ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ చేసినప్పుడు అటాక్ సర్ఫేస్ లో జరిగిన మార్పులు తెలుసుకోవటానికి మైక్రోసాప్ట్ వారి Attack Surface Analyzer అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. ఒకసారి ఏదైనా సాప్ట్‌వేర్ డెవలప్ చేసి దానిని రిలీజ్ చేసేముందు అటాక్ సర్ఫేస్ లో జరిగే మార్పులు తెలుసుకోవటానికి ఐటీ డెవలపర్స్ మరియు టెస్టెర్స్ ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. Attack Surface Analyzer ఏదైనా సాప్ట్‌వేర్ ఇనస్టలేషన్ కి ముందు మరియు తరువాత రన్ చేసుకోవాలి అదెలాగో క్రింద చూద్దాం:
ముందుగా మైక్రోసాప్ట్ సైట్ కి వెళ్ళి Microsoft Attack Surface Analyze ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. Attack Surface Analyzer ని ఉపయోగించి సిస్టం ని స్కాన్ చెయ్యాలి. .CAB ఫార్మేట్ లో ఒక రిపోర్ట్ జెనెరేట్ అవుతుంది, ఈ ఫైల్ ని ఏదైనా 7ZIP లాంటి అన్ జిప్ సాప్ట్ వేర్లని ఉపయోగించి అన్ జిప్ చేస్తే XML ఫైల్ వస్తుంది. దీనిని ఏదైనా నోట్ పాడ్ ఎడిటర్ లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ చెయ్యవలసిన సాప్ట్ వేర్ ని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇప్పుడు Attack Surface Analyzer మరల రన్ చెయ్యాలి, ఇప్పుడు దీనిచే జెనెరేట్ చెయ్యబడే రిపోట్ సాప్ట్ వేర్ ఇనస్టలేషన్ కారణంగా అటక్ సర్ఫేస్ లో జరిగిన మార్పులను తెలియచేస్తుంది.
ఇప్పటి వరకు మైక్రోసాప్ట్ దీనిని తమ అంతర్గత అవసరాల కోసం ఉపయోగించింది, ఇప్పుడు అందరికోసం బీటా వెర్షన్ ని విడుదల చేసింది.
డౌన్లోడ్: Microsoft Attack Surface Analyzer
ధన్యవాదాలు