Wednesday, April 29, 2009

FotoMorph 6.0 - ఉచిత ఫోటోమార్ఫింగ్ సాప్ట్ వేర్

పాత ఫాంటసీ సినిమాల్లో మాంత్రికుడు మనుషులను కుక్కలగానో, కోతులుగానో యిలా వివిధ రూపాలలోకి మార్చటం మనం చూశాం...అలానే హీరో ఒక రూపం నుండి మరొక రూపం లోకి మారుతూవుంటాడు... దానినే పరకాయప్రవేశం అంటాం... సరే ... ఒకరి ఫోటో ని వేరొకరి ఫోటో గా మార్చటాన్ని ... మార్ఫింగ్ అంటాం...దీనికోసం ఇంటర్నెట్ చాలా ఉచిత ఫోటోమార్ఫింగ్ సాప్ట్ వేర్లు దొరుకుతాయి ... వాటిలో ఒక మంచి ఉచిత సాప్ట్ వేర్ FotoMorph 6.0 ... ఇది యూజర్ ఫ్రెండ్లీ ఫోటో యానిమేషన్ టూల్. FotoMorph 6.0 ఫైల్ డౌన్ లోడ్ సైజ్ 6.53 MB మాత్రమే...ఇది ఉచిత సాప్ట్ వేరే కాని ఇమేజ్ క్రింద చిన్న వాటర్ మార్క్ వస్తుంది.



FotoMorph తో సరదాగా మీ బంధుమిత్రుల ఫోటోలను మారుస్తూ ఆశ్చర్యచకితులను చెయ్యండి.

డౌన్ లోడ్: FotoMorph


ధన్యవాదాలు

Everything - ఫాస్ట్ డెస్క్ టాప్ సెర్చ్ ఇంజిన్


విండోస్ డీఫాల్ట్ సెర్చ్ చాలా స్లోగా వుంటుంది...ఫైల్స్ మరియు ఫోల్డర్లను వేగంగా సెర్చ్ చెయ్యటానికి చిన్న మరియు ఉచిత డెస్క్ టాప్ సెర్చ్ ఇంజిన్ Everything బాగా ఉపయోగపడుతుంది. Everything ఫైల్/ ఫోల్డర్ పేర్లను ఉపయోగించి అతి తక్కువ సమయం లో ఇండెక్స్ చేస్తుంది. దీనితో ఫైల్/ ఫోల్డర్ లను మాత్రమే సెర్చ్ చెయ్యవచ్చు కాని ఫైల్ కంటెంట్ ని సెర్చ్ చెయ్యలేము. ఇది Windows 2000, XP, 2003 and Vista లలో పని చేస్తుంది మరియు Local NTFS Volumes లలోని ఫైల్/ ఫోల్డర్ లను మాత్రమే సెర్చ్ చేస్తుంది.


కేవలం ఫైల్/ ఫోల్డర్ లను వేగంగా సెర్చ్ చెయ్యటానికి Everything ఉపయోగపడుతుంది.

డౌన్ లోడ్: Everything

ధన్యవాదాలు

Tuesday, April 28, 2009

Smart Installer Pack తో మీ క్రొత్త సిస్టం కి అవసరమయ్యే సాప్ట్ వేర్లు ఆటోమాటిక్ గా ఇనస్టలేషన్ చేసుకోండి...

మీరు క్రొత్తగా సిస్టం కొన్నారా లేదా ఆపరేటింగ్ సిస్టం తిరిగి ఇనస్టలేషన్ చేశారా ...అయితే Smart Installer Pack అనే ఉచిత సాప్ట్ వేర్ మీకు ఉపయోగపడుతుంది. మీ సిస్టం కు అవసరమయ్యే సాప్ట్ వేర్ల కోసం వెతుక్కోకుండా సిస్టం అవసరమయ్యే కనీస సాప్ట్ వేర్లు ఈ Smart Installer Pack లో వున్నాయి. వాటిలో కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. Smart Installer Pack ఫైల్ డౌన్లోడ్ సైజ్ 227 MB. ఈ ప్యాక్ లో వున్న సాప్ట్ వేర్లు:




ధన్యవాదాలు

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ ...


హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ http://www.htp.gov.in/ లో మీ వెహికిల్ పై వున్న పెండింగ్ ట్రాఫిక్ చలనాలను చూసుకోవచ్చు మరియు ఆన్ లైన్ లో పే చేసే సదుపాయం కూడా వుంది. దీనికోసం సైట్ లో e Challan Status పై క్లిక్ చేసి మీ వెహికిల్ రిజిస్ట్రేషన్ నంబర్ పూర్తిగా ఎంటర్ చేస్తే మీ వెహికిల్ పై ఏవైనా పెండింగ్ ట్రాఫిక్ చలనాలు వుంటే ఆ లిస్ట్ వస్తుంది. రాంగ్ చలానా వస్తే ఏంచెయ్యాలి? అనే దాని గురించి, ఇంకా లైవ్ ట్రాఫిక్ అప్ డేట్స్ చూడవచ్చు, రోడ్ రూల్స్ కూడా తెలుసుకోవచ్చు.

ఇంకెందుకు ఆలశ్యం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వెబ్ సైట్ కి వెళ్ళి వెహికిల్ పై ట్రాఫిక్ చలనాలేవైనా పెండింగ్ వున్నయేమో చెక్ చేసుకోండి.

ధన్యవాదాలు

Friday, April 24, 2009

Backup To EMail తో మీ ఫైల్ లేదా ఫోల్డర్ ని మీ మెయిల్ కి బ్యాక్ అప్ తీసుకోండి ...

Backup To EMail అనే చిన్న ఉచిత అప్లికేషన్ ని ఉపయోగించి ఏదైనా ఫోల్డర్ లేదా ఫైల్ ని మీ మెయిల్ కి అంటే జీమెయిల్ కి బ్యాక్ అప్ తీసుకోవచ్చు. 10 MB కన్నా ఎక్కువ సైజ్ వున్న ఫైళ్ళను స్ప్లిట్ చేసి పంపుతుంది. ముందుగా Backup To EMail ని డౌన్ లోడ్ చేసుకుని ఇనస్టలేషన్ చేసుకోవాలి. ఇది విండోస్ తో ఇంటిగ్రేట్ అయ్యి, మనం ఏ ఫైల్/ ఫోల్డర్ ని అయితే జీమెయిల్ కి బ్యాక్ అప్ తీసుకోవాలి అనుకుంటున్నామో దాని పై మౌస్ రైట్ క్లిక్ చేసి Backup To EMail సెలెక్ట్ చేసుకోవాలి.



మరింత సమాచారం కోసం Backup To EMail సైట్ సందర్శించండి.

ధన్యవాదాలు

Thursday, April 23, 2009

UnlockMe - Processes చే లాక్ చెయ్యబడిన ఫైల్స్ / ఫోల్డర్స్ ని అన్ లాక్ చెయ్యటానికి...

విండోస్ లో ఏదైనా ఫైల్/ఫోల్డర్ ని డిలీట్/మూవ్/ రీనేమ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ క్రింద యిచ్చిన మెసేజ్ వచ్చి యిబ్బంది పెట్టటం గమనిస్తూ వుంటాం:

- Cannot delete file: Access is denied.
- There has been a sharing violation.
- The source or destination file may be in use.
- The file is in use by another program or user.
- Make sure the disk is not full or write-protected and that the file is not currently in use.

దీనికి పరిష్కారం UnlockMe అనే ఫ్రీవేర్ తో లభిస్తుంది. UnlockMe ని మీ సిస్టం లో ఇనస్టలేషన్ చేసుకొని, ఏదైనా ఫైల్/ఫోల్డర్ ని డిలీట్/మూవ్/ రీనేమ్ చేసేటప్పుడు పైన చెప్పబడిన మెసేజెస్ లో ఏదైనా వచ్చినప్పుడు ఆ ఫైల్/ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసి UnlockMe సెలెక్ట్ చేసుకోవాలి. అంతే ఫైల్/ఫోల్డర్ అన్ లాక్ చెయ్యబడుతుంది, అప్పుడు దానిని డిలీట్/మూవ్/ రీనేమ్ చెయ్యవచ్చు.



డౌన్ లోడ్: UnlockMe

ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ : LockHunter


ధన్యవాదాలు

Wednesday, April 22, 2009

Recover Files - అవార్డ్ విన్నింగ్ ఫైల్ రికవరీ సాప్ట్ వేర్


Recover Files అనే అవార్డ్ విన్నింగ్ ఫైల్ రికవరీ సాప్ట్ వేర్ ని ఉపయోగించి సిస్టం నుండి శాశ్వతంగా తొలగించబడిన ఫైళ్ళను (Even files removed from the Recycle Bin, network drive, compact flash card, portable drives, in a DOS window, or from Windows Explorer with the SHIFT key held down) రికవర్ చెయ్యవచ్చు. Recover Files అన్ని విండోస్ వెర్షన్స్ లో పనిచేస్తుంది మరియు NTFS / FAT పార్టీషన్ల నుండి తొలగించబడిన డాటాని రికవర్ చేస్తుంది. ఇది శక్తివంతమైన వేగంగా పనిచేసే ఉపయోగకరమైన ఉచిత సాప్ట్ వేర్.

