క్రొత్త కంప్యూటర్ కొన్నప్పుడు లేదా ఉన్న కంప్యూటర్ ఫార్మేట్ చేసినప్పుడు మనకవసరమయ్యే ఉచిత అప్లికేషన్లను ఇనస్టలేషన్ చెయ్యాలంటే కనుక దానిని వెతికి పలానా సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకొంటాం. అలాకాకుండా ప్రతీ అవసరానికి ఉపయోగపడే సాప్ట్ వేర్లు అన్నీ ఒకే చోట దొరికితే హ్యాపీ కదా!!!. ZeuAPP అనే పోర్టబుల్ టూల్ లో విండోస్ కోసం 80 పైగా ఉచిత అప్లికేషన్లు డౌన్లోడ్ కి సిద్ధంగా వున్నాయి. Archivers, Audio, Video, Chat-IM, Internet, CD Burners, P2P-File sharing, Games, Graphic, Secutity, Utility యిలా వివిధ క్యాటగిరీల్లో ఉచిత సాప్ట్ వేర్లను ఉంచారు. కావలసిన టాబ్ కి వెళ్ళి కావలసిన అప్లికేషన్ దగ్గర డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. చూశారా ! ఒకే ఒక క్లిక్ తో డౌన్లోడ్ మరియు ఇనస్టలేషన్ చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు ZeuAPP సైట్ చూడండి.
డౌన్లోడ్: ZeuAPP
అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
ధన్యవాదాలు