సైట్: Mathematics in Movies

ధన్యవాదాలు

Thursday, January 5, 2012

Smart PC Locker - పీసీ ని లాక్ చేసి సురక్షితంగా ఉంచటానికి!!



Smart PC Locker అనే ఉచిత పోర్టబుల్ అప్లికేషన్ ని ఉపయోగించి మనం లేనప్పుడు ఇతరులు మన పీసీ వాడకుండా పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైనా ఏదైనా తప్పు పాస్ వార్డ్ తో పీసీ లాగిన్ అవ్వటానికి ప్రయత్నించినప్పుడు కొన్ని ప్రయత్నాల అనంతరం పీసీ ఆటోమాటిక్ గా షట్ డౌన్ అవుతుంది. ఇంకా టాస్క్ మేనేజర్ డిసేబుల్ చెయ్యటం, సీడీ డ్రైవ్ లు లాక్ చెయ్యటం మొదలగు  పనులు కూడా చేస్తుంది.



Features: 

  • Auto lock PC after X minutes of inactivity
  • Disable Task Manager
  • Lock all CD-ROM drives
  • Lock your Computer
  • Power off monitor once locked after X minutes of inactivity
  • Set your own password to unlock the PC
  • Shutdown Windows after the PC is locked for X minutes
  • Shutdown Windows after X invalid password attempts
  • Start with Windows and lock screen
  • Stealth Mode
  • Use custom wallpaper when lock Computer
  • Very user-friendly GUI
డౌన్లోడ్: Smart PC Locker Pro v1.2

ధన్యవాదాలు

Wednesday, January 4, 2012

CrashPlan - ఒక మంచి డాటా బ్యాక్ అప్ సాఫ్ట్ వేర్!!!

డాటా రెగ్యులర్ గా బ్యాకప్ తీసుకోవటం ఒక మంచి అలవాటు. డాటా పోయిన తర్వాత బాధ పడే కన్నా ముందుగా బ్యాకప్ తీసుకోవటం ఉత్తమం. మాన్యువల్ గా డాటా వేరొక చోట కాపీ చేసుకోవటం కష్టం అనుకుంటే, డాటా బ్యాకప్ అప్లికేషన్ల పై ఆధారపడవచ్చు. డాటా అదే పీసీ లేదా నెట్ వర్క్ లోని వేరో పీసీ లో ఆటోమాటిక్ బ్యాకప్  తీసుకోవటానికి చాలా ఉచిత సాప్ట్ వేర్లు నెట్ లో చాలానే ఉన్నాయి.  వాటిలో ఒకటి CrashPlan ఇది ఆఫ్-సైట్ మరియు ఆన్-లైన్ బ్యాక్ అప్ ని అందిస్తుంది. ఆఫ్ సైట్ ఉచితం మరియు ఆన్ లైన్ కోసం పే చెయ్యవలసి ఉంటుంది.

1. Download and Install Free Backup Software

Windows Requirements:
XP, Vista, Windows 7, Server 2008/2003
1GHZ+ CPU, 1GB+ memory, 50MB+ free drive space
IMPORTANT! CrashPlan auto-updates to the latest version. You do not need to download it again once it's installed.

2. Create your account

CrashPlan automatically starts up after installation and prompts you to create a new account. Enter the information and click Create Account. CrashPlan will send backup reports and notifications to the email address you enter.
Existing users: Choose Existing Account and enter your email address and password.The email address needs to match the address you used for your original CrashPlan account.

3. Choose files and destinations


Files: By default, CrashPlan will back up your entire Home/User folder. Click Change to select specific files and folders to back up
Start: Click Start Backup to back up to CrashPlan Central and any other destinations you've selected.
Destina

పీసీ లో ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఈ మెయిల్ సహాయంతో  అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అదే పీసీ లో బ్యాకప్ కోసం బ్యాకప్ తీసుకోవలసిన ఫైళ్ళను మరియు డెస్టినేషన్ పోల్డర్ ని ఎంచుకొని 'Start Backup' బటన్ పై క్లిక్ చెయ్యటమే. వేరొక పీసీ లో బ్యాకప్ తీసుకోవటానికి సేమ్ అకౌంట్ తో  CrashPlan ని ఆ పిసీ లోకూడా ఇనస్టలేషన్ చెయ్యాలి. అప్పుడు కంప్యూటర్ల లిస్ట్ లో ఆ పీసీ కూడా జత చెయ్యబడుతుంది. డెస్టినేషన్ లో ఆ పీసీ ఎంచుకోవాలి. బ్యాకప్ అలర్ట్ మరియు స్టేటస్ ఇ-మెయిల్ లో పొందవచ్చు.

డౌన్లోడ్:  CrashPlan

ధన్యవాదాలు

Tuesday, January 3, 2012

Pixlr Editor - ఉచిత ఆన్ లైన్ ఫోటో ఎడిటర్ [Photoshop ప్రత్యామ్నాయం]

Pixlr Editor ని సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఫోటోషాప్ గా చెప్పవచ్చు. ఈ ఆన్ లైన్ ఫోటో ఎడిటర్ ని ఉపయోగించి కొత్త ఇమేజెస్ క్రియేట్ చెయ్యవచ్చు, ఉన్న ఇమేజ్ లను ఎడిట్ చెయ్యవచ్చు మరియు అవసరమైతే స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా జతచెయ్యవచ్చు. Pixlr లో లేయర్ సపోర్ట్ కూడా ఉంది. ఖరీదైన Adobe Photoshop కొని ఉపయోగించలేని వారికోసం Pixlr ఒక మంచి ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు.  యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ కలిగిన Pixlr లో ఫోటోషాప్ లో ఉండే దాదాపు అన్ని టూల్స్ ఉన్నాయి. హిస్టరీ విండోలో మనం ఇమేజ్ లో చేసిన మార్పులను చూడవచ్చు అవసరం అనుకుంటే ఆ మార్పులను రివర్స్ చేసే సదుపాయం కూడా కలదు. 



వెబ్ సైట్: Pixlr Editor

ధన్యవాదాలు

Monday, January 2, 2012

Comodo Online Storage - కొమోడో నుండి ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్!!

ఆన్ లైన్ లో డాటా బ్యాక్ అప్ తీసుకోవటం వలన మన డాటా ని ఎక్కడనుండైనా ఎప్పుడైనా యాక్సెస్ చెయ్యవచ్చు. ఆన్ లైన్ స్టోరేజ్ అందిస్తున్న చాలా సైట్ల గురించి ఇంతకుముందు పోస్టులలో తెలుసుకున్నాం. ఎన్నో ఉపయోగకరమైన ఉచిత సాప్ట్ వేర్లను అందిస్తున్న కొమోడో కూడా ఉచిత ఆన్ లైన్ స్టోరేజ్ ని అందిస్తుంది. చక్కటి ఇంటర్ ఫేస్ కలిగిన Comodo Online Storage లో 5GB వరకు డాటా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ కి రిఫర్ చెయ్యటం ద్వారా ఒక్కరికి 200MB చొప్పున గరిష్టంగా 10 GB వరకు స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవచ్చు.




వెబ్ సైట్లు: Comodo Online Storage

ధన్యవాదాలు