YouTube.com, MyVideo.de, DailyMotion.com, Vimeo.com, MySpass.de మొదలగు సైట్ల నుండి వీడియోలను డౌన్లోడ్ చేసుకోవటానికి ClipGrab అనే ఉచిత వీడియో డౌన్లోడింగ్ సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించటం చాలా సులువు. ClipGrab ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి. మనం పైన చెప్పిన ఏదైనా సైట్ కి వెళ్ళి వీడియో చూస్తున్నప్పుడు, వీడియో డౌన్లోడబుల్ అయితే కనుక సిస్టం ట్రే లో కూర్చున్న ఈ అప్లికేషన్ ఆటోమాటిక్ గా నోటిఫై చేస్తుంది, ఇక ఒకేఒక క్లిక్ తో దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక బ్రౌజర్ నుండి డౌన్లోడ్ చెయ్యవలసిన వీడియో లింకు ని కాపీచేసి ClipGrab అప్లికేషన్ ని ఓపెన్ చేసి క్రింది చిత్రంలో చూపిన విధంగా ’Please enter the link to video ....' క్రిందవున్న బాక్స్ లో పేస్ట్ చెయ్యాలి. తర్వాత Format మరియు Quality సెలెక్ట్ చేసుకొని ’Grab this clip!' పై క్లిక్ చెయ్యాలి. ’Settings'టాబ్ లో సెలెక్ట్ కొన్న ఫోల్డర్ లోకి వీడియో ఫైల్ డౌన్లోడ్ చెయ్యబడుతుంది.
డౌన్లోడ్: ClipGrab ధన్యవాదాలు