Wednesday, June 30, 2010

హార్డ్ డిస్క్ పనితనాన్ని మెరుగుపరచటానికి చిట్కాలు!!!

ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు అందరికీ తెలిసినవి అయినా మరొక్కసారి మననం చేసుకుందాం:

హార్డ్ డిస్క్ లో స్పేస్ వుంది కదా అని కనపడిన సాప్ట్ వేర్లు ఇనస్టలేషన్ చేసుకుంటూ పోతే కొంతకాలానికి సిస్టం వేగం మందగిస్తుంది, డాటా వివిధ ప్రదేశాలలో వ్యాప్తి చెందివుండటం వలన డాటా రీడ్/ రైట్ చెయ్యటానికి చాలా సమయం పడుతుంది. ఈ సమస్యని అధిగమించి హార్డ్ డిస్క్ ఫెర్ఫార్మెన్స్ ని పెంచటానికి ఈ క్రింది చిట్కాలు పాటించండి.




1. టెంపరరీ ఫైళ్ళను తొలగించటం:

ఏదైనా ఫైల్ లేదా ప్రోగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు టెంపరరీ ఫైళ్ళు క్రియేట్ చెయ్యబడతాయి. అన్నిసార్లూ విండోస్ వీటిని తొలగించదు దాంతో పీసీ పనితనం తగ్గుతుంది. టెంపరరీ ఫోల్డర్ లోని ఫైళ్ళను ఎప్పటికప్పుడు తొలగిస్తూ వుండాలి. అది ఎలాగంటే ముందుగా Control Panel కి వెళ్ళి Folder Options పై డబుల్ క్లిక్ చెయ్యాలి, ఇప్పుడు ఓపెన్ అయిన Folder Options విండోలో View టాబ్ కి వెళ్ళి Show hidden files and folders ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని Ok పై క్లిక్ చెయ్యాలి. ఇలా చెయ్యటం వలన సిస్టం లో దాగివున్న ఫైళ్ళు మరియు ఫోల్డర్లను చూడవచ్చు. ఇప్పుడు My Computer ఓపెన్ చేసి C డైరెక్టరీ లో Temp ఫోల్డర్ కై C:\> Documents and Settings ----> User Name ----> Local Settings ----> Temp కి వెళ్ళి అక్కడవున్న ఫైళ్ళను తొలగించాలి. ఫైళ్ళను తొలగించేముందు అన్ని ప్రోగ్రాములు మరియు ఫైళ్ళు క్లోజ్ చెయ్యాలి.

అలాగే ఇంటర్నెట్ వాడుతుంటే కనుక రెగ్యులర్ గా హిస్టరీని, కుకీస్ ని ఫైళ్ళను డిలీట్ చేస్తూ వుండాలి.

టెంపరరీ ఫైళ్ళను తొలగించటం కోసం FCleaner, CCleaner, మరియు Comodo System Cleaner లను ఉపయోగించవచ్చు.

2. డూప్లికేట్ ఫైళ్ళను తొలగించటం:
హార్డ్ డిస్క్ లో వున్న డూప్లికేట్ ఫైళ్ళను తరచూ తొలగిస్తూవుండాలి, డూప్లికేట్ ఫైళ్ళను కనుగొనటం లో డూప్లికేట్ ఫైల్ ఫైండర్ సాప్ట్ వేర్ల సహాయం తీసుకోవచ్చు. ఉదా: Duplicate cleaner, Fast Duplicate File Finder, CloneSpy, Duplicate File Finder, DoubleKiller.

3. అనవసరమైన ఫైళ్ళను తొలగించటం:
అనసరమైన ఫైళ్ళను తరచూ తొలగించాలి, అలానే ఎక్కువ డిస్క్ స్పేస్ ఆక్రమించే ఫైళ్ళను/ ఫోల్డర్లను SpaceSniffer అనే సాప్ట్వేర్ సహాయంతో కనుగొని అవసరమైతే ఆన్ లైన్ లో సేవ్ చేసుకోవచ్చు, దీని కోసం Dropbox, Skydrive, Adrive మొదలగు వాటిని వాడుకోవచ్చు.