మరింత సమాచారం కోసం Recover Files సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Monday, April 20, 2009

విండోస్ కోసం ఉచిత బ్యాక్ అప్ సాప్ట్ వేర్లు


ఏదైనా కారణాల వలన డాటా పోకుండా/కరప్ట్ కాకుండా సురక్షితంగా వుండాలంటే తరచూ బ్యాక్ అప్ తీసుకుంటూ వుండాలి. సాధారణంగా మనం మాన్యువల్ గా కావలసిన ఫైల్స్/ఫోల్డర్ లను హార్డ్ డిస్క్ లేదా స్టోరేజ్ డివైస్ లో తీసుకుంటాం. ఒక్కొక్కసారి మరచిపోతాం ...ఫైల్ లాస్/కరప్ట్ అయిన తర్వాత అయ్యో ముందే బ్యాక్ అప్ తీసుకుంటే బాగుండేదే అని అనిపిస్తుంది. అలా జరగకుండా ఒక షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా ఆటోమాటిక్ బ్యాక్ అప్ తీసుకోవటానికి నెట్ లో ఎన్నో వుచిత టూల్స్ లభిస్తున్నాయి. వాటిలో కొన్ని :-

1. Cobian Backup
2. Comodo Backup
3. Bonkey
4. FBackup
5. Jaback
6. Areca Backup
7. Microsoft Sync Toy
8. Ace Backup
9. SyncBack SE
10. Vista Backup Mill

ధన్యవాదాలు

Comodo System Cleaner - శక్తివంతమైన ఉచిత యుటిలిటీల సమాహారం


Comodo System Cleaner ని ఉపయోగించి మీ XP లేదా విస్టా సిస్టం ల పనితనాన్ని మెరుగు పర్చటంతోపాటు క్లీన్ మరియు సురక్షితంగా వుంచుతుంది. Comodo System Cleaner లో రిజిస్ట్రీ క్లీనర్, డిస్క్ క్లీనర్, ప్రైవసీ క్లీనర్, ఆటో రన్ మేనేజర్ ఇలా వివిధ అప్లికేషన్లు వున్నాయి. సిస్టం ని పూర్తిగా స్కాన్ చేసి అనవరమైన డాటాని తొలగిస్తుంది.

మరింత సమాచారం కోసం Comodo System Cleaner సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

Friday, April 17, 2009

FunPhotoBox - Make funny pictures online


మీ ఫోటోలకు ఆన్ లైన్ లో సరదాగా కొన్ని ఎఫెక్ట్ లు జత చెయ్యాలనుకుంటున్నారా ...అదీ కేవలం మూడు స్టెప్పుల్లో ... అయితే FunPhotoBox సైట్ కి వెళ్ళాలి.

౧. ముందుగా ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
౨. సిస్టం నుండి లేదా వెబ్ అడ్రస్ నుండి ఇమేజ్ అప్ లోడ్ చేసుకోవాలి.
౩. ’GO' పై క్లిక్ చేస్తే మన ఫోటో కు మన సెలెక్ట్ చేసుకున్న ఎఫెక్ట్స్ అప్లై అవుతాయి... ఇక దానిని సేవ్ చేసుకోవటమే...

ధన్యవాదాలు

Alternative To - ప్రముఖ సాప్ట్ వేర్ల కు ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల కోసం

ఏదైనా ప్రముఖ సాప్ట్ వేర్ల కు ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల కోసం వెతుకుతున్నారా అయితే Alternative To సైట్ ని సందర్శించండి. విండోస్, మాక్, లైనక్స్, ఆన్ లైన్ ఇలా వివిధ క్యాటగిరీలలో వాటికి సంబంధించిన అప్లికేషన్లు వుంటాయి. వాటిలో కావల్సిన దానిని పై క్లిక్ చేస్తే వాటికి సంబంధించిన ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల లిస్ట్ వస్తుంది. అంతేకాకుండా మనకు కావల్సిన సాప్ట్ వేర్ల కు సంబంధించిన సైట్ కి అక్కడ నుంచే వెళ్ళవచ్చు. మనం కూడా ప్రత్యామ్నాయ సాప్ట్ వేర్ల ను సజెస్ట్ చెయ్యవచ్చు.



