ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా మనకు నచ్చిన సైజ్ లో కావలసిన విధంగా ఐడీ కార్డ్ లు/బిజినెస్ కార్డ్స్ ఉచితంగా తయారుచేసుకొని ప్రింట్ తీసుకోవటానికి Makebadge అనే వెబ్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ముందుగా ఈ సైట్ కి వెళ్ళి బాడ్జ్ టైప్, సైజ్, టెంప్లేట్ ని వాటిపై క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి.
Text పై క్లిక్ చేస్తే బాడ్జ్ లో టెక్స్ట్ బాక్స్ వస్తుంది, దానిపై మౌస్ డబల్ క్లిక్ చేసి దానిలో కావలసిన టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. image పై క్లిక్ చేసి ఇమేజ్ ని యాడ్ చేసుకోవచ్చు, దాని కోసం ఇమేజ్ బాక్స్ ప క్లిక్ చేసి ప్రక్కన ఉన్న Upload బటన్ పై క్లిక్ చేసి కావలసిన ఫోటో అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా తయారుచేసుకొన్న బాడ్జ్ ని పీసీ లో సేవ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ గా ప్రింట్ చేసుకోవచ్చు.
ధన్యవాదాలు