Edmodo - ఉపాధ్యాయులు మరియు విద్యార్ధుల కోసం సురక్షితమైన ఒక లెర్నింగ్ సోషల్ నెట్‌వర్క్!!! ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫేస్‌బుక్ లాంటిదే. Edmodo సైట్ కి వెళ్ళగానే రెండు బటన్లు కనిపిస్తాయి అవి “I’m a Student” మరియు “I’m a Teacher“. టీచర్లు “I’m a Teacher“ బటన్ పై క్లిక్ చేసి యూజర్ నేమ్, పాస్ వార్డ్ తదితర వివరాలు ఇచ్చి సైన్-అప్ చెయ్యాలి. తర్వాత Edmodo హోమ్ పేజీకి వెళతాము అది ఫేస్‌బుక్ ని పోలి ఉంటుంది. అక్కడ గ్రూప్స్ క్రియేట్ చేసుకోవాలి, దానికోసం ’Groups' దగ్గర వున్న ’Create' పై క్లిక్ చేసి Group Name, Grade (తరగతి), Subject Area వివరాలు ఎంటర్ చేసి ’Create' బటన్ పై క్లిక్ చెయ్యాలి. గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత గ్రూప్ పేరు తో పాటు గ్రూప్ యాక్సెస్ కోడ్ కూడా జెనెరేట్ అవుతుంది,అది విద్యార్ధులు జాయిన్ అవటానికి ఉపయోగపడుతుంది. ఇక టీచర్లు తమ మెసేజ్ ని టైప్ చేసి గ్రూప్ ని సెలెక్ట్ చేసుకొని ’Send' బటన్ పై క్లిక్ చేస్తే మెసేజ్ ఆ గ్రూప్ కి పంపబడుతుంది.
ఇక విద్యార్ధులు అయితే సైట్ ఎంటర్ అవగానే వచ్చే “I’m a Student” బటన్ పై క్లిక్ చేసి టీచర్ చే క్రియేట్ చెయ్యబడిన గ్రూప్ కోడ్ ఎంటర్ చేసి యూజర్ నేమ్, పాస్ వార్డ్ తదితర వివరాలతో సైన్-అప్ చెయ్యాలి. మరొక గ్రూప్ జాయిన్ అవటానికి 'Groups' దగ్గర ఉన్న ’Join' పై క్లిక్ చేసి గ్రూప్ కోడ్ యిచ్చి దానిలో జాయిన్ అవ్వవచ్చు. విద్యార్ది కూడా టీచర్ లాగే తమ నోట్ కావలసిన గ్రూప్ కి పంపవచ్చు.
క్యాలెండర్, గ్రేడ్స్ మరియు లైబ్రరీ లింక్స్ కూడా ఉన్నాయి. లైబ్రరీ లో మన స్వంత ఫైళ్ళను భద్రపరచుకోవచ్చు. సెట్టింగ్స్ లో మన వ్యక్తిగత సమాచారం మరియు ఫోటో ని పెట్టవచ్చు. ఫేస్ బుక్ లాగానే టీచర్స్ లేదా స్టూడెంట్స్ ని సెర్చ్ చేసే సదుపాయం కలదు.
వెబ్‌సైట్: http://www.edmodo.com/
ధన్యవాదాలు