Thursday, April 9, 2009

LogMeIn తో రిమోట్ లో మీ సిస్టం యాక్సెస్ చెయ్యండి...


రిమోట్ లో ఎప్పుడైనా ఎక్కడైనా మీ సిస్టం యాక్సెస్ చెయ్యాలనుకుంటున్నారా ...అదీ ఉచితంగా ... అయితే LogMeIn అనే ఒక మంచి ఉచిత రిమోట్ యాక్సెస్ అప్లికేషన్ మీకు ఉపయోగపడుతుంది. ఈ క్రింద చెప్పిన విధంగా చెయ్యండి:

౧.ముందుగా LogMeIn సైట్ కి వెళ్ళాలి, అక్కడ వివిధ అప్లికేషన్లు వున్నాయి, వాటిలో Personal Remote Access లో రిమోట్ కంట్రోల్ కోసం మాత్రమే అయితే LogMeIn Free ని ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

౨. LogMeIn Free ని డౌన్ లోడ్ చేసుకోవటానికి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, యాక్టివేషన్ లింక్ మెయిల్ ఐడి కి పంపబడుతుంది. దానిని పై క్లిక్ చేస్తే యాక్టివేట్ అయ్యి, సాప్ట్ వేర్ డౌన్ లోడ్ విండో లో రన్ పై క్లిక్ చేస్తే మన సిస్టం లో LogMeIn ఇనస్టలేషన్ చెయ్యబడుతుంది. ఇనస్టలేషన్ పూర్తి అయిన తర్వాత LogMeIn -Enabled and Online అనే ఐకాన్ సిస్టం ట్రే లో కనబడుతుంది.

౩. ఇప్పుడు మీ సిస్టం రిమోట్ లో యాక్సెస్ చెయ్యటానికి ఇంటర్నెట్ కనెక్షన్ వున్న వేరొక సిస్టం లో ఏదైనా బ్రౌజర్ వుపయోగించి http://www.logmein.com/ కి వెళ్ళి ముందుగా రిజిస్టర్ చేసుకున్న-మెయిల్ ఐడి , పాస్ వార్డ్ తో లాగిన్ అవ్వాలి. అక్కడ మన సిస్టం కనబడుతుంది, ప్రక్కనవున్న రిమోట్ కంట్రోల్ పై క్లిక్ చేస్తే కనెక్ట్ అవుతుంది, సిస్టం లాగిన్ ఐడి మరియు పాస్ వార్డ్ ఎంటర్ చేస్తే సిస్టం కనెక్ట్ అవుతుంది.

౪. ఇక బ్రౌజర్ లో మీ సిస్టం కనబడుతుంది, అక్కడ కనబడే ఇమేజ్ లపై మౌస్ క్లిక్, డబల్ క్లిక్ లేదా రైట్ క్లిక్ చేసి కావలసిన ఫైల్ లేదా ఫోల్డర్ ని యాక్సెస్ చెయ్యవచ్చు. సిస్టం షట్ డౌన్ లేదా రీస్టార్ట్ చేసుకొనే అవకాశం కూడా వుంది. మల్టిపుల్ యూజర్ యాక్సెస్ సదుపాయం కలదు.

మరింత సమాచారం కోసం LogMein సైట్ కి వెళ్ళండి.

ఆరోగ్య చిట్కా: కాకరకాయల రసం ఒక ఔన్సు ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే బ్లడ్ ప్రషర్ తగ్గుతుంది.

ధన్యవాదాలు