Wednesday, June 23, 2010

చేతివ్రాత నే ఫాంట్ గా మార్చుకోవటానికి!!!

చేతి వ్రాత (హ్యాండ్ రైటింగ్) ని ఫాంట్ గా మార్చుకోవటానికి సంబంధించిన పోస్ట్ ఇంతకు ముందు ఒకటి చేశాను. దానిని ఇక్కడ చూడండి. అదేవిధంగా మన హ్యాండ్ రైటింగ్ ని ఫాంట్ గా మార్చుకోవటానికి PilotHandwriting సహాయపడుతుంది. అదెలాగో ఈ క్రింది వీడీయో చూడండి.




ముందుగా PilotHandwriting సైట్ కి వెళితే వీడీయో వస్తుంది, దాని తర్వాత Next బటన్ పై క్లిక్ చేసి టెంప్లేట్ ని ప్రింట్ తీసుకోవాలి. దానిపై abcd లు చేతితో వ్రాయాలి. తర్వాత దానిని స్కానర్ లేదా వెబ్ కామ్ లేదా డిజికామ్ సహాయంతో కాప్చర్ చెయ్యాలి. దానిని PilotHandwriting సైట్ కి అప్ లోడ్ చెయ్యాలి. కావాలంటే టచ్ అప్ లేదా ఫాంట్ ని సరిచేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ అకౌంట్ పై క్లిక్ చేసి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఫాంట్ సేవ్ చెయ్యబడుతుంది. ఇక ’Write' బటన్ పై క్లిక్ చేసి టైప్ చెయ్యటమే.


వెబ్ సైట్ : PilotHandwriting

ధన్యవాదాలు