Monday, November 29, 2010

Tux Paint, KidPaint, FlowPaint - పిల్లల కోసం ఉచిత Paint సాప్ట్ వేర్లు!!!

పిల్లల పెయింటింగ్ స్కిల్స్ ని పెంచటం కోసం ఉపయోగపడే కొన్ని ఉచిత Paint సాప్ట్ వేర్ల గురించి ఇక్కడ చూద్దాం. ఇవి చాలా చిన్న అప్లికేషన్లు అయినా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పిల్లలు వీటిని ఉపయోగించటానికి చాలా ఆశక్తి చూపుతారు. అవి:

1. Tux Paint:

కొన్ని స్కూళ్ళ లో ఒకటవ తరగతి వారికి కంప్యూటర్ కోర్స్ గా Tux Paint ఉంది. దీని సంబంధించిన మెటీరియల్ NIIT వారు అందిస్తున్నారు.



Tux Paint ఉపయోగించే విధానానికి సంబంధించిన వీడియో చూడండి:


డౌన్లోడ్: Tux Paint

2.KidPaint:



డౌన్లోడ్: KidPaint

3. FlowPaint:



డౌన్లోడ్: FlowPaint

ధన్యవాదాలు

Saturday, November 27, 2010

Keylogger Beater - కీలాగర్ల నుండి రక్షణ పొందటానికి!!! [ఫైర్‍ఫాక్స్ ప్లగిన్]

కీలాగర్లచే కీబోర్డ్ స్ట్రోక్స్ ని రికార్డ్ చెయ్యకుండా నిరోధించటానికి యాంటీ-కీలాగర్లు ఉపయోగపడతాయి. అటువంటిదే Keylogger Beater కాకపోతే ఇది ఫైర్‍ఫాక్స్ ప్లగిన్. ఇది అందించే వర్చువల్ కీబోర్డ్ ని ఉపయోగించి పాస్‍వార్డ్స్ టైప్ చెయ్యటం వలన కీలాగర్లు మన పాస్‍వార్డ్స్ ని దొంగిలించలేరు.

Keylogger Beater ఎలా పనిచేస్తుంది?

ముందుగా ఫైర్‍ఫాక్స్ యాడ్‍ఆన్స్ సైట్ నుండి Keylogger Beater ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. బ్రౌజర్ లో దీనిని యాక్టివేట్ చెయ్యటానికి [Ctrl]+[shift]+[k] కీ లను ప్రెస్ చెయ్యాలి లేదంటే మౌస్ రైట్ క్లిక్ చేసి కాంటెక్స్ట్ మెనూ ద్వారా Keylogger Beater ని యాక్టివేట్ చెయ్యవచ్చు.



ఇక బ్రౌజర్ లో టెక్స్ట్ బాక్స్ లో ఏదైనా టైప్ చేసేటప్పుడు వర్చువల్ కీబోర్డ్ పాప్-అప్ అవుతుంది, దానిని ఉపయోగించి ఇన్‍పుట్ ఇవ్వవచ్చు, వర్చువల్ కీబోర్డ్ అవసరం లేదనుకుంటే [Esc] కీ ప్రెస్ చెయ్యాలి.

ఇక వర్చువల్ కీబోర్డ్ లో రెండు రకాల కీస్ ఉంటాయి Real Keys మరియు Shadow keys. మన ఫిజికల్ కీ బోర్డ్ పై Shadow keys ప్రెస్ చేసినప్పుడు బ్రౌజర్ లో టెక్స్ట్ బాక్స్ లో Real Keys ఎంటర్ అవుతాయి. అంటే కీలాగర్లు Shadow keys మాత్రమే రికార్డ్ చేస్తాయి.




మౌస్ తో ఇన్‍ఫుట్ ఇస్తే కీలాగర్లు స్క్రీన్ షాట్స్ ని కాప్చర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్‍పుట్ కోసం ఫిజికల్ కీబోర్డ్ పై షాడో కీస్ ప్రెస్ చెయ్యటమే ఉత్తమం.