4. హార్డ్ డిస్క్ డీఫ్రాగ్ మెంటేషన్:
కంప్యూటర్ కొన్న క్రొత్తలో చాలా ఫాస్ట్ గా వుంటుంది, రాను రాను ప్రోగ్రాములు ఇనస్టలేషన్ మరియు అన్ ఇన్ స్టాల్ చెయ్యటం వలన హార్డ్ డిస్క్ లో మధ్య మధ్యలో కొన్ని బ్లాక్స్ లలో ఖాళీ ప్రదేశాలు ఏర్పడతాయి. తర్వాత ఏదైనా డిస్క్ పై వ్రాయాలంటే ఎక్కడ ఖాళీ దొరికితే అక్క్డడ వ్రాయబడుతుంది. దీనివలన డిస్క్ పై వ్రాయాలన్నా లేదా రీడ్ చెయ్యాలన్నా ఎక్కువ సమయం పడుతుంది. హార్డ్ డిస్క్ లోని non-consecutive parts ఒక దగ్గరికి తీసుకొని రావటానికి తరచూ హార్డ్ డిస్క్ ని డీఫ్రాగ్మెంట్ చేస్తూవుండాలి.
Hard Disk Defragmentation కోసం My Computer పై మౌస్ రైట్ క్లిక్ చేసి Manage సెలెక్ట్ చేసుకొంటే Computer Management ఓపెన్ అవుతుంది, అక్కడ వున్న Disk Defragmenter పై క్లిక్ చెయ్యాలి. తర్వాత Defragment చెయ్యవలసిన డిస్క్ ని సెలెక్ట్ చేసుకొని Defragment బటన్ పై క్లిక్ చెయ్యాలి. ఇదికాక థర్డ్ పార్టి సాప్ట్ వేర్లైన Auslogics Disk Defrag, Smart Defrag, మరియు UltraDefrag ని డిస్క్ డీఫ్రాగ్ మెంటేషన్ కోసం ఉపయోగించవచ్చు.

5. డిటెక్ట్ అండ్ రిపైర్ డిస్క్ ఎర్రర్స్:

హార్డ్ డిస్క్ లోని ఎర్రర్స్ అంటే బ్యాడ్ సెక్టార్స్ ఏమైనా ఉన్నయా అని తెలుసుకోవటానికి విండోస్ లోని హార్డ్ డిస్క్ ఎర్రర్ చెకింగ్ యుటిలిటీ ఉపయోగపడుతుంది. దీనికోసం My Computer ఓపెన్ చేసి చెక్ చెయ్యవలసిన డిస్క్ పార్టీషన్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి Properties ఓపెన్ చేసి Tools టాబ్ కి వెళ్ళి Error-checking దగ్గరవున్న Check Now బటన్ పై క్లిక్ చెయ్యాలి.

6.Recycle Bin లో ఫైళ్ళను తొలగించటం:

డిలీట్ చేసిన ఫైళ్ళు Recycle Bin లో చేరతాయి, [Shift] + [Delete] కీలను ప్రెస్ చెయ్యటం ద్వారా డిలీట్ అయిన ఫైళ్ళు Recycle Bin కి చేరవు. Recycle Bin లో ఫైళ్ళను తొలగించటం ద్వారా డిస్క్ స్పేస్ ఆదా చెయ్యవచ్చు.


పైన తెలియజేసిన సాప్ట్ వేర్లు పూర్తిగా ఉచితం. వాటికోసం గూగుల్ సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


హార్డ్ డిస్క్ ఆప్టిమైజేషన్ కి సంబంధించిన CNET వీడియో ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

Friday, June 25, 2010

Windows Live Essentials - ఉచిత డెస్క్ టాప్ అప్లికేషన్ల సమాహారం

మైక్రోసాప్ట్ వారి WIndows Live Essentials beta ఒక ఉచిత డెస్క్ టాప్ అప్లికేషన్ల సమాహారం ...





Windows Live Essentials beta వున్న ప్రోగ్రామ్స్:

1. Photo Gallery - Edit, organize, tag, and share your photos
2. Mail - Read and Reply to multiple e-mail accounts in one place
3. Movie Maker - Create beautiful, memorable movies, then publish to the web in a few clicks.
4. Messenger - Chat instantly with friends and family on your desktop, on the web, and on your mobile phone.
5. Writer - Compose a blog post, add your photos and links to your videos, and then publish on the web.
6. Family Safety - Manage and monitor your children's Internet activity so they can surf the web more safely.
7. Bing Bar - Get search results from Bing without leaving the website you're on.
8. Messenger Companion - Easily share and discuss social updates while you surf the web in Internet Explorer.
9. Sync - Sync your files between computers and access your primary PC from almost any Internet-connected computer.
10. Microsoft Office Outlook Connector - Use Outlook to manage your Hotmail inbox, Windows Live Calendar, and Windows Live Contacts.

