Thursday, January 27, 2011

జీమెయిల్ క్రొత్త ఫీచర్: ఈ-మెయిల్ లేదా ఛాట్ కి సంబంధించిన క్రొత్త మెసేజ్ లు వచ్చినప్పుడు పాపప్ నోటిఫికేషన్ డెస్క్‌టాప్ పై వస్తుంది !!!


జీమెయిల్ లో మరొక క్రొత్త ఫీచర్ అదే ఈ-మెయిల్ లేదా ఛాట్ కి సంబంధించిన క్రొత్త మెసేజ్ లు వచ్చినప్పుడు పాపప్ నోటిఫికేషన్ డెస్క్‌టాప్ పై వస్తుంది. దానికోసం చెయ్యవలసిందల్లా మీ జీమెయిల్ లాగిన్ అవ్వగానే Click here to enable desktop notifications for Gmail అని వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే Allow mail.google.com to show desktop notifications? Allow Deny వస్తుంది, Allow పై క్లిక్ చెయ్యాలి.
లేదంటే కనుక ’Settings' పై క్లిక్ చేసి క్రిందకు వెళితే Desktop Notifications అని వస్తుంది, దాని దగ్గర ఉన్న ఆప్షన్లలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి.


మరింత సమాచారం కోసం జీమెయిల్ బ్లాగ్ చూడండి. ప్రస్తుతానికి ఈ ఫీచర్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో మాత్రమే పనిచేస్తుంది.

ధన్యవాదాలు