Thursday, February 9, 2012

జీమెయిల్ మరియు ఇతర గూగుల్ డాటా ని డౌన్లోడ్ చేసుకోవటం ఎలా?

మన డాక్యుమెంట్లు, ఫోటోలు, కాంటాక్ట్స్ , మెయిల్స్ మరియు ఇతర సమాచారం ఎక్కువగా ఆన్ లైన్ లోనే స్టోర్ చేస్తూ ఉంటాం.  ఒక్కసారి ఆ సర్వర్లు డౌన్ అయితే మన పరిస్థితి ఏమిటి? ఈ రోజు ఉచితం రేపు పెయిడ్ ఐతే ఏం చెయ్యాలి?  యూఎస్ ప్రభుత్వం మెగాఅప్ లోడ్ ని సీజ్ చేసినప్పుడు మెగా అప్ లోడ్ సర్వర్లలోని డాటా ని చాలా మంది కోల్పోయారు. గూగుల్ ప్రైవసీ పాలసీ మరియు అమెరికా SOPA/PIPA చట్టాలు... మన డాటా ని మనమే జాగ్రత్త చేసుకోవటం మన బాధ్యత అని తెలియచేస్తున్నాయి. 


అయితే జీమెయిల్ మరియు ఇతర గూగుల్ అకౌంట్లలో ఉన్న మన డాటాని డౌన్లోడ్ చేసుకోవటానికి Google Takeout అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. దీని గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ చూడండి. 


అలానే Mozilla Thunderbird అనే ఈ- మెయిల్ క్లైంట్  సహాయంతో మన జీమెయిల్ ని మన పీసీ లోనే పొందవచ్చు. దీని  గురించి గతం లో చేసిన పోస్ట్ ఇక్కడ చూడండి. 

ధన్యవాదాలు