Thursday, March 14, 2013

హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటానికి...[గూగుల్ క్రొత్త ప్రోగ్రామ్]

 తరచూ  పలానా వెబ్ సైట్ హ్యాక్ చెయ్యబడిందని వింటూ ఉంటాం... సెక్యూరిటీ తక్కువగా ఉన్న వెబ్ సైట్లను హ్యాకర్లు సులభంగా చేస్తూ ఉంటారు...  అలా హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటానికి గూగుల్ ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది అదే  Help for hacked sites . అది హ్యాక్ చెయ్యబడిన వెబ్ సైట్లను రికవర్ చెయ్యటం లో సహాయపడగలదు.


వెబ్ సైట్ ని రికవర్ చేసుకోవటానికి సైట్ ఓనర్ల కోసం వ్యాసాలు మరియు విడియోలను గూగుల్ రూపొందించింది, మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

హ్యాక్ అయిన తర్వాత రికవర్ చేసుకోవటానికే కాకుండా అసలు హ్యాక్ కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా గూగుల్ తెలియ చేస్తుంది. ధన్యవాదాలు

Tuesday, January 1, 2013

hellofax నుండి ఎక్కడికైనా ఉచితంగా ఫాక్స్ పంపండి!!!

****

మితృలకు ... ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..

****
hellofax అనే వెబ్ సైట్ నుండి ప్రపంచం లో ఎక్కడికైనా నెలకు పరిమిత సంఖ్యలో (50 పేజీలు) ఉచితంగా ఫాక్స్ పంపవచ్చు. హెలోఫాక్స్ సైట్ కి వెళ్ళి గూగుల్ అకౌంట్ లేదా మైక్రోసాప్ట్ అకౌంట్ తో లాగిన్ అయ్యి లేదంటే కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ముందుగా ఫాక్స్ పంపవలసిన ఫైల్ ని అప్ లోడ్ చేసుకోవాలి, తర్వాత ఫాక్స్ నంబర్ ఆయా దేశాలా కోడ్ తో సహా ఎంటర్ చెయ్యాలి, తర్వాత 'Send it Now' బటన్ పై క్లిక్ చెయ్యాలి. వర్డ్ డాక్యుమెంట్స్ , పీడీఎఫ్ పైల్స్, ఇమేజెస్, టెక్స్ట్ పైల్ ఇలా వివిధ ఫార్మేట్లలో ఉన్న ఫైళ్లను హెలోఫాక్స్  ద్వారా పంపవచ్చు. అంతేకాకుండా క్లౌడ్ స్టోరేజ్ లనుండి కూడా ఫైళ్ళను తీసుకోవచ్చు. 



వెబ్ సైట్: hellofax

ధన్యవాదాలు

Wednesday, October 17, 2012

Road To Grammar - ఇంగ్లీష్ గ్రామర్ స్కిల్స్ మెరుగుపర్చుకోవటానికి ఒక మంచి సైట్!!

ఇంగ్లీష్ గ్రామర్ స్క్రిల్స్ ఇంప్రూవ్ చేసుకోవటానికి Road To Grammar అనే వెబ్ సైట్ ఉపయోగపడుతుంది. దీనిలో 365 క్విజ్ లు, గ్రామర్ కి సంబంధించిన గేమ్స్, వీలున్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవటానికి డౌన్లోడ్స్ ఉన్నాయి.ఈ సైట్ ఉపయోగించటానికి ఎటువంటి రిజిస్టేషన్ అవసరం లేదు  పూర్తిగా ఉచితం. 


’Quizzes' లో నచ్చిన టాపిక్ ని ఎంచుకొని ప్రక్కనే ఉన్న ’Start' పై క్లిక్ చెయ్యాలి. క్విజ్ లో వచ్చే ప్రశ్నలకు సరైన సమాధానం పై క్లిక్ చెయ్యాలి, తప్పైన జవాబుకు సరైన సమాధానం అప్పుడే తెలుస్తుంది. ఇక్కడ క్విజ్ లో 365 టాపిక్స్ ఉన్నాయి. ’Extra Practice' లో ఉదాహరణ సహితంగా వివరణ ఉంటుంది. 

వెబ్ సైట్: Road To Grammar

ధన్యవాదాలు

Tuesday, October 16, 2012

చదవగానే అదృశ్యమయ్యే సీక్రెట్ మెసేజెస్ పంపాలా?

పాస్ వార్డ్స్ లేదా ఏదైనా రహస్యసమాచారం కావలసిన వారికి పంపినపుడు, అది వారు చదవగానే అదృశ్యమవ్వాలా? అయితే మీరు డిజిటల్ ఇస్పిరేషన్ రూపొందించిన గూగుల్ షీట్ ని మీ అకౌంట్ లో కాపీ చేసుకొని, ఆషీట్ లో ఎక్కడైనా రహస్య సమాచారాన్ని టైప్ చేసి 'Share' బటన్ పై క్లిక్ చేసి కావలసిన వారికి మెయిల్ పంపవచ్చు. షేర్ విండో లో పర్మిషన్ 'Can Edit' ఉండేలా చూసుకోవాలి. మనం పంపిన మెయిల్ రిసీవ్ చేసుకున్న వారు మనం పంపిన గూగుల్ షీట్ లోని సమాచారాన్ని పది సెకన్లలో చదవాలి, పది సెకన్ల తర్వాత అక్కడ సమాచారం అదృశ్యమయ్యేలా గూగుల్ షీట్ కి గూగుల్ అప్స్ స్క్రిప్ట్ జతచెయ్యబడింది.  


