Thursday, April 15, 2010

Microsoft SharedView - ఉచిత స్క్రీన్ షేరింగ్ సాప్ట్ వేర్

TeamViewer లా Microsoft SharedView ని ఉపయోగించి స్నేహితుల లేదా కొలోగ్స్ తో డాక్యుమెంట్లు మరియు స్క్రీన్ వ్యూ లను వేగంగా మరియు సులభంగా ఎప్పుడైనా ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు షేర్ చేసుకోవటమే కాదు మీ ఫ్రెండ్స్ కంప్యూటర్లలో ప్రాబ్లమ్స్ ఏమైనా వుంటే ఫిక్స్ చెయ్యవచ్చు. అయితే Microsoft SharedView సాప్ట్ వేర్ మీ మరియు మీ మిత్రుల కంప్యూటర్ల లో కూడా ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇనస్టలేషన్ అయిన తర్వాత అప్లికేషన్ ని ఓపెన్ చేసి Windows Live ID తో Sign in చెయ్యాలి లైవ్ ఐడి లేకుంటే క్రియేట్ చేసుకోవచ్చు.



join a session పై క్లిక్ చేసి ఇతరులు మనల్ని గుర్తించటం కోసం నిక్ నేమ్ లేదా ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చెయ్యాలి. ఇప్పుడు వేరువేరు లొకేషన్లలో వున్న వారిని invite చెయ్యటం కోసం Start new session పై క్లిక్ చెయ్యగా వచ్చే Invitation Instructions ని మెయిల్ ద్వారా ఫ్రెండ్స్ కి పంపాలి.


అవతలి వాళ్ళు మెయిల్ లో వచ్చిన లింక్ పై క్లిక్ చేస్తే SharedView లాంచ్ అవుతుంది. ముందే చెప్పినట్లుగా SharedView అవతలి వారి కంప్యూటర్ లో కూడా ఇనస్టలేషన్ చెయ్యబడి వుండాలి. SharedView తో దాదాపు 15 మంది వరకు invite చెయ్యవచ్చు

Microsoft SharedView ఫీచర్లు:
  • It is a free screen sharing application from Microsoft.
  • It lets you connect up to 15 people wherever they are located in the world.
  • It helps you share documents with different people on real-time basis.
  • It has a very easy-to-use interface and you will not require any assistance to access all its features.
  • The chat feature of the application lets you communicate with session participants.
  • It is a completely safe application and is free from bugs, malware and spyware.
  • The Personal Mouse Pointers feature will make available separate mouse pointers to the session participants.
  • It can be used separately from your Windows Live Instant Messenger by accessing SharedView from the Activities menu.


Microsoft SharedView డౌన్లోడ్ మరియు పూర్తి సమాచారం కోసం మైక్రోసాప్ట్ సైట్ చూడండి.

ధన్యవాదాలు

Friday, April 9, 2010

Dmailer Backup - ఉచిత ఆన్ లైన్ డాటా బ్యాక్ అప్

Dropbox ప్రముఖ ఆన్ లైన్ ఫైల్ హోస్టింగ్ సైట్, Dropbox లో ఉచితంగా 2GB వరకు ఆన్ లైన్ డాటా బ్యాక్ అప్ తీసుకోవచ్చు. Dropbox కి చక్కని ప్రత్యామ్నాయమే Dmailer Backup. దీనిలో కూడా ఉచితంగా 2GB వరకు ఆన్ లైన్ డాటా బ్యాక్ అప్ తీసుకోవచ్చు. ముందుగా Dmailer సైట్ కి వెళ్ళి Dmailer Backup అప్ప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఆన్ లైన్ బ్యాక్ అప్ కోసం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అప్లికేషన్ ని ఓపెన్ చేసి మెయిన్ మెనూ లో ’Settings' కి వెళ్ళి ఆన్ లైన్ లో బ్యాక్ అప్ తీసుకోవలసిన ఫైల్స్ లేదా ఫోల్డర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.



Dmailer Backup ఫీచర్లు:

  • Live Backup: Continuously and automatically back up your files
  • Versioning: Maintain several versions of a file at once
  • Multiple profiles: Manage multiple profiles, maintain log files & view backup summaries
  • Security: Password protected and AES 128-bit encrypted
  • Contextual help: Access to application features guide
  • Simplicity: Restore your data in one single click

Dmailer ని ఉపయోగించే విధానం మరియు యూజర్ గైడ్ కోసం Dmailer సైట్ ని చూడండి.