Keylogger Beater పై మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Keylogger Beater

ధన్యవాదాలు

Friday, November 26, 2010

టెక్స్ట్ ని స్పీచ్ గా మార్చే వెబ్ సైట్లు (Text-to-Speech Conversion)

కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువగా చూడటం వలన కళ్ళు అలసిపోతాయి, కొంత బద్దకం వలన స్క్రీన్ పై చదవటం ఎందుకు ఎవరైనా చదివి వినిపిస్తే బాగుండు అనిపించే వారికి ఇప్పుడు చెప్పబోయే సైట్లు ఉపయోగపడతాయి, అవన్నీ టెక్స్ట్ ని స్పీచ్ గా మారుస్తాయి, ఇక టెక్స్ట్ ని చదవనవసరం లేదు ఎంచక్కా వినటమే...

1) SpokenText.Net





వెబ్ సైట్: SpokenText.Net


2) iSpeech.Org


వెబ్ సైట్:iSpeech.Org

3) ImTranslator:



వెబ్ సైట్: ImTranslator

4) ReadTheWords.com :



వెబ్ సైట్: ReadTheWords.com

5) vozMe:



వెబ్ సైట్: vozMe

6. Text2Speech.org :



వెబ్ సైట్: Text2Speech.org


7.HearWho.com :




వెబ్ సైట్: .HearWho.com :


ధన్యవాదాలు

Wednesday, November 24, 2010

ఏదైనా ఈ-మెయిల్ అడ్రస్ సరియైనదా కాదా అని తెలుసుకోవటం ఏలా? [వీడియో]

ఈ-మెయిల్ అడ్రస్ వెరిఫై చెయ్యటానికి సంబంధించిన Digital Inspiration వీడియో ఇక్కడ చూడండి:



ధన్యవాదాలు

Monday, November 22, 2010

Google Apps కస్టమర్లు ఇప్పుడు మరిన్ని గూగుల్ ప్రోడక్ట్స్ ని యాక్సెస్ చెయ్యవచ్చు!!!

గూగుల్ అప్స్ కస్టమర్లు ఇప్పటివరకు కొన్ని బేసిక్ ప్రొడక్ట్స్ (E-mail, documents, calender, sites, chats మరియు groups) మాత్రమే యాక్సెస్ ఉండేది, కానీ ఇప్పుడు మరిన్ని ప్రొడక్ట్స్ ని యాక్సెస్ చెయ్యవచ్చు అవి ఏమిటో ఈ క్రింది వీడియో లో చూడండి.



మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్ చూడండి.

ధన్యవాదాలు

Saturday, November 20, 2010

Any Weblock - అనవసరమైన వెబ్‌సైట్లను బ్లాక్ చెయ్యటానికి!!!

ఇంటర్నెట్ ఉన్న ఇళ్ళలో తల్లిదండ్రులకు తలనొప్పే, పిల్లలు ఎటువంటి సైట్లు చూస్తున్నారా అని వారి పై నిఘా వెయ్యవలసి వస్తుంటుంది. పిల్లలు అనవసరమైన వెబ్సైట్లు చూడకుండా వాటిని బ్లాక్ చెయ్యటానికి Any Weblock అనే చిన్న అప్లికేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీనిని పాస్వార్డ్ తో కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి నెట్వర్క్ అనుభవం లేకున్నా కేవలం డొమైన్/సబ్ డొమైన్ పేరు తెలిస్తే చాలు సైట్ ని బ్లాక్ చెయ్యవచ్చు. Any Weblock డౌన్లోడ్ చేసి ఇనస్టలేషన్ చేసిన తర్వాత మొదటిసారి రన్ చేసినప్పుడు అడ్మిన్ పాస్వార్డ్ పెట్టుకోవాలి.

ఇక Any Weblock ఎలా ఉపయోగించాలో చూద్దాం:

Manange block list

  • Add, modify or remove block entries.
  • Export or import block list.

