Thursday, June 30, 2011

Google + - గూగుల్ నుండి క్రొత్త సోషల్ నెట్ వర్క్!!!



గూగుల్ నుండి వస్తున్న సోషల్ నెట్ వర్క్ ప్రాజెక్టే Google Plus project - Real-life sharing, rethought for the web.

Google Plus project ప్రత్యేకతలు:

+Circles: share what matters, with the people who matter most


+Sparks: strike up a conversation, about pretty much anything


+Hangouts: stop by and say hello, face-to-face-to-face



+Mobile: share what’s around, right now, without any hassle


+Huddle


సేకరణ: గూగుల్ బ్లాగ్ నుండి.

వెబ్ సైట్:Google Plus

ధన్యవాదాలు

Tuesday, June 28, 2011

Google Notebook - ఆన్‌లైన్ లో నోట్స్ తీసుకోవటానికి!!!

Google Notebook అనే వెబ్ సర్వీస్ లో నోట్స్ టైప్ చేసుకోవటానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా బుక్ మార్క్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నోట్ బుక్ మరియు బుక్ మార్క్స్ ని ఎక్స్ పోర్ట్ మరియు షేర్ కూడా చేసుకోవచ్చు. గూగుల్ అకౌంట్ కలిగిన వాళ్ళు ఇతర గూగుల్ సర్వీసెస్ లానే దీనిని కూడా ఉపయోగించవచ్చు.



Google Notebook లానే ఆన్ లైన్ లో నోట్స్ తీసుకోవటానికి ఇతర వెబ్ సర్వీసెస్: https://privnote.com/http://www.evernote.com/http://listhings.com/http://jjot.com/http://www.ubernote.com/http://penzu.com/http://www.notefish.com/http://www.mynoteit.com/http://www.memonic.com/ మొదలగునవి.

ధన్యవాదాలు

Friday, June 24, 2011

గూగుల్ ట్రాన్స్‌లేట్ లో ఇప్పుడు తెలుగు కూడా...

గూగుల్ ట్రాన్స్ లేట్ లో ఇంతకుముందు వరకు హిందీ మాత్రమే ఉండేది. ఇప్పుడు తెలుగుతో పాటు మరికొన్ని భారతీయ భాషలు కూడా వచ్చి చేరాయి. కావలసిన టెక్స్ట్ ని ఇతర భాష ల నుండి తెలుగులోకి అలాగే తెలుగు నుండి ఇతర భాషలలోకి అనువదించవచ్చు. అయితే అనువాదం మక్కీకి మక్కీగా ట్రూ ట్రాన్స్ లేషన్ ఉంటుంది, పదాలు అయితే పర్వాలేదు కానీ వాక్యాల అర్ధాలు అయితే మారిపోతూ ఉంటాయి, చూసుకోవాలి.


సైట్: Google Translate

Thursday, June 23, 2011

HomePipe - పీసీ లోకల్ హార్డ్ డిస్క్ ని క్లౌడ్ లో ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యటానికి!!!




మన ఫైల్స్ ని ఎక్కడి నుండైనా యాక్సెస్ చెయ్యటానికి ఆన్‍లైన్ స్టోరేజ్ సైట్ల పై అధారపడుతూ ఉంటాం ... అయితే ఇక్కడ అప్ లోడ్ చెయ్యబడిన ఫైళ్ళను మాత్రమే చూడగలం. క్లౌడ్ లో మన పీసీ హార్డ్ డిస్క్ ని యధాతధంగా యాక్సెస్ చెయ్యటానికి HomePipe Agent ఉపయోగపడుతుంది. ముందుగా Homepipe సైట్ కి వెళ్ళి మన ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేసి ’Get Started' పై క్లిక్ చెయ్యాలి. యాక్టివేషన్ లింక్ మన మెయిల్ కి పంపబడుతుంది, దానిపై క్లిక్ చేసి స్ట్రాంగ్ పాస్ వార్డ్ క్రియేట్ చేసుకోవాలి. మన మెయిల్ ఐడీ నే యూజర్ నేమ్. ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టం కి తగిన వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత HomePipe Agent సిస్టం ట్రేలో కనబడుతుంది, దానిపై క్లిక్ చేసి సైన్-ఇన్ చెయ్యాలి. అంతే ఇప్పుడు మన హార్డ్ డిస్క్ ని ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.