ధన్యవాదాలు

Wednesday, April 15, 2009

Gazup - మీ ఫైళ్ళను మల్టిపుల్ ఫైల్ హోస్ట్ లకు ఒకేసారి అప్ లోడ్ చెయ్యటానికి

Gazup సైట్ నుండి మీ ఫైళ్ళను ఒకేసారి వివిధ ఫైల్ హోస్ట్ లకు అప్ లోడ్ చేసుకోవచ్చు. అదీ ఉచితంగా...దీనికోసం ముందుగా సైట్ లో రిజిస్టర్ చేసుకొని ...లాగిన్ అయ్యి కావల్సిన ఫైళ్ళను... సెలెక్ట్ చేసుకొన్న ఫైల్ హోస్ట్ లకు ఒకేసారి అప్ లోడ్ చేసుకోవచ్చు.




మరింత సమాచారం కోసం Gazup సైట్ ని సందర్శించండి.

ధన్యవాదాలు

విండోస్ క్యాలుక్యులేటర్ నుండి వెబ్ సైట్లు బ్రౌజ్ చెయ్యండి ....

విండోస్ సాధారణ క్యాలుక్యులేటర్ నుండి వెబ్ సైట్లు ఎలా బ్రౌజ్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం ....

౧.ముందుగా Start ---> All Programs---> Accessories ---> Calculator ఓపెన్ చెయ్యాలి.



౨. క్యాలుక్యులేటర్ మెయిన్ మెనూ లో Help లో Help Topics పై క్లిక్ చెయ్యాలి లేదా [F1] కీ ప్రెస్ చేస్తే హెల్ప్ విండో ఓపెన్ అవుతుంది.


౩. హెల్ప్ విండో లో ఎడమచేతి ప్రక్కనున్న క్వశ్చన్ మార్క్ పై క్లిక్ చేసి Jump to URL సెలెక్ట్ చేసుకోవాలి.


౪. Jump to URL విండోలో Jump to this URL దగ్గర మీరు బ్రౌజ్ చెయ్యాలనుకుంటున్న వెబ్ సైట్ అడ్రస్ ఎంటర్ చేసి ’Ok' పై క్లిక్ చెయ్యాలి, అంతే హెల్ప్ విండోలో కుడిచేతి ప్రక్క వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.



ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ బ్రౌజర్ పని చెయ్యకుంటే పైన చెప్పిన విధంగా క్యాలుక్యులేటర్ నుండి వెబ్ సైట్లు బ్రౌజ్ చేసుకోవచ్చు.

ధన్యవాదాలు

Thursday, April 9, 2009

LogMeIn తో రిమోట్ లో మీ సిస్టం యాక్సెస్ చెయ్యండి...


రిమోట్ లో ఎప్పుడైనా ఎక్కడైనా మీ సిస్టం యాక్సెస్ చెయ్యాలనుకుంటున్నారా ...అదీ ఉచితంగా ... అయితే LogMeIn అనే ఒక మంచి ఉచిత రిమోట్ యాక్సెస్ అప్లికేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఈ క్రింద చెప్పిన విధంగా చెయ్యండి:

౧.ముందుగా LogMeIn సైట్ కి వెళ్ళాలి, అక్కడ వివిధ అప్లికేషన్లు వున్నాయి, వాటిలో Personal Remote Access లో రిమోట్ కంట్రోల్ కోసం మాత్రమే అయితే LogMeIn Free ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

౨. LogMeIn Free ని డౌన్ లోడ్ చేసుకోవటానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, యాక్టివేషన్ లింక్ మెయిల్ ఐడి కి పంపబడుతుంది. దానిని పై క్లిక్ చేస్తే యాక్టివేట్ అయ్యి, సాప్ట్ వేర్ డౌన్ లోడ్ విండో లో రన్ పై క్లిక్ చేస్తే మన సిస్టం లో LogMeIn ఇనస్టలేషన్ చెయ్యబడుతుంది. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత LogMeIn -Enabled and Online అనే ఐకాన్ సిస్టం ట్రే లో కనబడుతుంది.