గమనిక:
విండోస్ లైవ్ మూవో మేకర్ మరియు విండోస్ లైవ్ ఫోటో గాలరీ లోని స్లైడ్ షో ఫీచరు విండోస్ ఎక్స్పీ లో పనిచెయ్యవు.


డౌన్లోడ్: Windows Live Essentials beta

ధన్యవాదాలు

ట్రైన్ టికెట్ స్టేటస్, ట్రైన్ ఎంక్వయరీ సమాచారం ఎస్.ఎమ్.ఎస్ ద్వారా తెలుసుకోవటానికి...



మరిన్ని వివరాల కోసం ఇక్కడ చూడండి.

ధన్యవాదాలు

Thursday, June 24, 2010

Kaspersky GetSystemInfo - మీ పీసీ సమస్యలు తెలుసుకోవటానికి!!!

Kaspersky రూపొందించిన GetSystemInfo అనే ఉచిత యుటిలిటీని ఉపయోగించి మన సిస్టం యొక్క పూర్తి సమాచారం తో పాటు మాల్వేర్లు, ప్రోగ్రాం ఫంక్షన్ ఎర్రర్లు, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్సర్లు, ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్ వేర్లు, డ్రైవర్లు, పోర్ట్స్ మొదలగు సమాచారాన్ని పొందవచ్చు. మన పీసీ సమస్యలను డయాగ్నోసిస్ చెయ్యటంలో ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. GetSystemInfo సైట్ కి వెళ్ళి సాప్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకొని రన్ చేస్తే సిస్టం పూర్తిగా స్కాన్ చెయ్యబడుతుంది. GetSystemInfo ని ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు. settings ని అవసరమనుకొంటే Customize చేసుకోవచ్చు.





స్కానింగ్ పూర్తి అయిన తర్వాత లాగ్ ఫైల్ డెస్క్ టాప్ పై సేవ్ చెయ్యబడుతుంది. తర్వాత GetSystemInfo సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడ ’Click Here' పై క్లిక్ చేస్తే మన పీసీ యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.




వెబ్ సైట్: GetSystemInfo

ధన్యవాదాలు

Wednesday, June 23, 2010

చేతివ్రాత నే ఫాంట్ గా మార్చుకోవటానికి!!!

చేతి వ్రాత (హ్యాండ్ రైటింగ్) ని ఫాంట్ గా మార్చుకోవటానికి సంబంధించిన పోస్ట్ ఇంతకు ముందు ఒకటి చేశాను. దానిని ఇక్కడ చూడండి. అదేవిధంగా మన హ్యాండ్ రైటింగ్ ని ఫాంట్ గా మార్చుకోవటానికి PilotHandwriting సహాయపడుతుంది. అదెలాగో ఈ క్రింది వీడీయో చూడండి.




ముందుగా PilotHandwriting సైట్ కి వెళితే వీడీయో వస్తుంది, దాని తర్వాత Next బటన్ పై క్లిక్ చేసి టెంప్లేట్ ని ప్రింట్ తీసుకోవాలి. దానిపై abcd లు చేతితో వ్రాయాలి. తర్వాత దానిని స్కానర్ లేదా వెబ్ కామ్ లేదా డిజికామ్ సహాయంతో కాప్చర్ చెయ్యాలి. దానిని PilotHandwriting సైట్ కి అప్ లోడ్ చెయ్యాలి. కావాలంటే టచ్ అప్ లేదా ఫాంట్ ని సరిచేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఫాంట్ సేవ్ చెయ్యబడుతుంది. ఇక ’Write' బటన్ పై క్లిక్ చేసి టైప్ చెయ్యటమే.


వెబ్ సైట్ : PilotHandwriting

ధన్యవాదాలు

Monday, June 21, 2010

Video Joiner - భిన్న వీడీయో క్లిప్పులను ఒకటిగా కలపటానికి!!

ఏదైనా ఫంక్షన్ లో లేదా విహారయాత్రలకు వెళ్ళినప్పుడు హ్యాండీకామ్ తో తీసిన వీడియో క్లిప్పింగ్స్ లేదా ఏదైనా చిన్న చిన్న వీడియో క్లిప్స్ ని Video Joiner తో జాయిన్ చేసి ఒకే వీడియో గా మార్చుకోవచ్చు. ప్రముఖ వీడియో ఫార్మేట్లైన AVI,MPEG, WMA, MP4, FLV లను సపోర్ట్ చేస్తుంది. మనం కలిపే వీడియో లు ఒకే ఫార్మేట్ లేదా భిన్న ఫార్మేట్లలో వున్నా కూడా జాయిన్/ మెర్జ్ చెయ్యవచ్చు. మెర్జ్ చేసిన ఫైల్ ని కావలసిన ఫార్మేట్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. దీనిని ఉపయోగించటం చాలా సులువు.