మరింత సమాచారం కోసం డిజిటల్ ఇస్ఫిరేషన్ సైట్ చూడండి.
గూగుల్ షీట్
ధన్యవాదాలు

Friday, October 12, 2012

CarotDav - క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ని ఒకేచోట నుండి యాక్సెస్ చెయ్యటానికి!!!

క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ ని అందిస్తున్న ప్రముఖ Dropbox, SkyDrive, Google Drive, మరియు SugarSync లను ఒకే చోట నుండి యాక్సెస్ చెయ్యటానికి  ఉచిత ఆల్-ఇన్-వన్ డెస్క్ టాప్ అప్లికేషన్  CarotDav ఉపయోగపడుతుంది. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆయా సైట్ల కి ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఆయా సైట్ల ఆథెంటికేషన్  ప్రాసెస్ కూడా చాలా సులువు.  


డౌన్లోడ్: CarotDav

ధన్యవాదాలు

Thursday, October 11, 2012

RailRadar - కావలసిన రైలు ప్రస్తుతం ఎక్కడ ఉందో గూగుల్ మాప్స్ లో తెలుసుకోవటానికి!!


భారత రైల్వే RailRadar  అనే సర్వీస్ ని ప్రారంభించింది, దీనిని ఉపయోగించి మనకు కావలసిన రైలు యొక్క ప్రస్తుత జియోగ్రాఫికల్ లోకేషన్ ని గూగుల్ మాప్స్ లో చూడవచ్చు.  రైలు యొక్క రాక/ పోకలు తెలుసుకోవటానికి  కావలసిన స్టేషన్ కోసం మ్యాప్ పై జూమ్ ఇన్ చెయ్యాలి అది మౌస్ సహాయంతో గాని లేదా ఎడమచేతి ప్రక్కన ఉన్న + గుర్తు పై క్లిక్ చెయ్యవచ్చు. ఇలా కావలసిన స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న కావలసిన ట్రైన్ గుర్తు పై క్లిక్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. రైలు యొక్క ప్రస్తుత లొకేషన్ తో పాటు రూట్ మరియు ఆగే స్టేషన్లను కూడా తెలుసుకోవచ్చు.  బ్లూ కలర్ లో ఉన్నవి సరైన సమయం లో మరియు రెడ్ కలర్ లో ఉన్నవి ఆలస్యంగా నడుస్తున్నవని అర్ధం. ప్రతి ఐదు నిమిషాలకు ఇక్కడ సమాచారం రిఫ్రెష్ అవుతుంది.



వెబ్ సైట్: RailRadar

ధన్యవాదాలు

Friday, October 5, 2012

Personal Passwords Generator - ఉచిత పాస్ వార్డ్ జెనెరేటర్

ప్రముఖ LeluSoft వారు రూపొందించిన మరొక ఉచిత అప్లికేషన్ Personal Passwords Generator, దీనిని ఉపయోగించి 14 విధాలుగా వివిధ కాంబినేషన్లలో పాస్ వార్డ్ లను జెనెరేట్ చేసుకోవచ్చు. ముందుగా Personal Passwords Generator ని డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవాలి, ఇనస్టలేషన్ సమయం లో కొన్ని టూల్ బార్స్ ఇనస్టలేషన్ అవకుండా వాటిని అన్-చెక్ చెయ్యాలి. అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత Paasword type దగ్గర కావలసిన కాంబినేషన్ ని ఎంచుకోవాలి తర్వాత Password Length దగ్గర క్యారెక్టర్ లెంగ్త్ ఇవ్వాలి. పాస్ వార్డ్ జెనెరేట్ చెయ్యటం కోసం ’Key' గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చెయ్యాలి. జెనెరేట్ అయిన పాస్ వార్డ్ నచ్చకపోతే మరొక దానికై ’Key' గుర్తు ఉన్న బటన్ పై క్లిక్ చేస్తూ ఉండాలి. ’Lock' బటన్ పై క్లిక్ చేసి పాస్ వార్డ్ ని ఎన్ క్రిప్ట్ చేసుకోవచ్చు మరియు ’Save' బటన్ పై క్లిక్ చేసి పాస్ వార్డ్ ని .txt పైల్ గా సేవ్ చేసుకోవచ్చు. Encrypt చేసిన పాస్ వార్డ్ ని Decript కూడా చెయ్యవచ్చు.


ఫీచర్లు: 
- Only 1.06 mb
- Portable (after the first installation)
- A single executable
- Simple to use and fast
- 14 Different passwords types
- Custom password type let you set the base characters set
- Passwords can be saved encrypted
Freeware

డౌన్లోడ్:Personal Passwords Generator

ధన్యవాదాలు