అయితే మన పీసీ స్లీప్ మోడ్ లోకి వెళ్ళకుండా HomePipe Preferences లో 'Prevent Computer from sleeping....' దగ్గర టిక్ పెట్టాలి. మన పీసీ ఎప్పుడూ పవర్ ఆన్ లో ఉండేలా చూడాలి.


మరిన్ని సెట్టింగ్స్ కోసం HomePipe Preferences కి వెళ్ళాలి. మన పీసీ ని క్లౌడ్ లో యాక్సెస్ చెయ్యటానికి HomePipe Agent సైట్ కి వెళ్ళి లాగిన్ చెయ్యాలి.

డౌన్లోడ్: HomePipe Agent

ధన్యవాదాలు

Wednesday, June 22, 2011

ఉబుంటు 10.10 యూజర్ మాన్యువల్ ఫ్రీ డౌన్లోడ్!!


ఉబుంటు ఆపరేటింగ్ సిస్టం నేర్చుకోవాలనుకొనే వాళ్ళు మరియు ట్రై చేద్దామనుకొనే వారికోసం 158 పేజీలు కలిగిన ఉబుంటు ౧౦.౧౦ యూజర్ గైడ్ ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన పీడీఎఫ్ ఫైల్ ఉబుంటు మాన్యువల్ సైట్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉబుంటు మాన్యువల్ లో ఇనస్టలేషన్, సాప్ట్ వేర్ మేనేజ్మెంట్, ట్రబుల్ షూటింగ్ మొదలగువాటికి సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి.

డౌన్లోడ్: Getting Started with Ubuntu 10.10

ధన్యవాదాలు

Tuesday, June 21, 2011

Excell Book - ఆఫీస్ లో ఫేస్‍బుక్ ఎవరికీ తెలియకుండా ఉపయోగించటానికి!!

ఆఫీస్ లో మనం ఫేస్‍బుక్ చూస్తున్నామని ఎవరికీ తెలియకుండా ఉండటానికి Excell Book అనే డెస్క్ టాప్ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. Excell Book చూడటానికి Excell Spread Sheet లా ఉంటుంది అయినప్పటికీ మనం ఫేస్‍బుక్ చేసే పనులన్నీ ఇక్కడ చెయ్యవచ్చు. అయితే ఫేస్‍బుక్ వాడుతున్నా చూసే వారికి మాత్రం Excell లో ఏదో పని చేస్తున్నామని అనుకుంటారు. Excell Book ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసిన తర్వాత ఫేస్ బుక్ అకౌంట్ తో లాగిన చెయ్యాలి. ఫేస్ బుక్ అకౌంట్ నుండి ఇన్ఫర్మేషన్ ని పుల్ చేసుకోవాలి.


ఇక ఫేస్ బుక్ లో లాగా వాల్, ఛాటింగ్ , న్యూస్ ఫీడ్, మెసేజెస్ చూడవచ్చు.


డౌన్లోడ్: Excell Book

ధన్యవాదాలు

Thursday, June 16, 2011

కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవటానికి యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్స్!


కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవటానికి యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్స్ లింకులను ఇక్కడ చూడండి:
    సేకరణ: మేక్ యూజ్ ఆఫ్ నుండి

    ధన్యవాదాలు

    Tuesday, June 14, 2011

    Qurify - QR కోడ్ జెనెరేటర్ / స్వంత కోడ్ తయారుచేసుకోవటానికి!!


    QR Code అంటే Quick Response code ఇది టూ డైమెన్షనల్ బార్ కోడ్ వీటిని QR బార్ కోడ్ రీడర్స్ తో కాని ఆధినిక మొబైల్ ఫోన్ల లోని కెమేరా సహాయంతో కాని ఈ QR Code లో దాగి ఉన్న సమాచారాన్ని తెలుసుకోవచ్చు. అది టెక్స్ట్ కావచ్చు లేదా URL లేదా మరే ఇతర సమాచారం అయినా కావచ్చు. QR Codes ని మనం బ్యాంక్ స్టేట్‌మెంట్స్ పై, బిజినెస్ కార్డ్స్ పై , మేగజైన్స్ మొ. వాటిపై చూడవచ్చు. వీటిని Android, Symbian ఆపరేటింగ్ సిస్టం కలిగిన మొబైల్ ఫోన్ల కెమెరా సహాయంతో చదవవచ్చు.


    What is a QR Code?