౩. ఇప్పుడు మీ సిస్టం రిమోట్ లో యాక్సెస్ చెయ్యటానికి ఇంటర్నెట్ కనెక్షన్ వున్న వేరొక సిస్టం లో ఏదైనా బ్రౌజర్ వుపయోగించి http://www.logmein.com/ కి వెళ్ళి ముందుగా రిజిస్టర్ చేసుకున్న-మెయిల్ ఐడి , పాస్ వార్డ్ తో లాగిన్ అవ్వాలి. అక్కడ మన సిస్టం కనబడుతుంది, ప్రక్కనవున్న రిమోట్ కంట్రోల్ పై క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది, సిస్టం లాగిన్ ఐడి మరియు పాస్ వార్డ్ ఎంటర్ చేస్తే సిస్టం కనెక్ట్ అవుతుంది.

౪. ఇక బ్రౌజర్ లో మీ సిస్టం కనబడుతుంది, అక్కడ కనబడే ఇమేజ్ లపై మౌస్ క్లిక్, డబల్ క్లిక్ లేదా రైట్ క్లిక్ చేసి కావలసిన ఫైల్ లేదా ఫోల్డర్ ని యాక్సెస్ చెయ్యవచ్చు. సిస్టం షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చేసుకొనే అవకాశం కూడా వుంది. మల్టిపుల్ యూజర్ యాక్సెస్ సదుపాయం కలదు.

మరింత సమాచారం కోసం LogMein సైట్ కి వెళ్ళండి.

ఆరోగ్య చిట్కా: కాకరకాయల రసం ఒక ఔన్సు ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే బ్లడ్ ప్రషర్ తగ్గుతుంది.

ధన్యవాదాలు

Wednesday, April 8, 2009

PdfMerge - పీడీఎఫ్ ఫైళ్ళను మెర్జ్ లేదా స్ప్లిట్ చెయ్యటానికి ఉచిత సాప్ట్ వేర్


PdfMerge - అనే ఉచిత టూల్ ని ఉపయోగించి పీడీఎఫ్ డాంక్యుమెంట్లను మెర్జ్ లేదా స్ప్లిట్ చేసుకోవచ్చు. దీనిని వుయోగించటానికి .Net Framework 2 తప్పనిసరి. Windows 2000/XP/2003/Vista లలో పనిచేస్తుంది. pdfmerge లో పాస్ వార్డ్ తో ప్రొటెక్ట్ చెయ్యబడిన ఫైళ్ళను స్ప్లిట్ లేదా మెర్జ్ చెయ్యలేము.

PdfMerge ఫీచర్లు:
Allows the split and merge process to be driven from a list file
Allows the creation of bookmark trees by specifying bookmarks to be added (bookmarks are also called outlines)
Allows the import of bookmarks from the merged documents.
Supports merging of large documents quickly
Allows population of document title fields

ధన్యవాదాలు

Monday, April 6, 2009

Perfect PDF Reader 5 - ఎడోబ్ రీడర్ కి ప్రత్యామ్నాయం


పీడీఎఫ్ డాంక్యుమెంట్లు చదవటానికి Perfect PDF Reader 5 - ఎడోబ్ రీడర్ కి ఒక ప్రత్యామ్నాయం. Perfect PDF Reader 5 సైట్ లో చెప్పిన దాని ప్రకారం దానిలోని ఫీచర్లు (నేను యింకా చెక్ చెయ్య లేదు):

- open, read, display any PDF file
- print PDF documents
- export PDF as plain text
- export PDF by the page as images (not available in Adobe Reader!)
- great number of navigation and display modes, zoom
- rotate pages
- send PDF file via email
- extract text and images
- clipboard
- search function with appropriate options
- fill, save and send PDF forms (not available in Adobe Reader!)
- digital signatures

పైన చెప్పిన వాటిలో "fill, save and send PDF forms (not available in Adobe Reader!)" ఈ ఫీచర్ Adobe Reader లో కూడా వుంది అలానే డిజిటల్ సిగ్నేచర్లు కూడా యాడ్ చేసుకోవచ్చు.


ధన్యవాదాలు

Google Pack - మీ సిస్టంకి అవసరమయ్యే ఉచిత సాప్ట్ వేర్ల సమాహారం

సిస్టం పనితనాన్ని మెరుగుపరచటానికి ఉపయోగపడే ఉచిత సాప్ట్ వేర్ల సమాహారమే Google Pack . ఈ ప్యాక్ లో వుండే సాప్ట్ వేర్లు:

౧.Google Chrome Web Browser
౨.Google Apps
౩.Google Earth
౪.Google Toolbar for IE
౫.Norton Security Scan
౬.Spyware Doctor
౭.Google Desktop
౮.Picasa
౯.Google Photos Screensaver
౧౦.Adobe Reader
౧౧.Firefox with Google Toolbar
౧౨.Skype
౧౩.RealPlayer

పైన చెప్పిన సాప్ట్ వేర్ల ను మొత్తంగా కానీ కావలసిన వాటిని సెలెక్ట్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరింత సమాచరం కోసం Google Pack సైట్ ని సందర్శించండి.