Any Weblock screenshot - main window


Block new website

  • Add a website domain for blocking.
  • Enter any additional subdomains for blocking.
  • Choose to block main domain or only its subdomains.

Any Weblock screenshot - block new website


Import block list

  • Append the entries from the imported list to current list.
  • Replace the current list entirely with the imported list.

Any Weblock screenshot - import from an external file


Password protection

  • Create a password to prevent unauthorized access.
  • Decide a secret question and answer for password reset.

Any Weblock screenshot - create a password


Backup and roll back

  • Backups are automatically created.
  • Choose a limit for the number of backups.
  • Roll back to a previous backup.





డౌన్లోడ్:Any Weblock

ధన్యవాదాలు

Thursday, November 18, 2010

Edmodo - ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల కోసం ఒక సోషల్ నెట్‌వర్క్!!!

Edmodo - ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల కోసం సురక్షితమైన ఒక లెర్నింగ్ సోషల్ నెట్‌వర్క్!!! ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫేస్‌బుక్ లాంటిదే. Edmodo సైట్ కి వెళ్ళగానే రెండు బటన్లు కనిపిస్తాయి అవి “I’m a Student” మరియు “I’m a Teacher“. టీచర్లు “I’m a Teacher“ బటన్ పై క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్ వార్డ్ తదితర వివరాలు ఇచ్చి సైన్-అప్ చెయ్యాలి. తర్వాత Edmodo హోమ్ పేజీకి వెళతాము అది ఫేస్‌బుక్ ని పోలి ఉంటుంది. అక్కడ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి, దానికోసం ’Groups' దగ్గర వున్న ’Create' పై క్లిక్ చేసి Group Name, Grade (తరగతి), Subject Area వివరాలు ఎంటర్ చేసి ’Create' బటన్ పై క్లిక్ చెయ్యాలి. గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత గ్రూప్ పేరు తో పాటు గ్రూప్ యాక్సెస్ కోడ్ కూడా జెనెరేట్ అవుతుంది,అది విద్యార్ధులు జాయిన్ అవటానికి ఉపయోగపడుతుంది. ఇక టీచర్లు తమ మెసేజ్ ని టైప్ చేసి గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని ’Send' బటన్ పై క్లిక్ చేస్తే మెసేజ్ ఆ గ్రూప్ కి పంపబడుతుంది.



ఇక విద్యార్ధులు అయితే సైట్ ఎంటర్ అవగానే వచ్చే “I’m a Student” బటన్ పై క్లిక్ చేసి టీచర్ చే క్రియేట్ చెయ్యబడిన గ్రూప్ కోడ్ ఎంటర్ చేసి యూజర్ నేమ్, పాస్ వార్డ్ తదితర వివరాలతో సైన్-అప్ చెయ్యాలి. మరొక గ్రూప్ జాయిన్ అవటానికి 'Groups' దగ్గర ఉన్న ’Join' పై క్లిక్ చేసి గ్రూప్ కోడ్ యిచ్చి దానిలో జాయిన్ అవ్వవచ్చు. విద్యార్ది కూడా టీచర్ లాగే తమ నోట్ కావలసిన గ్రూప్ కి పంపవచ్చు.



క్యాలెండర్, గ్రేడ్స్ మరియు లైబ్రరీ లింక్స్ కూడా ఉన్నాయి. లైబ్రరీ లో మన స్వంత ఫైళ్ళను భద్రపరచుకోవచ్చు. సెట్టింగ్స్ లో మన వ్యక్తిగత సమాచారం మరియు ఫోటో ని పెట్టవచ్చు. ఫేస్ బుక్ లాగానే టీచర్స్ లేదా స్టూడెంట్స్ ని సెర్చ్ చేసే సదుపాయం కలదు.

వెబ్‌సైట్: http://www.edmodo.com/

ధన్యవాదాలు

Wednesday, November 17, 2010

క్రొత్త ఫీచర్లతో TeamViewer 6 బీటా విడుదల!!!



