Thursday, June 23, 2011

HomePipe - పీసీ లోకల్ హార్డ్ డిస్క్ ని క్లౌడ్ లో ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యటానికి!!!




మన ఫైల్స్ ని ఎక్కడి నుండైనా యాక్సెస్ చెయ్యటానికి ఆన్‍లైన్ స్టోరేజ్ సైట్ల పై అధారపడుతూ ఉంటాం ... అయితే ఇక్కడ అప్ లోడ్ చెయ్యబడిన ఫైళ్ళను మాత్రమే చూడగలం. క్లౌడ్ లో మన పీసీ హార్డ్ డిస్క్ ని యధాతధంగా యాక్సెస్ చెయ్యటానికి HomePipe Agent ఉపయోగపడుతుంది. ముందుగా Homepipe సైట్ కి వెళ్ళి మన ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేసి ’Get Started' పై క్లిక్ చెయ్యాలి. యాక్టివేషన్ లింక్ మన మెయిల్ కి పంపబడుతుంది, దానిపై క్లిక్ చేసి స్ట్రాంగ్ పాస్ వార్డ్ క్రియేట్ చేసుకోవాలి. మన మెయిల్ ఐడీ నే యూజర్ నేమ్. ఇప్పుడు మన ఆపరేటింగ్ సిస్టం కి తగిన వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత HomePipe Agent సిస్టం ట్రేలో కనబడుతుంది, దానిపై క్లిక్ చేసి సైన్-ఇన్ చెయ్యాలి. అంతే ఇప్పుడు మన హార్డ్ డిస్క్ ని ఎక్కడనుండైనా యాక్సెస్ చెయ్యవచ్చు.


అయితే మన పీసీ స్లీప్ మోడ్ లోకి వెళ్ళకుండా HomePipe Preferences లో 'Prevent Computer from sleeping....' దగ్గర టిక్ పెట్టాలి. మన పీసీ ఎప్పుడూ పవర్ ఆన్ లో ఉండేలా చూడాలి.


మరిన్ని సెట్టింగ్స్ కోసం HomePipe Preferences కి వెళ్ళాలి. మన పీసీ ని క్లౌడ్ లో యాక్సెస్ చెయ్యటానికి HomePipe Agent సైట్ కి వెళ్ళి లాగిన్ చెయ్యాలి.

డౌన్లోడ్: HomePipe Agent

ధన్యవాదాలు