Features
  • Join video of same or different formats to AVI, MP4, FLV, 3GP, etc.
  • Direct & fast joining without recompression or quality loss
  • All encoders/codec are built-in without further download or installation needs
  • Allows you to add as many files as you want
  • Ability to handle large video with size more than even 2 GB
  • Schedule converting supported to arrange the order of video to be merged
  • Presets with configuration of bit rate, frame rate & resolution to get the best quality
  • Auto post-process actions to release you from waiting to the end of the task
  • Wizard & instructions of merging provided
  • Easy GUI with drag-and-drop simplicity
  • A completely free video joiner!


డౌన్లోడ్: AVI/MPEG/WMA/MP4/FLV Video Joiner

వివిధ ఉచిత వీడీయో/ ఆడియో సాప్ట్ వేర్ల కై http://www.freeaudiovideosoft.com/ సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Wednesday, June 16, 2010

URL Void - స్కాన్ వెబ్ సైట్స్ ఫర్ వైరసెస్

No Virus Thanks వారిచే రూపొందించబడిన URL Void సైట్ కి వెళ్ళి కావలసిన వెబ్ సైట్ అడ్రస్ ఎంటర్ చేసి ఆ సైట్లో ప్రమాదకరమైన వైరస్ లు వున్నవీ లేనిదీ తెలుసుకోవచ్చు. Google Diagnostic, McAfee SiteAdvisor, Norton SafeWeb, MyWOT మొదలగు స్కానింగ్ ఇంజిన్లను ఉపయోగించి వైరస్ స్కానింగ్ చేస్తారు. వెబ్ సైట్ ఓనర్లు / బ్లాగర్లు తమ సైట్లను చెక్ చేసుకోవచ్చు.




వెబ్ సైట్: URL Void

గమనిక:
ఇక్కడ సైట్లను స్కాన్ చేశాం కదా ... అది క్లీన్ అని చూపించింది కదా అని ప్రమాదకర సైట్ కాదు అని అనుకోవద్దు.

ధన్యవాదాలు

Monday, June 14, 2010

Blackle - ఎనర్జీ సేవింగ్ సెర్చ్ ఇంజిన్

గ్లోబర్ వార్మింగ్ గురించి సర్వత్రా చర్చ జరుగుతున్న ఈ తరుణం లో మన వంతు గా కొంతైనా ఎనర్జీ సేవ్ చేస్తే అది భావి తరాలకు ఉపయోగపడుంది. ఇప్పుడు Blackle అనే ఎనర్జీ సేవింగ్ సెర్చ్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఇంటర్నెట్ లో ఏదైనా సెర్చ్ చెయ్యలంటే కనుక గూగుల్ కి వెళతాం అలా కాకుండా ఈ సారి http://www.blackle.com/ సైట్ కి వెళ్ళండి. ఇక్కడ అంతా నల్లగా వుండి కావలసిన టెక్స్ట్ మాత్రం వైట్ గా డిస్ప్లే అవుతుంది. స్క్రీన్ మొత్తం వైట్ (లేదా లైట్) వుండటం కన్నా బ్లాక్ గా (వెలిగే పిక్సెల్స్ తక్కువగా) ఉండటం వలన విద్యుత్తు ను ఆదాచెయ్యవచ్చు. ఇక్కడ ఆదా అయ్యే విద్యుత్తు చాలా తక్కువ అయినా మనవంతు సహాయం.



వెబ్ సైట్: http://www.blackle.com/

ధన్యవాదాలు

ఫుట్ బాల్ (FIFA) వర్ల్డ్ కప్ లైవ్ చూడటానికి వెబ్ సైట్లు

ఫుట్ బాల్ చాలా ఆసక్తికరమైన ఆట, దీనిని తిలకించే వారి సంఖ్య మన దేశంలో కూడా తక్కువేమీ కాదు. ఆసక్తికలవారు మ్యాచ్ లను ఆన్ లైన్ లో చూడటం కోసం కొన్ని వెబ్ సైట్ వివరాలు తెలియ చేస్తున్నాను . ముందుగా FIFA 2010 World Cup షెడ్యూల్ కోసం ఇక్కడ చూడండి.