ధన్యవాదాలు

Monday, April 5, 2010

WinPenPack - USB డ్రైవ్ ల కోసం ఊచిత పోర్టబుల్ అప్లికేషన్ల సమాహారం

USB డ్రైవ్ లలో పోర్టబుల్ అప్లికేషన్లను లోడ్ చేసుకొని మనతో పాటు తీసుకొని వెళితే ఎప్పుడైనా ఏదైనా కంప్యూటర్ పై పనిచేసేటప్పుడు కావలసిన ప్రోగ్రామ్స్ లేకుంటే కనుక మనదగ్గర వున్న పోర్టబుల్ అప్లికేషన్లతో పని చేసుకోవచ్చు. అది సిస్టం ట్రబుల్ షూటింగ్ అయినా కావచ్చు. USB డ్రైవ్ ల కోసం ఇంటర్నెట్ లో చాలానే ఉచిత అప్లికేషన్ల ప్యాకేజెస్ లభిస్తున్నాయి వాటిలో ఒకటే WinPenPack (ప్రోగ్రామ్ లాంచర్) . ఇది 2GB USB (పెన్) డ్రైవ్ లలో కూడా ఫిట్ అవుతుంది. WinPenPack లోని అప్లికేషన్లను సిస్టం లో ఇనస్టలేషన్ చెయ్యకుండానే నేరుగా USB డ్రైవ్ నుండి ఉపయోగించవచ్చు. WinPenPack లో వెబ్ బ్రౌజర్లు, ఈ-మెయిల్ క్లైంట్లు,ఇమేజ్ ఎడిటర్లు, ఛాట్ క్లైంట్లు, పిసి సెక్యూరిటీ అండ్ మెయింటెనెన్స్ టుల్స్, ఓపెన్ ఆఫీస్, ఫీడీఎఫ్ రీడర్లు యిలా చాలానే అప్లికేషన్లు ఉన్నాయి.



డౌన్లోడ్: WinPenPack

ధన్యవాదాలు

Thursday, March 25, 2010

ఇతరులు మన మెయిల్ ఎకౌంట్ ఉపయోగిస్తుంటే జీ-మెయిల్ వార్నింగ్ మెసేజ్ యిస్తుంది...

జీమెయిల్ క్రొత్త ఫీచర్ ని లాంచ్ చేసింది అదేమిటంటే ఎవరైనా మన ఈ-మెయిల్ ఎకౌంట్ అనుమానాస్పదంగా ఉపయోగిస్తున్నారు అనిఅనుకొంటే కనుక మనం ఎకౌంట్ యాక్సెస్ చేసినప్పుడు ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా హెచ్చరిస్తుంది.



వార్నింగ్ మెసేజ్ ప్రక్కన వున్న ’Show details' పై క్లిక్ చేసి నప్పుడు యాక్టివిటీ విండోలో మోస్ట్ రీసెంట్ యాక్సెస్ పాయింట్స్ ని లొకేషన్( దేశం), ఐపీ అడ్రస్, డేట్ / టైమ్ తదితర వివరాలు చూపిస్తుంది.



మీకు అనుమానంగా వుంటే అక్కడే పాస్ వార్డ్ మార్చుకోవచ్చు లేదా మీరే మీ ఎకౌంట్ వివిధ ప్రదేశాల నుండి యాక్సెస్ చేస్తే కనుక "Dismiss" పై క్లిక్ చేసి మెసేజ్ తొలగించవచ్చు.

మరింత సమాచారం కోసం జీమెయిల్ అఫీషియల్ బ్లాగ్ ని చూడండి.

ధన్యవాదాలు

Wednesday, March 24, 2010

ZeuAPP - 82 పైగా ఓపెన్ సోర్స్ విండోస్ యుటిలిటీస్ అన్నీ ఒకే చోట!!!