System Requirements: Windows XP or Vista

ధన్యవాదాలు

Thursday, April 2, 2009

దివ్య యోగ్ మందిర్ వెబ్ సైట్


ఆధునిక జీవన్ శైలి లో మానసిక ఒత్తిడి, వాతావరణ సమస్యలు, శారీరక శ్రమ లేకపోవటం వలన ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలకు గురిఅవుతున్నాం. ఉదయాన్నే 30 నుండి 45 నిమిషాల వరకు నడవటంతో పాటు యోగా చెయ్యటం వలన మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలనుండి విముక్తి పొందవచ్చు. స్వామీ శంకర్ దేవ్ జీ, స్వామీ రామ్ దేవ్ జీ, ఆచార్య బాలక్రుష్ణ జీ, స్వామీ ముక్తానంద జీ లచే నిర్వహించబడుతున్న దివ్య యోగ్ మందిర్ (ట్రస్ట్) ద్వారా దేశ విదేశాల్లో యోగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. దివ్య యోగ్ మందిర్ (ట్రస్ట్) చెందిన వెబ్ సైట్ http://www.divyayoga.com/main.htm లో ప్రాణాయం గురించి, ఎలా చెయ్యాలో తెలిపే వీడియోలు , దాని వలన కలిగే ప్రయోజనాలు స్వామీ రామ్ దేవ్ జీ చాలా చక్కగా వివరించారు. అలాగే యోగాసనాలు, ముద్రలు ఎలా చెయ్యలో, వాటివలన చేకూరే ప్రయోజనాలను చిత్రాలతో చాలా చక్కగా వివరించారు. దివ్య యోగ్ మందిర్ (ట్రస్ట్) వారి ఆయుర్వేదిక్ ఉత్పత్తులు, యోగా కి సంబంధించిన పుస్తకాలు, సీడీ/డీవీడీ ల వివరాలు కూడా ఈ సైట్ లో వున్నాయి.

యోగా ద్వారా మీ జీవనశైలి మార్చుకోండి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.

ధన్యవాదాలు

Wednesday, April 1, 2009

101 ఉత్తమ ఉచిత అప్లికేషన్లు

101 ఉత్తమ ఉచిత అప్లికేషన్లు అక్షరక్రమంలో :

Advanced SystemCare Free BEST BET
Affixa
a-Squared HiJackFree
Attack Trace
Avast Home Edition BEST BET
Box.net
CheckPlease
Clipboard Help and Spell
Comodo EasyVPN Home
DeferredSender
Defraggler
Digsby BEST BET
Drive Manager
Dropbox
Drop.io
DVD Flick BEST BET
Embedr
EULAlyzer
Evernote
Feeds Plus
FireFTP
5min
Flowgram
FreeConference
Glue
Gmail Labs BEST BET
Google Calendar Sync BEST BET
Google Latitude
Google Mobile
Google Preview
Google Sync
GreenPrint World
Gubb
HandBrake
IE7Pro
Jing
KickYouTube
KidZui
LastPass
List.it BEST BET
Microsoft Live Mesh
Minimap Sidebar
MixTape.me
Mojo
myHours.com
NutshellMail
Online Armor Personal Firewall
OpenOffice.org BEST BET
OpenTable
Pageonce
PhotoFunia
PhotoPerfect Express BEST BET
PimpMyNews
Ping.fm
Pipl
PortableApps.com Suite
Postbox
PrimoOnline
PrintWhatYouLike
Qipit
Qitera BEST BET
Recuva
Remember the Milk
Remote
RerunCheck
Rockbox
RocketDock
ScreenToaster
SharePod
Shazam BEST BET
Skitch
SkyDrive
Skype 4.0
Slydial
Songbird BEST BET
Splicd
Spokeo
SpywareBlaster
StartUpLite
Sumo Paint
SuperAntiSpyware
Tatango
360Desktop
TrapCall
TripChill
TuneUp
TV.com
TweetDeck
Ultimate Windows Tweaker
Video DownloadHelper
Vista Services Optimizer
Windows Live Sync BEST BET
Wowbrary
Wubi Ubuntu Installer BEST BET
XBMC
Yelp
Zemanta
Zigtag
Zoho Mail
Zoho Planner
Zumbox

మూలం: PCWORLD

ధన్యవాదాలు