లైవ్ స్ట్రీమింగ్ సైట్లు:

1. ESPN 3
5. itv

ధన్యవాదాలు

Friday, June 11, 2010

గూగుల్ డాక్స్ కి ప్రత్యామ్నాయం మైక్రోసాప్ట్ వెబ్ ఆఫీస్ ....

మైక్రోసాప్ట్ మూడు రోజుల క్రితం వెబ్ ఆపీస్ - ఆన్ లైన్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ ని లాంచ్ చేసింది. http://office.live.com/ సైట్ కి వెళ్ళి విండోస్ లైవ్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఆఫీస్ అప్లికేషన్లు అయిన Word, Excel, PowerPoint మరియు OneNote ని ఆన్ లైన్ లో ఉపయోగించుకోవచ్చు. డెస్క్ టాప్ ఆఫీస్ లోని బేసిక్ పీచర్లు మాత్రమే ఇక్కడ వున్నాయి. మనం సేవ్ చేసుకొనే ఫైళ్ళు SkyDrive లోని ఉచిత 25 GB స్టోరేజ్ స్పేస్ లో సేవ్ చెయ్యబడతాయి. ఆన్ లైన్ లో ఫైల్ క్రియేట్, మోడిఫై, డౌన్లోడ్ మరియు అప్ లోడ్ చేసుకొనే సదుపాయం వుంది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ USA, Canada, Great Britain and Ireland లోని విండోస్ లైవ్ ఎకౌంట్ యూజర్లు మాత్రమే వినియోగించవచ్చు. నాకున్న రెండు లైవ్ ఐడీ లలో ఒకదానితో ఈ వెబ్ అప్స్ ని ఉపయోగించగలుగుతున్నాను. ఆ ఐడీ క్రియేట్ చేసేటప్పుడు లొకేషన్ పైన చెప్పబడిన లొకేషన్ల లో ఒకటి యిచ్చి ఉండవచ్చు.




గూగుల్ డాక్స్ మరియు మైక్రోసాప్ట్ ఆఫీస్ వెబ్ అప్స్ ల మధ్య వున్న వ్యత్యాసం కోసం లైఫ్ హాకర్ వ్యాసాన్ని చూడండి.

ధన్యవాదాలు

Wednesday, June 9, 2010

మైక్రోసాప్ట్ సెక్యూరిటీ ఎసెన్షియల్స్ ని ఆఫ్ లైన్ లో అప్ డేట్ చెయ్యటానికి...

విండోస్ ఆపరేటింగ్ సిస్టం కొరకు మైక్రోసాప్ట్ వారు రూపొందించిన సెక్యూరిటీ సాప్ట్ వేర్ Microsoft Security Essentials సిగ్నేచర్ డాటాబేస్ ని కావలసినప్పుడు లేదా నిర్ణీత సమయం లో అప్ డేట్ చేసుకోవటానికి పీసీ ఇంటర్నెట్ కి కనెక్ట్ అయ్యి వుండాలి. ఒకవేళ ఇంటర్నెట్ సదుపాయం లేని కంప్యూటర్ల లో Microsoft Security Essentials సిగ్నేచర్ డాటాబేస్ ని ఆఫ్ లైన్ లో అప్ డేట్ చెయ్యటానికి క్రింద యివ్వబడైన లింక్ ల పై క్లిక్ చేసి exe ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని అప్ డేట్ చెయ్యవలసిన సిస్టం లో రన్ చేస్తే Microsoft Security Essentials సిగ్నేచర్ డాటాబేస్ అప్ డేట్ చెయ్యబడుతుంది.


Microsoft Security Essentials Signature Download

Signature file for 32-bit Windows systems
Signature file for 64-bit Windows systems

ధన్యవాదాలు

Thursday, June 3, 2010

మీరే స్వంతగా 3D కళ్ళద్దాలు తయారుచేసుకోండి !!!

3D వీడియోలు లేదా సినిమాలు చూడాలంటే కనుక 3D కళ్ళద్దాలు అవసరమవుతాయి, అవి చాలా ఖరీదుగా వుంటాయి. మనమే సొంతగా 3D కళ్ళద్దాలు తయారుచేసుకుంటే....