క్రొత్త కంప్యూటర్ కొన్నప్పుడు లేదా ఉన్న కంప్యూటర్ ఫార్మేట్ చేసినప్పుడు మనకవసరమయ్యే ఉచిత అప్లికేషన్లను ఇనస్టలేషన్ చెయ్యాలంటే కనుక దానిని వెతికి పలానా సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకొంటాం. అలాకాకుండా ప్రతీ అవసరానికి ఉపయోగపడే సాప్ట్ వేర్లు అన్నీ ఒకే చోట దొరికితే హ్యాపీ కదా!!!. ZeuAPP అనే పోర్టబుల్ టూల్ లో విండోస్ కోసం 80 పైగా ఉచిత అప్లికేషన్లు డౌన్లోడ్ కి సిద్ధంగా వున్నాయి. Archivers, Audio, Video, Chat-IM, Internet, CD Burners, P2P-File sharing, Games, Graphic, Secutity, Utility యిలా వివిధ క్యాటగిరీల్లో ఉచిత సాప్ట్ వేర్లను ఉంచారు. కావలసిన టాబ్ కి వెళ్ళి కావలసిన అప్లికేషన్ దగ్గర డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. చూశారా ! ఒకే ఒక క్లిక్ తో డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.



మరిన్ని వివరాలకు ZeuAPP సైట్ చూడండి.

డౌన్లోడ్: ZeuAPP

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.

ధన్యవాదాలు

Tuesday, March 23, 2010

ClipGrab - డెస్క్ టాప్ వీడియో డౌన్లోడర్

YouTube.com, MyVideo.de, DailyMotion.com, Vimeo.com, MySpass.de మొదలగు సైట్ల నుండి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటానికి ClipGrab అనే ఉచిత వీడియో డౌన్లోడింగ్ సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించటం చాలా సులువు. ClipGrab ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. మనం పైన చెప్పిన ఏదైనా సైట్ కి వెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు, వీడియో డౌన్లోడబుల్ అయితే కనుక సిస్టం ట్రే లో కూర్చున్న ఈ అప్లికేషన్ ఆటోమాటిక్ గా నోటిఫై చేస్తుంది, ఇక ఒకేఒక క్లిక్ తో దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక బ్రౌజర్ నుండి డౌన్లోడ్ చెయ్యవలసిన వీడియో లింకు ని కాపీచేసి ClipGrab అప్లికేషన్ ని ఓపెన్ చేసి క్రింది చిత్రంలో చూపిన విధంగా ’Please enter the link to video ....' క్రిందవున్న బాక్స్ లో పేస్ట్ చెయ్యాలి. తర్వాత Format మరియు Quality సెలెక్ట్ చేసుకొని ’Grab this clip!' పై క్లిక్ చెయ్యాలి. ’Settings'టాబ్ లో సెలెక్ట్ కొన్న ఫోల్డర్ లోకి వీడియో ఫైల్ డౌన్లోడ్ చెయ్యబడుతుంది.
డౌన్లోడ్: ClipGrab

ధన్యవాదాలు

Friday, March 19, 2010

Disk Space Fan - న్యూ స్టైల్ డిస్క్ స్పేస్ ఎనలైజర్

విండోస్ లో హార్డ్ డిస్క్ స్పేస్ ని ఎనాలిసిస్ చెయ్యటానికి Disk Space Fan అనే ఉచిత టూల్ ఉపయోగపడుతుంది. Disk Space Fan డిస్క్ లో ఫోల్డర్లు మరియు వాటిలోని ఫైళ్ళు ఎంత స్పేస్ ఆక్యుపై చేశాయో చక్కని గ్రాఫ్ రూపంలో చూపిస్తుంది. దీంతో ఏ ఫైల్ లేదా ఫోల్డర్ ఎక్కువ స్పేస్ ఆక్రమించాయి మరియు అనవసరమైన ఫోల్డర్లు లేదా ఫైళ్ళను తొలగించుకోవచ్చు. Disk Space Fan ని విండోస్ ఎక్స్ ప్లోరర్ తో ఇంటిగ్రేట్ చెయ్యవచ్చు.



ఫీచర్లు:
౧. Fantastic visualization
Disk visualization, fantastic animation, to manage disk space is not a dull work at all.
౨. Finding useless files easily
Folders and files are sorted by their size. You can catch "bad guys" easily.
౩. Integrated with Windows Explorer
Browse, open, and delete, all are same as explorer. Get file details quickly.

డౌన్లోడ్: Disk Space Fan

ధన్యవాదాలు