ప్రముఖ రిమోట్ అడ్మినిస్ట్రేషన్/ షేరింగ్ టూల్ అయిన TeamViewer ఇప్పుడు క్రొత్త ఫీచర్లతో 6 బీటా వెర్షన్ ని విడుదల చేసింది. మెరుగైన ఫెర్ఫార్మెన్స్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ లో మార్పులు, మెరుగైన Quick Custom Support, క్రొత్త QuickJoin మాడ్యుల్, బెటర్ సెక్యూరిటీ, రీబూట్ తో ఆటోమాటిక్ రీకనెక్ట్ మొదలగునవి ఈ వెర్షన్ లో ప్రధానం.



QuickJoin ఫీచర్ తో ఆన్‌లైన్ మీటింగ్స్/ కాంఫరెన్సెస్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు లేదా ఆన్‌లైన్ ప్రెజెంటేషన్లు యివ్వవచ్చు.

మరింత సమాచారం మరియు డౌన్లోడ్ కొరకు TeamViewer సైట్ చూడండి.


డౌన్లోడ్: TeamViewer

ధన్యవాదాలు

Tuesday, November 16, 2010

బెస్ట్ ఆన్‌లైన్ HTML ఎడిటర్స్ !!!

HTML ఎడిటర్ - ఒక సాప్ట్‌వేర్ అప్లికేషన్ - వెబ్‌సైట్లు మరియు వెబ్‌పేజీలను సులభంగా తయారు చెయ్యటం లో ఇవి సహాయపడతాయి. ఎటువంటి అనుభవం లేకున్నా కోడ్స్/ స్క్రిప్ట్స్ వ్రాయటానికి కావలసినవన్నీ వీటిలో ఉంటాయి, అంతేకాకుండా కొన్ని ఎడిటర్స్ సింటాక్స్ సమస్యలను కూడా ఆటోమాటిక్ గా సరిచేస్తాయి.. ఇప్పుడు ఇక్కడ అంతర్జాలంలో లభించే కొన్ని ఆన్‌లైన్ HTML ఎడిటర్స్ గురించి తెలుసుకుందాం:

1.HTMLInstant:



వెబ్‌సైట్: HTMLInstant

2. Real-time HTML Editor:



వెబ్‌సైట్: Real-time HTML Editor

3.Tims Real Time HTML Editor:



వెబ్‌సైట్: Tims Real Time HTML Editor

4.Online HTML Editor:


వెబ్‌సైట్:Online HTML Editor


ధన్యవాదాలు

KidKeyLock - మౌస్ మరియు కీబోర్డ్ కీస్ ని లాక్ చెయ్యటానికి!!!

ఇంట్లో చిన్న పిల్లలు మన పీసీ మౌస్ మరియు కీబోర్డ్ కీస్ ని పొరపాటున ఏది పడితే అది క్లిక్ చెయ్యటం వలన పీసీ కి హాని కలగకుండా కీస్ ని డిసేబుల్ చెయ్యటానికి KidKeyLock అనే ఉచిత అప్లికేషన్ ఉపయోగపడుతుంది.



The application allows you to Lock the left mouse button, middle button, right button, double click action or all the things. You can even disable all the keyboard keys or only selected system keys. The application quietly runs in the system tray from where it can be configured. You can set the password which you can type whenever you want to enter a setup or quit the application when in disabled state.



డౌన్లోడ్: KidKeyLock

ధన్యవాదాలు

Monday, November 15, 2010

Zoho Support - వెబ్ ఆధారిత ఉచిత ఆన్‌లైన్ హెల్ప్‌డెస్క్/ కస్టమర్ సపోర్ట్ సాప్ట్‌వేర్

పాపులర్ వెబ్ ఆధారిత ఆఫీస్ సూట్ ని అందిస్తున్న ZOHO ఇప్పుడు కొత్త కాంపోనెంట్ ని జత చేసింది, అదే ZOHO సపోర్ట్ - ఇదొక హెల్ప్‌డెస్క్ అప్లికేషన్. ZOHO సపోర్ట్ కి సంబంధించిన వీడియో ని చూడండి.