    QR Codes are 2 dimensional barcodes that are easily scanned using any modern mobile phone. This code will then be converted (called "dequrified") into a piece of (interactive) text and/or link. For instance, you walk around in the city and notice a poster for an event that seems interesting. You take out your mobile phone, scan the QR Code and will instantly get more information and a link to a website where you can book your tickets. You don't have to type or remember anything and because QR Codes can be very small, this saves a lot of space on the product as well.

    అయితే టెక్స్ట్ ని QR Code లోకి మార్చటానికి Qurify అనే సైట్ సహాయపడగలదు. సైట్ కి వెళ్ళి మెసేజ్ బాక్స్ లో గరిష్టంగా 255 అక్షరాల వరకు మెసేజ్ టైప్ చేసి క్రింద వున్న Qurify బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే QR Code జెనెరేట్ అవుతుంది. దీనిని మితృలకు పంపవచ్చు లేదా ఇమేజ్ ఫైల్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ కూడా చేసుకోవచ్చు.

    Website: Qurify

    ధన్యవాదాలు

    Monday, June 13, 2011

    మైక్రోసాప్ట్ డౌన్లోడ్ మేనేజర్ - సింపుల్ డౌన్లోడ్ మేనేజర్!!

    నెట్ నుండి ఫైళ్ళను డౌన్లోడ్ చెయ్యటానికి డౌన్లోడ్ మేనేజర్ల పై ఆధారపడుతూ ఉంటాం... నెట్ లో చాలానే ఉచిత డౌన్లోడ్ మేనేజర్లు దొరుకుతున్నాయి.. వాటిలాంటిదే మైక్రోసాప్ట్ డౌన్లోడ్ మేనేజర్ కూడా , కాకపోతే ఇది చాలా సింపుల్ మరియు లైట్ వెయిట్ డౌన్లోడ్ మేనేజర్ అని చెప్పవచ్చు. 


    డౌన్లోడ్: Microsoft Download Manager

    ధన్యవాదాలు

    Google ChromeBooks ఎలా ఉపయోగించాలి !!



    వెబ్ మాత్రమే చూడగలిగిన గూగుల్ క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం తో క్రోమ్ బుక్స్  ఇప్పుడు Amazon లో లభిస్తున్నాయి, samsung మరియు Acer వీటిని రూపొందించింది, Google ChromeBooks ప్రారంభ ధర $379.99. క్రోమ్ బుక్స్  లో క్లౌడ్ ఆధారిత అప్లికేషన్లను మాత్రమే ఉపయోగించగలం. లైట్ వెయిట్ మరియు స్లీక్ గా ఉన్నప్పటికీ  ఫెర్ఫామెన్స్ యావరేజ్ గానే ఉందని వివిధ రివ్యూలు చెపుతున్నాయి.

    Google ChromeBooks ని ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం:



    క్రోమ్ బుక్స్ పై రివ్యూలను ఇక్కడ చూడండి:

    ౧. ThisIsMyNext
    ౨. Gizmodo 
    ౩. LaptopMag
    ౪. InformationWeek
    ౫. Liliputing
    ౭. Engadget
    ౮. PCWorld

    క్రోమ్ బుక్స్ కొనటానికి మరియు వాటి ఫీచర్లు తెలుసుకొనటానికి Amazon సైట్ చూడండి.

    ధన్యవాదాలు

    Saturday, June 11, 2011

    హార్డ్‌డిస్క్ పనితీరుని తెలుసుకోవాలని ఉందా? [వీడియో]

    మన పీసీ లోని హార్డ్ డ్రైవ్ ఎలా పనిచేస్తుందా అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది, హార్డ్ డ్రైవ్ పనితీరుని తెలుసుకోవటానికి  Engineer Guy Bill Hammack రూపొందించిన Computer Hard Drive Teardown వీడియోని ఇక్కడ చూడండి.


     ఇలాంటివే మరిన్ని వీడియోల కోసం Engineer Guy సైట్ చూడండి.


    ధన్యవాదాలు

    Thursday, June 9, 2011

    ProduKey - పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్‍వేర్ల ప్రొడక్ట్ కీలను తెలుసుకోవటానికి!!

