Friday, June 11, 2010

గూగుల్ డాక్స్ కి ప్రత్యామ్నాయం మైక్రోసాప్ట్ వెబ్ ఆఫీస్ ....

మైక్రోసాప్ట్ మూడు రోజుల క్రితం వెబ్ ఆపీస్ - ఆన్ లైన్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ సర్వీస్ ని లాంచ్ చేసింది. http://office.live.com/ సైట్ కి వెళ్ళి విండోస్ లైవ్ అకౌంట్ తో లాగిన్ అయ్యి ఆఫీస్ అప్లికేషన్లు అయిన Word, Excel, PowerPoint మరియు OneNote ని ఆన్ లైన్ లో ఉపయోగించుకోవచ్చు. డెస్క్ టాప్ ఆఫీస్ లోని బేసిక్ పీచర్లు మాత్రమే ఇక్కడ వున్నాయి. మనం సేవ్ చేసుకొనే ఫైళ్ళు SkyDrive లోని ఉచిత 25 GB స్టోరేజ్ స్పేస్ లో సేవ్ చెయ్యబడతాయి. ఆన్ లైన్ లో ఫైల్ క్రియేట్, మోడిఫై, డౌన్లోడ్ మరియు అప్ లోడ్ చేసుకొనే సదుపాయం వుంది. ప్రస్తుతానికి ఈ సర్వీస్ USA, Canada, Great Britain and Ireland లోని విండోస్ లైవ్ ఎకౌంట్ యూజర్లు మాత్రమే వినియోగించవచ్చు. నాకున్న రెండు లైవ్ ఐడీ లలో ఒకదానితో ఈ వెబ్ అప్స్ ని ఉపయోగించగలుగుతున్నాను. ఆ ఐడీ క్రియేట్ చేసేటప్పుడు లొకేషన్ పైన చెప్పబడిన లొకేషన్ల లో ఒకటి యిచ్చి ఉండవచ్చు.




గూగుల్ డాక్స్ మరియు మైక్రోసాప్ట్ ఆఫీస్ వెబ్ అప్స్ ల మధ్య వున్న వ్యత్యాసం కోసం లైఫ్ హాకర్ వ్యాసాన్ని చూడండి.

ధన్యవాదాలు