Thursday, June 24, 2010

Kaspersky GetSystemInfo - మీ పీసీ సమస్యలు తెలుసుకోవటానికి!!!

Kaspersky రూపొందించిన GetSystemInfo అనే ఉచిత యుటిలిటీని ఉపయోగించి మన సిస్టం యొక్క పూర్తి సమాచారం తో పాటు మాల్వేర్లు, ప్రోగ్రాం ఫంక్షన్ ఎర్రర్లు, బ్యాక్ గ్రౌండ్ ప్రాసెస్సర్లు, ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్ వేర్లు, డ్రైవర్లు, పోర్ట్స్ మొదలగు సమాచారాన్ని పొందవచ్చు. మన పీసీ సమస్యలను డయాగ్నోసిస్ చెయ్యటంలో ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది. GetSystemInfo సైట్ కి వెళ్ళి సాప్ట్ వేర్ డౌన్లోడ్ చేసుకొని రన్ చేస్తే సిస్టం పూర్తిగా స్కాన్ చెయ్యబడుతుంది. GetSystemInfo ని ఇనస్టలేషన్ చెయ్యనవసరం లేదు. settings ని అవసరమనుకొంటే Customize చేసుకోవచ్చు.





స్కానింగ్ పూర్తి అయిన తర్వాత లాగ్ ఫైల్ డెస్క్ టాప్ పై సేవ్ చెయ్యబడుతుంది. తర్వాత GetSystemInfo సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడ ’Click Here' పై క్లిక్ చేస్తే మన పీసీ యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.




వెబ్ సైట్: GetSystemInfo

ధన్యవాదాలు