కావలసిన వస్తువులు:
రెడ్ మరియు బ్లూ కలర్ పర్మినెంట్ మార్కర్ పెన్ లు మరియు ఏదైనా ప్లాస్టిక్ ట్రాన్సపరెంట్ షీటు ఉదా. CD కవర్ (jewel case) లోని ట్రాన్సపరెంట్ భాగం.

తయారుచేసే విధానం:
CD Case లోని ట్రాన్సపరెంట్ సైడ్ ని తీసుకొని మన కళ్ళ సైజ్ కి రెడ్ మరియు బ్లూ మార్కర్లతో చతురస్రాకారం లో దిద్దాలి. గ్లాసెస్ రెడీ... 3D మూవీ లేదా వీడీయో చూసేటప్పుడు బ్లూ భాగం కుడి కంటికి , ఎరుపు భాగం ఎడమ కంటికి వుండేలా చూడాలి.



ట్రాన్సపరెంట్ సైడ్ మనకు అనుకూలంగా కావలసిన విధంగా కళ్ళజోడు లా చేసుకోవచ్చు.

వీడియో:


అదేవిధంగా సన్ గ్లాసెస్ ని 3D గ్లాసెస్ గా మార్చటానికి వీడియో:


ఇంకెందుకు ఆలశ్యం ట్రై చెయ్యండి!!!

ధన్యవాదాలు

Tuesday, June 1, 2010

BlueScreenView - Blue Screen Of Death (BSOD) క్రాష్ సమాచారాన్ని తెలుసుకోవటానికి...

Blue Screen Of Death (BSOD) క్రాష్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన సమాచారం మినీడంప్ ఫైళ్ళ లో నిల్వచెయ్యబడుతుంది. BlueScreenView అనే యుటిలిటీ ఆ మినిడంప్ ఫైళ్ళవు శోధించి వాటిలోని క్రాష్ సమాచారాన్ని ఒక టేబుల్ రూపంలో మనకు చూపిస్తుంది, ఆ టేబుల్ లో మినిడంప్ ఫైల్ పేరు, క్రాష్ సమయం, బగ్ చెక్ స్ట్రింగ్ తదితర వివరాలు వుంటాయి , అంతేకాకుండా క్రాష్ కి కారణమైన డ్రైవర్ లేదా మాడ్యూల్ కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు.





BlueScreenView కి సంబంధించిన మరింత సమాచారం కోసం NirSoft సైట్ చూడండి.

డౌన్లోడ్: BlueScreenView (123 KB)

ధన్యవాదాలు

Revo Uninstaller - ’Add or Remove Programs' కి ప్రత్యామ్నాయ యుటిలిటీ...

మన పీసీ లోని ఎదైనా ప్రోగ్రామ్ ని తొలగించటానికి Control Panel లోని ’Add or Remove Programs' ని ఉపయోగిస్తూవుంటాం. ఒకవేళ ’Add or Remove Programs' ఏదైనా ప్రోగ్రామ్ ని తొలగించటం లో విఫలమైనప్పుడు దానికి ప్రత్యామ్నాయమైన Revo Uninstaller అనే ఉచిత యుటిలిటీని ఉపయోగించి దానిని తొలగించవచ్చు. Revo Uninstaller డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ప్రోగ్రాం లాంచ్ చేస్తే మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన ప్రోగ్రామ్స్ యొక్క ఐకాన్లను చూపిస్తుంది, అలాకాకుండా ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఇనస్టలేషన్ తేదీ, సైజ్, వెర్షన్ తదితర వివరాలు తెలుసుకోవాలంతే View లోని Details పై క్లిక్ చెయ్యాలి. ఇక ఇప్పుడు కావలసిన ప్రోగ్రామ్ ని తొలగించటం కోసం దానిని సెలెక్ట్ చేసుకొని మెయిన్ మెనూ లోని ’Uninstall' పై క్లిక్ చెయ్యాలి. అలా కాకుండా తొలగించవలసిన ప్రోగ్రామ్ పై మౌస్ రైట్ క్లిక్ చేసి ’Uninstall' సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ మౌస్ రైట్ క్లిక్ చెయ్యగా వచ్చే కమాండ్లతో ప్రోగ్రామ్ కి సంబంధించిన రిజిస్ట్రీ కీ ఓపెన్ చెయ్యటం, గూగుల్ లో వెతకటం, ఇనస్టలేషన్ చేసిన లొకేషన్ కి వెళ్ళటం మొదలగునవి చెయ్యవచ్చు.




Revo Uninstaller కి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Revo Uninstaller

ధన్యవాదాలు