మరింత సమాచారం కోసం zoho సైట్ చూడండి.

Website: zoho Support

ధన్యవాదాలు

Sunday, November 14, 2010

FreeVideoConverter - వీడియోలను ఒక ఫార్మేట్ నుండి వేరొక ఫార్మేట్ లోకి మార్చటానికి, బర్న్ చెయ్యటానికి, యూట్యూబ్ కి అప్‌లోడ్ చెయ్యటానికి ఇంకా చాలా...

FreeVideoConverter - ఒక శక్తివంతమైన వీడియో కన్వర్టర్. దీనిని ఉపయోగించి వీడియోలను ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి మార్చవచ్చు. AVI, MP4, MKV, WMV, MPG, 3GP, 3G2, SWF, FLV, TOD, MOV, DV, RM, QT, TS, MTS ఇలా 200 పైగా వీడియో ఫార్మేట్లను AVI, WMV, MP4, MKV, SWF, MPG, 3GP, MP3 ఫార్మేట్ లోకి మార్చవచ్చు. అంతేకాకుండా వీడియో ఫైళ్ళను డీవీడీ లోకి బర్న్ చెయ్యవచ్చు, వీడియోలను యూట్యూబ్ కి అప్‌లోడ్ చెయ్యవచ్చు, వీడియో ఫైళ్ళను MP3 లోకి మార్చవచ్చు, ఫోటోలను వీడియో స్లైడ్ షో గా మార్చవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా ( cut, rotate,లేదా join).



మరింత సమాచరం కోసం freemake.com సైట్ చూడండి.


డౌన్లోడ్: Free Video Converter

ధన్యవాదాలు

PDFRider - పీడీఎఫ్ ఫైళ్ళను Merge, Split, Rotate మరియు Edit చెయ్యటానికి!!!

PDFRider - ఒక ఉచిత పీడీఎఫ్ ఎడిటింగ్ సాప్ట్‌వేర్. దీనిని ఉపయోగించి పీడీఎఫ్ ఫైళ్ళను మెర్జ్ చెయ్యవచ్చు మరియు విడగొట్టవచ్చు, పేజీలను కలపవచ్చు మరియు తొలగించవచ్చు, పేజీలను రొటేట్ చెయ్యవచ్చు అంతేకాకుండా సెక్యూరిటీ కోసం encrypt మరియు decrypt చేసే సదుపాయం కూడా కలదు.



PDFRider ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఎడిట్ చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైల్ ని ఓపెన్ చెయ్యాలి, తర్వాత మెయిన్ మెనూ లోని టూల్స్ పై క్లిక్ చెస్తే పైన చెప్పిన ఆప్షన్లు వస్తాయి.


డౌన్లోడ్: PDFRider

ధన్యవాదాలు

Thursday, November 11, 2010

join.me - రిమోట్ స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్!!!

పీసీ ట్రబుల్ షూటింగ్ కోసం లేదా ప్రెజెంటేషన్స్ ఇవ్వటం కోసం మన పీసీ డెస్క్ టాప్ ని రిమోట్ లో యాక్సెస్ చెయ్యటానికి షేర్ చెయ్యవలసి వస్తుంది. ఎటువంటి స్క్రీన్ కాస్టింట్ సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ అవసరం లేకుండా join.me తో మీ పిసీ స్క్రీన్ ని ఇతరులతో చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు. దాని కోసం ముందుగా join.me సైట్ కి వెళ్ళి 'Start' పై క్లిక్ చేసి join.me executable ఫైల్ డౌన్లోడ్ చేసుకొని రన్ చెయ్యటమే (ఇనస్టలేషన్ అవసరం లేదు). ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మన స్క్రీన్ పై ఇక చిన్న విండో ఓపెన్ అవుతుంది, అక్కడ వున్న URL లింక్ ని కాపీ చేసుకొని మన స్క్రీన్ ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వారికి పంపాలి.





