ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు ఆఫ్‌లైన్ లో మన జీమెయిల్ లోని మెయిల్స్ ని చదవటానికి GeeMail అనే ఎడోబ్ ఎయిర్ ఆధారిత డెస్క్‌టాప్ క్లైంట్ ఉపయోగపడుతుంది. పూర్తిగా జీమెయిల్ లాంటి ఇంటర్‌ఫేస్ కలిగి ఆన్‌లైన్ లో ఉన్న అనుభూతినే కలిగిస్తుంది. జీమెయిల్ కీబోర్డ్ షార్ట్‌కట్స్ ఇక్కడ కూడా పనిచేస్తాయి. ఆఫ్‌లైన్ లో మెయిల్స్ ని చదవటంతో పాటు GeeMail నుండి రిప్లై కూడా పంపవచ్చు, నెట్ కనెక్ట్ అయినప్పుడు మెయిల్ ఆటోమాటిక్ గా పంపబడుతుంది. ఇతర ఈ-మెయిల్ క్లైంట్ల కు చేసినట్లు గా జీమెయిల్ లో POP and IMAP settings కాన్‌ఫిగర్ చెయ్యనవసరం లేదు.
GeeMail ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా GeeMail సైట్ కి వెళ్ళి డెస్క్‌టాప్ క్లైంట్ ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. మొదటిసారి రన్ చెసినప్పుడు లాగిన్ స్క్రీన్ వస్తుంది అది అచ్చంగా జీమెయిల్ లాగిన్ పెజిని ని పోలి ఉంటుంది. యూజర్ నేం మరియు పాస్‌వార్డ్ ఎంతర్ చేసి సైన్ఇన్ చేసిన తర్వాత జీమెయిల్ కి కనెక్ట్ అయ్యి మెయిల్స్ లోడ్ చెయ్యబడతాయి.
ధన్యవాదాలు