విండోస్ సాధారణ క్యాలుక్యులేటర్ నుండి వెబ్ సైట్లు ఎలా బ్రౌజ్ చెయ్యాలో ఇక్కడ చూద్దాం ....
౧.ముందుగా Start ---> All Programs---> Accessories ---> Calculator ఓపెన్ చెయ్యాలి.
౨. క్యాలుక్యులేటర్ మెయిన్ మెనూ లో Help లో Help Topics పై క్లిక్ చెయ్యాలి లేదా [F1] కీ ప్రెస్ చేస్తే హెల్ప్ విండో ఓపెన్ అవుతుంది.
౩. హెల్ప్ విండో లో ఎడమచేతి ప్రక్కనున్న క్వశ్చన్ మార్క్ పై క్లిక్ చేసి Jump to URL సెలెక్ట్ చేసుకోవాలి.
౪. Jump to URL విండోలో Jump to this URL దగ్గర మీరు బ్రౌజ్ చెయ్యాలనుకుంటున్న వెబ్ సైట్ అడ్రస్ ఎంటర్ చేసి ’Ok' పై క్లిక్ చెయ్యాలి, అంతే హెల్ప్ విండోలో కుడిచేతి ప్రక్క వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చి మీ బ్రౌజర్ పని చెయ్యకుంటే పైన చెప్పిన విధంగా క్యాలుక్యులేటర్ నుండి వెబ్ సైట్లు బ్రౌజ్ చేసుకోవచ్చు.
ధన్యవాదాలు