అవతలి వాళ్ళు ఆ లింక్ ని ఏదైనా బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే వాళ్ళు మన పీసీ స్క్రీన్ పై జరిగే ప్రతీదానిని చూడగలరు కానీ మన పీసీ ని రిమోట్ లో ఆపరేట్ చెయ్యలేరు. అవసరం లేనప్పుడు స్క్రీన్ కాస్టింగ్ ని Pause లేదా డిసేబుల్ చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ లో స్క్రీన్ షేరింగ్ తో పాటు ఛాట్, కాన్ఫరెన్స్ సదుపాయం కూడా కలదు.

వెబ్ సైట్: join.me

ధన్యవాదాలు

Tuesday, November 9, 2010

TrayOS - గూగుల్ అన్ని అప్లికేషన్లు ఒకేచోట నుండి యాక్సెస్ చెయ్యటానికి!!!

TrayOS అనే చిన్న ప్రోగ్రామ్ ని ఉపయోగించి గూగుల్ అప్లికేషన్లు ఒకేచోట అంటే సిస్టం ట్రే నుండే సులువుగా యాక్సెస్ చెయ్యవచ్చు. దానికోసం ముందుగా TrayOS ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, తర్వాత TrayOS సిస్టం ట్రే లో కూర్చుంటుంది. దాని పై క్లిక్ చేసి సైన్ ఇన్ చేసి అన్ని గూగుల్ అప్లికేషన్లను పొందవచ్చు. కొన్ని అప్లికేషన్లు మాత్రమే పైన టాప్ లో కనబడతాయి అయితే ’Settings' పై క్లిక్ చేసి కావలసిన అప్లికేషన్లను స్టార్ట్ చేసుకోవచ్చు. కావలసిన అప్లికేషన్ ఆటోస్టార్ట్ చేసుకోవచ్చు, అనవసరమైన వాటిని డిసేబుల్ చెయ్యవచ్చు.



వెబ్‌సైట్: TrayOS

ధన్యవాదాలు

Monday, November 8, 2010

Windroplr - ఫైల్, స్క్రీన్ షాట్ మరియు టెక్స్ట్ ని సులభంగా షేర్ చేసుకోవటానికి...

డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి ఫైళ్ళను షేర్ చేసుకోవటానికి మాక్ యూజర్లకు సుపరిచయమైన Droplr ఫీచర్లనే ఉపయోగించి Bruno Carvalho అనే సంస్థ విండోస్ యూజర్ల కోసం Windroplr ని రూపొందించింది. Windroplr విండోస్ XP, Vista, మరియు 7 లలో పనిచేస్తుంది. దీనిని ఇనస్టలేషన్ చెయ్యటానికి .NET 4.0 తప్పనిసరి.

Windroplr కి సంబంధించిన వీడియో:


వెబ్ సైట్: Windroplr

ధన్యవాదాలు

Conversion Tool - Temperature/length/weight ఆన్‌లైన్ కన్వర్షన్ టూల్

Conversion Tool ఇది ఆన్‌లైన్ కన్వర్షన్ టూల్, దీనిని ఉపయోగించి Temperature/length/weight లను కావలసిన కొలతలలోకి మార్చుకోవచ్చు. ఉదా. 40 డిగ్రీల సెల్సియల్ ఫారిన్ హీట్ లో ఎంత? 6 అడుగులు ఎన్ని సెంటీమీటర్లు? ఇలా ఒక కొలతని ఇంకొక కొలతలోకి మార్చుకోవచ్చు.



వెబ్‌సైట్: Conversion Tool

ధన్యవాదాలు

Thursday, November 4, 2010

alertful - ముఖ్యమైన విషయాలను ఈ మెయిల్ ద్వారా రిమైండ్ చెయ్యటానికి...

