Thursday, November 11, 2010

join.me - రిమోట్ స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్!!!

పీసీ ట్రబుల్ షూటింగ్ కోసం లేదా ప్రెజెంటేషన్స్ ఇవ్వటం కోసం మన పీసీ డెస్క్ టాప్ ని రిమోట్ లో యాక్సెస్ చెయ్యటానికి షేర్ చెయ్యవలసి వస్తుంది. ఎటువంటి స్క్రీన్ కాస్టింట్ సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ అవసరం లేకుండా join.me తో మీ పిసీ స్క్రీన్ ని ఇతరులతో చాలా సులభంగా షేర్ చేసుకోవచ్చు. దాని కోసం ముందుగా join.me సైట్ కి వెళ్ళి 'Start' పై క్లిక్ చేసి join.me executable ఫైల్ డౌన్లోడ్ చేసుకొని రన్ చెయ్యటమే (ఇనస్టలేషన్ అవసరం లేదు). ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మన స్క్రీన్ పై ఇక చిన్న విండో ఓపెన్ అవుతుంది, అక్కడ వున్న URL లింక్ ని కాపీ చేసుకొని మన స్క్రీన్ ఎవరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నామో వారికి పంపాలి.





అవతలి వాళ్ళు ఆ లింక్ ని ఏదైనా బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే వాళ్ళు మన పీసీ స్క్రీన్ పై జరిగే ప్రతీదానిని చూడగలరు కానీ మన పీసీ ని రిమోట్ లో ఆపరేట్ చెయ్యలేరు. అవసరం లేనప్పుడు స్క్రీన్ కాస్టింగ్ ని Pause లేదా డిసేబుల్ చెయ్యవచ్చు. ఈ అప్లికేషన్ లో స్క్రీన్ షేరింగ్ తో పాటు ఛాట్, కాన్ఫరెన్స్ సదుపాయం కూడా కలదు.

వెబ్ సైట్: join.me

ధన్యవాదాలు