Monday, February 7, 2011

Mapfaire - కావలసిన ప్రదేశాలను మార్కు చేస్తూ స్వంతగా మ్యాప్ తయారుచేసుకోవటానికి!!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా (URL కోసం గూగుల్ ఎకౌంట్వాడుకోవచ్చు) Mapfaire సైట్ కి వెళ్ళి కావలసిన లొకేషన్ల పాయింట్లను యాడ్ చేస్తూ దానికి ఆ లొకేషన్ పేరు మరియు దానికి సంబంధించిన వివరాలను తెలియచేస్తూ ఒక స్వంత మ్యాప్ ని సులభంగా తయారుచేసుకోవచ్చు అంతేకాదు అలా తయారుచేసిన మ్యాప్ లను షేర్ కూడా చేసుకోవచ్చు. ఉదాహరణకి మీ ఆఫీసెస్ ఉన్న ప్రదేశాలను (బ్రాంచెస్) గుర్తిస్తూ మ్యాప్ లు తయారుచేసుకొని కస్టమర్లకు తెలియచెయ్యవచ్చు అలానే మీరు సందర్శించిన చారిత్రాత్మక ప్రదేశాలతో కూడా మ్యాప్ లు తయారుచేసుకొని బంధుమిత్రులతో పంచుకోవచ్చు.


Mapfaire తో స్వంత మ్యాప్ లు ఎలా తయారుచేసుకోవచ్చో ఈ క్రింది వీడియోలో చూడండి:


వెబ్ సైట్: Mapfaire

ఇటువంటివే మరికొన్ని టూల్స్ Targetmap, DirectionsMap, DearMap, Quickmaps, Wherables, MapMyRun,Route Planner, MapOf.it and RideTheCity
ధన్యవాదాలు