    మన పీసీ లో ఇనస్టలేషన్ చెయ్యబడిన సాప్ట్‍వేర్ల ప్రొడక్ట్ కీలను తెలుసుకోవటానికి ProduKey అనే ఉచిత సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. ProduKey జిప్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకొని అన్‍జిప్ చేసి ProduKey అనే exe ఫైల్ రన్ చేసి ఈ క్రింది చిత్రం లో చూపిన విధంగా మన పీసీ ఇనస్టలేషన్ చేసిన సాప్ట్ వేర్ల ప్రొడక్ట్ కీ లను తెలుసుకోవచ్చు.

    ProduKey is a small utility that displays the ProductID and the CD-Key of Microsoft Office (Microsoft Office 2003, Microsoft Office 2007), Windows (Including Windows 7 and Windows Vista), Exchange Server, and SQL Server installed on your computer. You can view this information for your current running operating system, or for another operating system/computer - by using command-line options. This utility can be useful if you lost the product key of your Windows/Office, and you want to reinstall it on your computer.


    డౌన్లోడ్: ProduKey

    ధన్యవాదాలు

    Tuesday, June 7, 2011

    సెల్‍ఫోన్ వాడటం వలన బ్రైన్ కాన్సర్ వస్తుందా?

    అవుననే అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO). సెల్‍ఫోన్ లు దీర్ఘకాలంగా వాడటం వలన వాటి నుండి విడుదలయ్యే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ వలన మెదడుకి glioma అనే కాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. International Agency for Research on Cancer (IARC) పరిశోధనలు చేసి చెప్పింది వారి మాటల్లోనే "We reached this conclusion based on a review of human evidence showing increased risk of glioma, a malignant type of brain cancer, in association with wireless phone use."

    దీనిపై మరిన్ని ఆర్టికల్స్ ని ఈ క్రింద లింకులలో చూడండి:
    ధన్యవాదాలు

    Sunday, June 5, 2011

    MySmartPrice.com - వివిధ ఉత్పత్తుల ధరలు తెలుసుకోవటానికి మరియు వాటి రివ్యూ కోసం!!

    MySmartPrice.com - సైట్ లో మొబైల్ ఫోన్స్, బుక్స్, కెమేరాలకు సంబంధించిన వివిధ బ్రాండ్ల ధరలు తెలుసుకోవచ్చు మరియు ఆన్‌లైన్ లో కొనాలనుకునే వారికి వివిధ ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ సైట్లలో రేట్లను కూడా తెలుసుకోవచ్చు.  అంతేకాకుండా ఆయా ప్రొడక్ట్ లకు సంబంధించిన  వీడియో రివ్యూలను కూడా చూడవచ్చు.    


    మొబైల్ ఫోన్స్ , డిజిటల్ కెమేరాలు కొనాలనుకునే వారికి  ఈ సైట్ బాగా ఉపయోగపడుతుంది.

    Website:  MySmartPrice.com

    ధన్యవాదాలు

    Saturday, June 4, 2011

    GeeMail - జీమెయిల్ ని ఆఫ్‌లైన్ లో చదవటానికి డెస్క్‌టాప్ క్లైంట్!!

    ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఆఫ్‌లైన్ లో మన జీమెయిల్ లోని మెయిల్స్ ని చదవటానికి GeeMail అనే ఎడోబ్ ఎయిర్ ఆధారిత డెస్క్‌టాప్ క్లైంట్ ఉపయోగపడుతుంది. పూర్తిగా జీమెయిల్ లాంటి ఇంటర్‌ఫేస్ కలిగి ఆన్‌లైన్ లో ఉన్న అనుభూతినే కలిగిస్తుంది. జీమెయిల్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఇక్కడ కూడా పనిచేస్తాయి. ఆఫ్‌లైన్ లో మెయిల్స్ ని చదవటంతో పాటు GeeMail నుండి రిప్లై కూడా పంపవచ్చు, నెట్ కనెక్ట్ అయినప్పుడు మెయిల్ ఆటోమాటిక్ గా పంపబడుతుంది. ఇతర ఈ-మెయిల్ క్లైంట్ల కు చేసినట్లు గా జీమెయిల్ లో POP and IMAP settings కాన్‌ఫిగర్ చెయ్యనవసరం లేదు.



