Tuesday, February 28, 2012

గూగుల్ ప్రైవసీ పాలసీ మలులోకి రాకముందే గూగుల్ సెర్చ్ హిస్టరీని తొలగించండి!!

మార్చి 1 నుండి గూగుల్ ప్రైవసీ పాలసీ అమలులోకి రానుంది. పాలసీ ని ఇప్పటికే చదివి ఉంటే ఓకే లేకుంటే దానిని ఇక్కడ ఒకసారి చదవండి.  గూగుల్ ప్రోడక్ట్స్ లో మనం సెర్చ్ లు మరియు సందర్శించిన వెబ్ సైట్ల వివరాలు గూగుల్ వెబ్ హిస్టరీ లో ఉంటాయి. మార్ఛి ౧ తర్వాత ఆ వివరాలను గూగుల్ సేకరించే అవకాశం ఉంది. దీంతో ఒక్కొక్కసారి మన వ్యక్తిగత సమాచారం కూడా గూగుల్ కి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి, అర్జెంట్ గా గూగుల్ వెబ్ హిస్టరీ లోని క్లియర్ చెయ్యాలి మరియు Web History is on దగ్గర Pause ని క్లిక్ చెయ్యాలి. 

Google Web History ని ఎలా తొలగించాలో ఇక్కడ చూద్దాం:

1. Sign into your Google account(లేదంటే  డైరెక్ట్ గా https://www.google.com/history కి కూడా వెళ్ళి సైన్-ఇన్ చెయ్యవచ్చు).
2. Go to https://www.google.com/history
3. Click "remove all Web History."
4. Click "ok."
ధన్యవాదాలు