Monday, September 5, 2011

Open Freely - వందకు పైగా వివిధ ఫార్మేట్లలో ఉన్న ఫైళ్ళను ఓపెన్ చెయ్యటానికి!!!

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు



ఏదైనా ఫైల్ ని మన పీసీ లో ఓపెన్ చేసి చూడటానికి దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మన పీసీ ముందుగానే ఇనస్టలేషన్ చెయ్యబడి ఉండాలి. అలా కాకుండా Open Freely అనే యూనివర్సల్ ఫైల్ ఓపెనర్ ని ఉపయోగించి వందకు పైగా వివిధ ఫైల్ టైప్ లను ఓపెన్ చేసి చూడవచ్చు మరియు ప్రింట్ కూడా చేసుకోవచ్చు. అదే  మైక్రోసాప్ట్ ఆఫీస్ ఫైల్స్ అయితే కనుక ఎడిట్ కూడా చేసుకొనే సదుపాయం కలదు. 


Open Freely తో డాక్యుమెంట్స్, ఆడియో/వీడియో, ఇమేజెస్, కంప్రెషన్ మొదలగు వాటికి సంబంధిన వివిధ ఫైల్ ఫార్మేట్లను ఓపెన్ చెయ్యవచ్చు, పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ చూడండి. 

ఇటువంటివే ఇతర సాప్ట్ వేర్లు : Universal Viewer, Free OPener 

డౌన్లోడ్:  Open Freely

ధన్యవాదాలు