Thursday, April 2, 2009

దివ్య యోగ్ మందిర్ వెబ్ సైట్


ఆధునిక జీవన్ శైలి లో మానసిక ఒత్తిడి, వాతావరణ సమస్యలు, శారీరక శ్రమ లేకపోవటం వలన ఎన్నో మానసిక, శారీరక రుగ్మతలకు గురిఅవుతున్నాం. ఉదయాన్నే 30 నుండి 45 నిమిషాల వరకు నడవటంతో పాటు యోగా చెయ్యటం వలన మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలనుండి విముక్తి పొందవచ్చు. స్వామీ శంకర్ దేవ్ జీ, స్వామీ రామ్ దేవ్ జీ, ఆచార్య బాలక్రుష్ణ జీ, స్వామీ ముక్తానంద జీ లచే నిర్వహించబడుతున్న దివ్య యోగ్ మందిర్ (ట్రస్ట్) ద్వారా దేశ విదేశాల్లో యోగా క్యాంపులు నిర్వహిస్తున్నారు. దివ్య యోగ్ మందిర్ (ట్రస్ట్) చెందిన వెబ్ సైట్ http://www.divyayoga.com/main.htm లో ప్రాణాయం గురించి, ఎలా చెయ్యాలో తెలిపే వీడియోలు , దాని వలన కలిగే ప్రయోజనాలు స్వామీ రామ్ దేవ్ జీ చాలా చక్కగా వివరించారు. అలాగే యోగాసనాలు, ముద్రలు ఎలా చెయ్యలో, వాటివలన చేకూరే ప్రయోజనాలను చిత్రాలతో చాలా చక్కగా వివరించారు. దివ్య యోగ్ మందిర్ (ట్రస్ట్) వారి ఆయుర్వేదిక్ ఉత్పత్తులు, యోగా కి సంబంధించిన పుస్తకాలు, సీడీ/డీవీడీ ల వివరాలు కూడా ఈ సైట్ లో వున్నాయి.

యోగా ద్వారా మీ జీవనశైలి మార్చుకోండి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి.

ధన్యవాదాలు