3D వీడియోలు లేదా సినిమాలు చూడాలంటే కనుక 3D కళ్ళద్దాలు అవసరమవుతాయి, అవి చాలా ఖరీదుగా వుంటాయి. మనమే సొంతగా 3D కళ్ళద్దాలు తయారుచేసుకుంటే....
కావలసిన వస్తువులు:
రెడ్ మరియు బ్లూ కలర్ పర్మినెంట్ మార్కర్ పెన్ లు మరియు ఏదైనా ప్లాస్టిక్ ట్రాన్సపరెంట్ షీటు ఉదా. CD కవర్ (jewel case) లోని ట్రాన్సపరెంట్ భాగం.
తయారుచేసే విధానం:
CD Case లోని ట్రాన్సపరెంట్ సైడ్ ని తీసుకొని మన కళ్ళ సైజ్ కి రెడ్ మరియు బ్లూ మార్కర్లతో చతురస్రాకారం లో దిద్దాలి. గ్లాసెస్ రెడీ... 3D మూవీ లేదా వీడీయో చూసేటప్పుడు బ్లూ భాగం కుడి కంటికి , ఎరుపు భాగం ఎడమ కంటికి వుండేలా చూడాలి.
ట్రాన్సపరెంట్ సైడ్ మనకు అనుకూలంగా కావలసిన విధంగా కళ్ళజోడు లా చేసుకోవచ్చు.
వీడియో:
అదేవిధంగా సన్ గ్లాసెస్ ని 3D గ్లాసెస్ గా మార్చటానికి వీడియో:
ఇంకెందుకు ఆలశ్యం ట్రై చెయ్యండి!!!
ధన్యవాదాలు