    GeeMail ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా GeeMail సైట్ కి వెళ్ళి డెస్క్‌టాప్ క్లైంట్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. మొదటిసారి రన్ చెసినప్పుడు లాగిన్ స్క్రీన్ వస్తుంది అది అచ్చంగా జీమెయిల్ లాగిన్ పెజిని ని పోలి ఉంటుంది. యూజర్ నేం మరియు పాస్‌వార్డ్ ఎంతర్ చేసి సైన్ఇన్ చేసిన తర్వాత జీమెయిల్ కి కనెక్ట్ అయ్యి మెయిల్స్ లోడ్ చెయ్యబడతాయి.


    డౌన్లోడ్: GeeMail

    ధన్యవాదాలు

    వీడియోలను ఎలా షూట్ చెయ్యాలి? [వీడియో]

    How to Shoot Video That Doesn't Suck బుక్ రచయిత Steve Stockman అందిస్తున్న సింపుల్ వీడియో షూటింగ్ టిప్స్ ఇక్కడ చూద్దాం!!



    మరిన్ని చిట్కాల కోసం Steve's blog చూడండి.

    ధన్యవాదాలు

    Friday, June 3, 2011

    Amazon Cloud Drive - 5 GB ఉచిత ఆన్‍లైన్ స్టోరేజ్!


    వెబ్ సర్వర్లకు మన డాటా ని అప్‍లోడ్ చెయ్యటం వలన మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఆ డాటాని సులభంగా యాక్సెస్ చెయ్యవచ్చు. ఉచిత ఆన్‍లైన్ స్టోరేజ్ అందిస్తున్న అనేక సైట్ల గురించి గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు క్రొత్తగా Amazon తమ ఎకౌంట్ హోల్డర్ల కోసం Cloud Drive లో ఉచితంగా 5GB ఆన్‍లైన్ స్టోరేజ్ అందిస్తుంది. US యూజర్ల కోసం డాటా స్టోరేజ్ తో పాటు ఉచిత ఆన్‍లైన్ ఆడియో ప్లేయర్ ని కూడా అందిస్తుంది.

    Amazon Cloud Drive పై వీడియో ఇక్కడ చూడండి:



    వెబ్‍సైట్: Amazon Cloud Drive

    ధన్యవాదాలు

    JoyofTech - టెక్ కామిక్స్ కోసం ఒక సైట్!!



    కామిక్స్  ఆసక్తి కలవారు సాంకేతిక కామిక్స్ కోసం Joyoftech సైట్ చూడండి.

    వెబ్ సైట్: Joyoftech

    ధన్యవాదాలు

    Thursday, June 2, 2011

    విండోస్ 8 ఫస్ట్ లుక్!!

    మైక్రోసాప్ట్ నుండి రాబోతున్న క్రొత్త ఆపరేటింగ్ సిస్టం విండోస్ 8 ఫస్ట్ లుక్ ఇక్కడ చూద్దాం:



    విండోస్ ఫోన్ లాంటి ఇంటర్‍ఫేస్ కలిగిన విండోస్ 8 ఆపరేటింగ్ పై మరింత సమాచారం కోసం మైక్రోసాప్ట్ సైట్ చూడండి.

    ధన్యవాదాలు

    Winalite EMF Card - సెల్ ఫోన్ రేడియేషన్ (ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్) నుండి రక్షణ పొందటానికి!!!

    సైన్స్ మరియు టెక్నాలజీ అభివ్రుద్దితో ఎన్నో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అవి అందించే సౌకర్యం తో పాటు ఎంతో ప్రమాదకరమైన ఎలక్ట్రో మాగ్నటిక్ ఫీల్డ్స్ (EMF) ని విడుదల చేస్తాయి. అవి పర్యావరణాన్నే కాక మన ఆరోగ్యానికి చేటు చేస్తాయి. EMF ని విడుదల చేసే పరికరాలు computers, portable video games, mobile phones, portable music devices మొదలగునవి.

    EMF ల వలన కలిగే అనర్ధాలు:
    - Effect DNA
    - Cause headache, insomnia and depression
    - Effect visual acuity
    - Influence people’s well-being and biological responses
    - Create health concerns

    ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తులు తయారుచేసే WINALITE సంస్థ EMF Card ని రూపొందించింది. ఈ EMF Card ని ఉపయోగించి పైన చెప్పబడిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు విడుదల చేసే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ ని ఛేధించవచ్చు. EMF Card 50 సెం.మీ పరిధిలో వున్న మాగ్నెటిక్ వేవ్స్ ని తన లోకి తీసుకుని దాన్ని హీట్ ఎనర్ఝీ గా కన్వర్ట్ చేసి బయటకు విడుదల చేస్తుంది. EMF Card మన గుండెకు దగ్గరగా వుంచుకోవాలి అంటే మన షర్ట్ జేబు లో కాని, పర్స్ లో కాని పెట్టుకోవచ్చు. మొబైల్ ఫోన్ వినియోగదారులు ఈ EMF Card ని ఫోన్ వెనక భాగం లో అతికించుకోవచ్చు.


