విండోస్ లో ఏదైనా ఫైల్/ఫోల్డర్ ని డిలీట్/మూవ్/ రీనేమ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఈ క్రింద యిచ్చిన మెసేజ్ వచ్చి యిబ్బంది పెట్టటం గమనిస్తూ వుంటాం:
- Cannot delete file: Access is denied.
- There has been a sharing violation.
- The source or destination file may be in use.
- The file is in use by another program or user.
- Make sure the disk is not full or write-protected and that the file is not currently in use.
దీనికి పరిష్కారం UnlockMe అనే ఫ్రీవేర్ తో లభిస్తుంది. UnlockMe ని మీ సిస్టం లో ఇనస్టలేషన్ చేసుకొని, ఏదైనా ఫైల్/ఫోల్డర్ ని డిలీట్/మూవ్/ రీనేమ్ చేసేటప్పుడు పైన చెప్పబడిన మెసేజెస్ లో ఏదైనా వచ్చినప్పుడు ఆ ఫైల్/ఫోల్డర్ పై రైట్ క్లిక్ చేసి UnlockMe సెలెక్ట్ చేసుకోవాలి. అంతే ఫైల్/ఫోల్డర్ అన్ లాక్ చెయ్యబడుతుంది, అప్పుడు దానిని డిలీట్/మూవ్/ రీనేమ్ చెయ్యవచ్చు.
డౌన్ లోడ్: UnlockMe
ఇటువంటిదే మరొక సాప్ట్ వేర్ : LockHunter
ధన్యవాదాలు