మొన్న ఈ మధ్య సుమారు ౧,౫౦,౦౦౦ జీమెయిల్ యూజర్ల ఇన్-బాక్స్, కాంటాక్ట్స్, ఎటాచ్మెంట్లు, ఛాట్ లాగ్స్ పోయాయంట. జీమెయిల్ వాటిని రికవర్ చేసే పనిలో నిమగ్నమైవుందంట. ఈ బాధలు లేకుండా అప్పుడప్పుడు జీమెయిల్ కూడా బ్యాక్-అప్ తీసుకుంటూ ఉండాలి.
జీమెయిల్ ని ఉచితంగా బ్యాక్-అప్ తీసుకోవటానికి థండర్ బర్డ్ అనే ఈ-మెయిల్ క్లైంట్ ఉపయోగపడుతుంది . థండర్
బర్డ్ ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం:
Mozilla Thunderbird 2.0.0.18 వుచిత ఈ మెయిల్ క్లైంట్లలలో వుత్తమమైనది, MS Outlook కి ప్రత్యామ్నాయంగా థండర్ బర్డ్ నే ఎక్కువగా వుపయోగిస్తారు. థండర్ బర్డ్ లో జీమెయిల్ కాన్ఫిగర్ చెయ్యటం చాలా సులువు. Mozilla Thunderbird 2.0.0.18 లో GMail ఎకౌంట్ ఎలా కాన్ఫిగర్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం.
1. ముందుగా జీమెయిల్ ఎకౌంట్ సైన్ ఇన్ చేసి, కుడి చేతి ప్రక్క పైన వున్న 'Settings' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత
'Settings'లో ’Forwarding and POP/IMAP' టాబ్ పై క్లిక్ చేసి ’IMAP Access' దగ్గర ’Enable IMAP' ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ’Save Changes' పై క్లిక్ చెయ్యాలి.
2.ఇప్పుడు Mozilla Thunderbird 2.0.0.18 ని http://www.mozilla.com/en-US/thunderbird/ నుండి డౌన్ లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి.
3.థండర్ బర్డ్ ని మొదటిసారి రన్ చేసినప్పుడు 'Outlook Express' లేదా ’MS Outlook' లో ఇంతకుముందే కాన్ఫిగర్ చెయ్యబడిన ఏదైనా ఈమెయిల్ ఎకౌంట్ వున్నట్లయితే దానిని థండర్ బర్డ్ కి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, లేకుంటే డైరక్ట్ గా స్టెప్ 5లో చూపబడిన ’Account Wizard' ఓపెన్ అవుతుంది.
4.పాత ఈమెయిల్ ఎకౌంట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత థండర్ బర్డ్ మెయిన్ మెనూ లో Tools ---> Account Settings పై క్లిక్ చెయ్యాలి. తర్వాత 'Account Settings' లో 'Add Account' పై క్లిక్ చెయ్యాలి.
5.ఇప్పుడు ఓపెన్ అయ్యిన ’Account Wizard' లో ’Gmail' ని సెలెక్ట్ చేసుకొని ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.
6.Identity లో Name మరియు Email Address ఎంటర్ చేసి ’Next' బటన్ పై క్లిక్ చెయ్యాలి.
7.ఇక్కడ ’Finish' బటపై క్లిక్ చెయ్యాలి. అంతే మీ జీమెయిల్ థండర్ బర్డ్ లో కాన్ఫిగర్ చెయ్యబడుతుంది.
థండర్ బర్డ్ లో అవుట్ లుక్ కన్నా బెటర్ ఫీచర్స్ వున్నాయి, ట్రై చెయ్యండి. ఇతర వివరాలకు థండర్ బర్డ్ సైట్ కి వెళ్ళండి.
మరికొన్ని Email Clients - Incredimail Xe 5.7.0, eM Client 1.1.3 BETA, Eudora 7.1, Pegasus Mail v4.41
ధన్యవాదాలు