    EMF Card వలన కలిగే ప్రయోజనాలు:

    - Is designed to absorb and reduce electromagnetic fields (EMFs).
    - Has a lifespan of approximately 6 years; providing long term protection.
    - Is magnet-proof, waterproof, heat resistant and durable.
    - Has obtained National Patent Authority approval in China.

    సో ఎలక్ట్రానిక్ మాగ్నటిక్ ఫీల్డ్స్ నుండి మనల్ని మరియు మన కుటుంబాన్ని కాపాడటం లో మరియు సెల్ ఫోన్ లో ఎక్కువగా మాట్లాడే వారికి ఈ EMF Card బాగా ఉపయోగపడుతుంది.

    ఒక్కో EMF Card ధర కేవలం 499 రూపాయలు మాత్రమే, EMF Card మరియు దీని పై మరింత సమాచారం కోసం Shri Ch. Naga Manikanta Raj ని 9000905553 లో సంప్రదించండి.

    ధన్యవాదాలు

    Google Art Project - ప్రపంచం లోని ప్రముఖ చిత్రలేఖనాలు ఇక మీ ముందుకు!!

    ప్రపంచంలోని ప్రముఖ మ్యూజియం లలోని ఆర్ట్ గ్యాలరీలను గూగుల్ ఆర్ట్ ప్రాజెక్ట్ సైట్ లో వీక్షించవచ్చు. హై రిజొల్యూషన్ తో ఉన్న ఇక్కడి పెయింటింగ్స్ ని జూమ్ ఇన్/అవుట్ కూడా చేసి చూడవచ్చు. మనకు నచ్చిన పెయింటింగ్స్ తో స్వంత ఆర్ట్ కలెక్షన్ ను కూడా తయారుచేసుకోవచ్చు. పెయింటింగ్స్ పై ఆసక్తిగలవారికి ఈ సైట్ ఒక వరం లాంటిది.

    విసిటర్ గైడ్ ని ఇక్కడ చూడండి:



    వెబ్ సైట్: Google Art Project

    ధన్యవాదాలు

    Wednesday, June 1, 2011

    ఫోటోషాప్ లో యానిమేటెడ్ GIFs తయారుచెయ్యటం ఎలా? [ట్యుటోరియల్]

    ఫోటోషాప్ లో యానిమేటెడ్ GIFs తయారుచెయ్యటానికి ఫోటోషాప్ గురు Russell Brown రూపొందించిన వీడియో ట్యుటోరియల్ ఇక్కడ చూడండి:



    ఫోటోషాప్ పై Russell Brown మరిన్ని వీడియోలను Adobe TV లో చూడండి మరియు ఇక్కడ చూడండి.

    ధన్యవాదాలు

    schoolsparks - ప్రి-స్కూల్ మరియు కేజీ పిల్లలు మరియు పేరెంట్స్ కోసం ఒక మంచి సైట్!

    స్కూల్ కి వెళ్ళబోయే మరియు LKG, UKG చదివే పిల్లల తల్లిదండ్రులకు ఉపయోగపడే ఒక మంచి సైట్ schoolsparks. బేసిక్స్ పై పిల్లలో అవగాహన పెంచటానికి ఉపయోగపడే ఎన్నో టాపిక్స్ చిత్రాలతో ఈ సైట్ లో ఉన్నాయి మరియు ప్రింట్ చేసుకోవటానికి వీలుగా ఎన్నో వర్క్ షీట్స్ ఇక్కడ లభిస్తాయి. ప్రత్యేకమైన సందర్భాలలో పేరెంట్స్ పిల్లలతో ఎలా మెలగాలి అనే దానిపై కూడా ఇక్కడ ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ సైట్ లో ఎటువంటి రిజిస్ట్రేషన్ చెయ్యవలసిన అవసరం లేదు.


    మరింత సమాచారం కోసం schoolsparks సైట్ చూడండి.

    వెబ్ సైట్: schoolsparks

    ధన్యవాదాలు