Saturday, November 27, 2010

Keylogger Beater - కీలాగర్ల నుండి రక్షణ పొందటానికి!!! [ఫైర్‍ఫాక్స్ ప్లగిన్]

కీలాగర్లచే కీబోర్డ్ స్ట్రోక్స్ ని రికార్డ్ చెయ్యకుండా నిరోధించటానికి యాంటీ-కీలాగర్లు ఉపయోగపడతాయి. అటువంటిదే Keylogger Beater కాకపోతే ఇది ఫైర్‍ఫాక్స్ ప్లగిన్. ఇది అందించే వర్చువల్ కీబోర్డ్ ని ఉపయోగించి పాస్‍వార్డ్స్ టైప్ చెయ్యటం వలన కీలాగర్లు మన పాస్‍వార్డ్స్ ని దొంగిలించలేరు.

Keylogger Beater ఎలా పనిచేస్తుంది?

ముందుగా ఫైర్‍ఫాక్స్ యాడ్‍ఆన్స్ సైట్ నుండి Keylogger Beater ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. బ్రౌజర్ లో దీనిని యాక్టివేట్ చెయ్యటానికి [Ctrl]+[shift]+[k] కీ లను ప్రెస్ చెయ్యాలి లేదంటే మౌస్ రైట్ క్లిక్ చేసి కాంటెక్స్ట్ మెనూ ద్వారా Keylogger Beater ని యాక్టివేట్ చెయ్యవచ్చు.



ఇక బ్రౌజర్ లో టెక్స్ట్ బాక్స్ లో ఏదైనా టైప్ చేసేటప్పుడు వర్చువల్ కీబోర్డ్ పాప్-అప్ అవుతుంది, దానిని ఉపయోగించి ఇన్‍పుట్ ఇవ్వవచ్చు, వర్చువల్ కీబోర్డ్ అవసరం లేదనుకుంటే [Esc] కీ ప్రెస్ చెయ్యాలి.

ఇక వర్చువల్ కీబోర్డ్ లో రెండు రకాల కీస్ ఉంటాయి Real Keys మరియు Shadow keys. మన ఫిజికల్ కీ బోర్డ్ పై Shadow keys ప్రెస్ చేసినప్పుడు బ్రౌజర్ లో టెక్స్ట్ బాక్స్ లో Real Keys ఎంటర్ అవుతాయి. అంటే కీలాగర్లు Shadow keys మాత్రమే రికార్డ్ చేస్తాయి.




మౌస్ తో ఇన్‍ఫుట్ ఇస్తే కీలాగర్లు స్క్రీన్ షాట్స్ ని కాప్చర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్‍పుట్ కోసం ఫిజికల్ కీబోర్డ్ పై షాడో కీస్ ప్రెస్ చెయ్యటమే ఉత్తమం.

Keylogger Beater పై మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

డౌన్లోడ్: Keylogger Beater

ధన్యవాదాలు