Thursday, March 25, 2010

ఇతరులు మన మెయిల్ ఎకౌంట్ ఉపయోగిస్తుంటే జీ-మెయిల్ వార్నింగ్ మెసేజ్ యిస్తుంది...

జీమెయిల్ క్రొత్త ఫీచర్ ని లాంచ్ చేసింది అదేమిటంటే ఎవరైనా మన ఈ-మెయిల్ ఎకౌంట్ అనుమానాస్పదంగా ఉపయోగిస్తున్నారు అనిఅనుకొంటే కనుక మనం ఎకౌంట్ యాక్సెస్ చేసినప్పుడు ఈ క్రింది చిత్రంలో చూపిన విధంగా హెచ్చరిస్తుంది.



వార్నింగ్ మెసేజ్ ప్రక్కన వున్న ’Show details' పై క్లిక్ చేసి నప్పుడు యాక్టివిటీ విండోలో మోస్ట్ రీసెంట్ యాక్సెస్ పాయింట్స్ ని లొకేషన్( దేశం), ఐపీ అడ్రస్, డేట్ / టైమ్ తదితర వివరాలు చూపిస్తుంది.



మీకు అనుమానంగా వుంటే అక్కడే పాస్ వార్డ్ మార్చుకోవచ్చు లేదా మీరే మీ ఎకౌంట్ వివిధ ప్రదేశాల నుండి యాక్సెస్ చేస్తే కనుక "Dismiss" పై క్లిక్ చేసి మెసేజ్ తొలగించవచ్చు.

మరింత సమాచారం కోసం జీమెయిల్ అఫీషియల్ బ్లాగ్ ని చూడండి.

ధన్యవాదాలు