నిన్న సాయత్రం సడెన్ గా నా BSNL మొబైల్ పెనిచెయ్యలేదు కాల్స్ చేస్తుంటే పోవటం లేదు ఇన్ కమింగ్ కాల్స్ రావటంలేదు, నాకేనా ప్రాబ్లం అంటే BSNL వినియోగదారులందరిదీ అదే సమస్య. సరే రాత్రి ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి వార్తా ఛానల్ పెడితే క్రింద బ్రేకింగ్ న్యూస్ "నంబర్ పోర్టబిలిటీ కారణంగా ఎక్కువమంది మొబైల్ వినియోగదారులు BSNL కి మారటం తో సర్వర్లు హ్యాంగ్ అయ్యాయి" అని. ఒక్కసారి ఇదే జోక్ ఆఫ్ ద ఇయర్ అనుకున్నా, ఎందుకంటే నిన్న ఉదయం వరకు మొబైల్ రంగం లో రాష్ట్రం లో నాల్గో స్థానం లో ఉన్న BSNL కి ఒక్కసారిగా ఆదరణ పెరగడం ఆశ్చర్యం కలిగించింది. సరే సంగతేంటని BSNL లో పనిచేసే మిత్రుడికి ఫోన్ చేసి అడిగా నంబర్ పోర్టబిలిటీ తో BSNL కి మారే వినియోగదారులకు ఉచిత టాక్ టైమ్ ఇస్తున్నారంట. రాబోయే రోజుల్లో BSNL నంబర్ 1 కి వస్తుందంట.
మొబైల్ రంగం లో దాదాపు 5 సంవత్సరాలు లేటుగా వచ్చిన BSNL లేటెస్ట్ గా వస్తుందనుకుంటే నిరాశేపరచింది. ప్రభుత్వరంగ సంస్థ కావటంతో నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం కారణంగా ప్రైవేట్ సంస్థలతో పోటీ పడలేకపోతుంది. ఉదాహరణకి మా ఆఫీస్ లో సిగ్నల్ సరిగా రాదు, దాని గురించి వ్రాతపూర్వకంగా 6 నెలల క్రితం ఫిర్యాదు చేస్తే గతవారం మా ఆఫీస్ సందర్శించి సిగ్నల్ స్టెంగ్త్ చెక్ చేశారు, అంతే పరిష్కారం చెప్పలేదు.
సరే ఇదంతా వదిలేస్తే రాత్రి 10.30 కి తిరిగి ఫోన్లు పనిచెయ్యటం ప్రారంభించాయి. BSNL సిబ్బందికి ధన్యవాదాలు.


ధన్యవాదాలు