బిజీ లైఫ్ లో మనం చెయ్యవలసిన కొన్ని విషయాలను మర్చిపోతూ ఉంటాం, ఆ ఈవెంట్లను గుర్తు చెయ్యటం కోసం వివిధ రిమైండర్ అప్లికేషన్ల మీద ఆధారపడుతూ ఉంటాం. alertful కూడా ఒక రిమైండర్ వెబ్ అప్లికేషన్. ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా వివిధ ఈవెంట్లకు సంబంధించిన రిమైండర్లను ఈ మెయిల్ ద్వారా ఉచితంగా పొందవచ్చు. http://www.alertful.com/ సైట్ కి వెళ్ళి 'Get Started' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత అక్కడ వచ్చే వివిధ ఆప్షన్ల లో కావలసిన దానిపై క్లిక్ చెయ్యాలి.



రిమైండ్ చెయ్యవలసిన వివరాలు ఎంటర్ చేసి ’Submit' బటన్ పై క్లిక్ చేస్తే రిమైండర్ ఈ-మెయిల్ కి పంపబడుతుంది.



వెబ్‌సైట్: http://www.alertful.com/

ధన్యవాదాలు

Tuesday, November 2, 2010

ఫేస్‌బుక్ అప్లికేషన్ డెవలపర్లు యూజర్ డాటా అమ్ముకుంటున్నారా??

ప్రముఖ సోషల్ నెట్‌వర్క్ ఫేస్‌బుక్ అప్లికేషన్ డెవలపర్లు యూజర్ డాటా (UID) ని డాటా బ్రోకర్ల కు అమ్ముకుంటున్నట్లు సమాచారం. ఈ కారణంగానే వెబ్‌సైట్ పాలసీని అనుసరించి కొంతమంది అప్లికేషన్ డెవలపర్లను ఫేస్‌బుక్ బాన్ చేసింది. దీనికి సంబంధించి ఫేస్‌బుక్ బ్లాగ్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.



ఫేస్‌బుక్ యూజర్లకు ఈ విషయం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.

ఫేస్‌బుక్ బ్లాగ్ పోస్ట్ ని ఇక్కడ చూడండి

ధన్యవాదాలు

typingweb - ఆన్‌లైన్ టైపింగ్ ట్యూటర్!!!

typingweb - ఉచిత ఆన్‌లైన్ టైపింగ్ ట్యూటర్. దీనిలో Beginner Course, Intermediate Course, Advanced Course ఉన్నాయి. టైపింగ్ నేర్చుకోవాలనే వారికి ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది. సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవటం వలన టైపింగ్ ప్రోగ్రెస్ సైట్ లో సేవ్ చెయ్యబడుతుంది. టైప్ చేసేటప్పుడు wpm, accuracy మొదలగు వివరాలు తెలుసుకోవచ్చు.



వెబ్‍సైట్: typingweb

ధన్యవాదాలు

Monday, November 1, 2010

అక్టోబర్ 2010 లో చేసిన పోస్ట్ ల పీడీఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి!!!


October 2010

PDFUnlock - పీడీఎఫ్ ఫైళ్ళ పాస్‌వార్డ్ రిస్ట్రిక్షన్లను తొలగించటానికి...

టెక్స్ట్ కాపీ చేసుకోవటానికి, ప్రింట్ చెయ్యటానికి, మెర్జ్ చెయ్యటానికి వీలు లేకుండా పాస్‌వార్డ్ తో ప్రొటెక్ట్ చెయ్యబడిన పీడీఎఫ్ ఫైళ్ళ రిస్ట్రిక్షన్లను ఆన్‌లైన్ లో తొలగించటానికి http://www.pdfunlock.com/ అనే సైట్ ఉపయోగపడుతుంది. PDFUnlock సైట్ కి వెళ్ళి ’Choose File' బటన్ పై క్లిక్ చేసి రిస్ట్రిక్షన్లను తొలగించవలసిన పీడీఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత ’Unlock' బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే!!!




వెబ్‌సైట్: http://www.pdfunlock.com/

ధన్యవాదాలు