ఈనాడు దినపత్రిక లో ప్రతి సోమవారం చదువు పేజీలో విద్య, ఉద్యోగ సమాచారం మరియు వివిధ పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ ఉంటుంది. ఇప్పుడు ఈ ’చదువు’ పేజీ బ్లాగు కూడా ప్రారంభించారు.
’చదువు’ బ్లాగు పై ఆ టీమ్ మాటల్లోనే:
విద్యార్థులకూ, పాఠక మిత్రులకూ నమస్కారం!
తెలుగు ప్రజల జీవనాడిగా అత్యధిక సర్క్యులేషన్ తో పాఠకుల ఆదరణ పొందుతున్న ‘ఈనాడు’ పత్రిక ప్రతి సోమవారం ‘చదువు’ పేజీని వెలువరిస్తోంది.
విద్యార్థులకు అవసరమైన విలువైన సమాచారం ప్రామాణికంగా, సరళమైన భాషలో అందించి వారి అభ్యున్నతికి తోడ్పడటం చదువు పేజీ లక్ష్యం.
ఉన్నత విద్యావకాశాల సమాచారం, పోటీ పరీక్షలకు మార్గదర్శకత్వం, ఉద్యోగ సాధనకు అవసరమైన నైపుణ్యాల వివరాలను ‘చదువు’ పేజీ అందిస్తోంది.
విద్యావేత్తలూ, పోటీ పరీక్షల నిపుణులూ అందించే ప్రామాణిక సమాచారం మీకు ఇందులో లభిస్తుంది!
ఈ పేజీ పాఠక విద్యార్థులకు మరింతగా చేరువ అయ్యేందుకు ఇప్పుడు బ్లాగు రూపంలో ఇలా... అందుబాటులోకి వచ్చింది.
‘చదువు’ పేజీ లో ప్రచురించే అంశాలపై పాఠకులు తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఇదో చక్కటి వేదిక.
* ఈ పేజీలో ఏయే అంశాలు ఉండాలని కోరుకుంటున్నారో వ్యాఖ్యల రూపంలో తెలపవచ్చు.
* మీ వ్యాఖ్యలను ఇంగ్లిష్ లో కానీ, తెలుగులో కానీ రాయవచ్చు. http://lekhini.org/ సైట్ లో ఇంగ్లిష్ స్పెలింగ్స్ తో రాస్తే తెలుగు లిపిలోకి దానికదే మారుతుంది. దాన్ని Copy & Paste చేస్తే సరి!
* నచ్చిన, నచ్చని కథనాల గురించి చర్చించవచ్చు.
* ఈ పేజీని మెరుగుపరచటానికి సూచనలూ, సలహాలూ ఇవ్వవచ్చు.
చదువు పేజీ ఆన్ లైన్ ఎడిషన్ లింకు ఇది-
ప్రయోజనకర సమాచారాన్నీ, కథనాలనూ అందించేందుకు మీ నుంచి ఉత్సాహపూరితమైన సహకారం ఆశిస్తూ...
- ‘చదువు’ పేజీ టీమ్
బ్లాగ్: చదువు